Tuesday, August 2, 2016

భూమిమీదకు గ్రహాంతరవాసుల రాకపై నిజమెంత




                                                 భూమిమీదకు గ్రహాంతరవాసుల రాకపై నిజమెంత

మనం చాలా సినిమాలలో చూసి ఉంటాము వేరే గ్రాహం నుండి అంతరిక్షవాసులు భూమిమీదకు రావడం లేదా మనమే అక్కడకు వెళ్ళటం. కొన్ని ఉదాహరణలు అవతార్, ET , స్టార్ వార్స్ లాంటివి. కానీ ఈ విషయంలో ఎన్నో సైంటిఫిక్ సమస్యలు ఉన్నాయి.  తారాంతర ప్రయాణం (ఇంటర్ స్టెల్లార్ ) నకు ముఖ్యంగా ఎనర్జీ అతి ముఖ్యమైన సమస్య. 
ఊహాజనిత అంతరిక్ష నౌక - అంతరిక్ష మానవుడు

నక్షత్రాల మధ్య దూరం  astronomical యూనిట్ లలో కొలుస్తారు. మనకు సూర్యుడు తర్వాత అత్యంత దగ్గరి నక్షత్రం ఆల్ఫా సెంట్యారి . అది 4.7  కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. ఒక కాంతి సంవత్సరం అంటే 10 ట్రిలియన్ కిలో మీటర్లు లేదా దాదాపు 6 ట్రిలియన్ మైల్స్ . 1,000,000,000,000 =  ఒక ట్రిలియన్ . అంటే కాంతి వేగంతో మనం ప్రయాణం చేయగలిగితే పక్కనున్న నక్షత్రం చేరుకోవడానికి 4.37 సంవత్సరాలు పడుతుంది. ఐన్స్టీన్ థియరీ అఫ్ స్పెషల్ రిలేటివిటీ ప్రకారం ఏదైనా ద్రవ్యరాశి (మాస్ ) వేగాన్ని పెంచుకొన్నప్పుడు ద్రవ్యరాశి పెరుగుతుంది . చిన్న చిన్న వేగాలలో తేడా రాదు కానీ కాంతి వేగంతో ప్రయాణం చేస్తున్నప్పుడు ,  కాంతి వేగాన్ని చేరడానికి అవసరం అయిన శక్తి కన్నా ఇంకా ఎక్కువ శక్తి వేగాన్ని స్థిరంగా కాంతి వేగంతో  ఉంచడానికి అవసరం అవుతుంది.  దీనిని ఇంకొంచెం వివరంగా చూద్దాం !. 

ఇప్పుడొక గ్రహాంతరవాసుల  అంతరిక్ష నౌకను ఊహించండి. దాని బరువు దాదాపు 10 టన్నుల అనుకోండి.  అంతరిక్షం లోకి ఇద్దరు మనుషులను పంపించే నాసా వాళ్ళ అపోలో లూనార్ నౌక బరువు 15 టన్నులు కాబట్టి మనం గ్రహాంతర వాసుల నౌకను కొంచెం తక్కువగా 10 టన్నులు అనుకొందాం.

 ఇప్పుడు అది కాంతి వేగానికి  3 వ వంతు వేగం (c/3) అంటే  100,000,000 m/s తో వేగం అందుకోవాలి అంటే ఎంత ఎనెర్జీ కావాలి ?  ఎంత నెమ్మదిగా కాంతిలో 3 వ వంతు వేగానికి ఆ నౌక చేరినా కావలిసిన ఎనెర్జీ మాత్రం మారాడు .   అందుకే ఆ వేగాన్ని అందుకోవాలి అంటే 
E = ½mv² ( ఎనెర్జీ = 1/2 x మాస్ x వెలాసిటీ²)
 = ½ × 10,000 kg × (100,000,000 m/s)²
= 50 exajoules (5 × 1019 J). *ఎక్సజౌల్స్ =1018 జౌల్స్ 
ఇంత శక్తి  ఒక్కసారిగా కావాలి.

*యూనిట్ అఫ్  ఎనర్జీ ని జౌల్ అంటారు. ఒక జౌల్ అంటే - ఒక టెన్నిస్ బంతిని 22 km /s  విసరడానికి ఎంత శక్తి కావాలో అంత.  ఇప్పుడు ఎక్సజౌల్స్ అంటే 10000000000000000000.  
ఈ శక్తి ఈ భూమి మొత్తం మీద  ఒక నెల రోజుల పాటు ఉపయోగించే శక్తికి సమానం.  ఇంత శక్తీ కాంతి లో మూడవ వంతు చేరడానికి మాత్రమే, దానిని మెయిన్ టైన్ చెయ్యాలి అంటే ఇంకాస్త ఎక్కవ శక్తి కావలి. అంతే కదా . కారు స్టార్ట్ చెయ్యడానికి , స్టార్ట్ చేసి స్పీడ్ అందుకోవడానికి , అదే స్పీడ్ మైంటైన్ చెయ్యడానికి, ఫ్యూయల్ కావలిసిందే కదా !. ఇలా ఎంత దూరం వెళ్ళాలి అనే దానిమీద ఎంత శక్తి కావాలి అనే లెక్కలు ఆధారపడి ఉంటాయి. ఇంత శక్తిని ఎలా పొందడం మీరు రాకెట్ ఫ్యూయల్ గురించి తెలుసుకొనే ఉంటారు. అంతరిక్షంలోకి  సాటిలైట్ లు పంపించే రాకెట్ స్పీడ్ 8 నుండి 16 km /sec వరకు ఉంటుంది. మరి కాంతి లో మూడవ వంతు వేగం 100,00,00 k /sec చేరాలంటే ఎంత శక్తి కావాలో ఊహించండి. రాకెట్ ఫ్యూయల్ పనికిరాదు. ఎందుకంటే ఇది ఎక్కువగా ఆక్సిజన్ ఇతర పదార్ధాలలో కూడివుంటుంది. ప్రస్తుతానికి మనం అందుకోగలిగే గరిష్ట వేగం  16 km /sec , మనం గ్రహాంతర వాసులు గురించి మాట్లాడుకొంటున్నాం కాబట్టి వాళ్ళు కాంతి లో 3 వ వంతు వేగాన్ని చేరగలరు అనే ఊహతో మిగతా సాధ్యాసాధ్యాలు చూద్దాం!

సృష్టిలో ఏ పదార్ధం కాంతి కాదుకదా కాంతిలో మూడవ వంతు వేగాన్ని ఉత్పత్తి చేయలేదు. ఒక వేళ అంతరిక్ష వాసులు ఒక స్పేస్ షిప్ తయారు చేసుకొన్నా ఇంతకు ముందు చెప్పుకున్నట్లు కాంతిలో 3 వ వంతు వేగాన్ని చేరడానికి ఫ్యూయల్ తయారు చేసుకోవడం దాదాపు అసాధ్యం. కానీ ఒక్క antimatter (ప్రతిద్రవ్యం, వ్యతిరేక పదార్ధం ) ద్వారా సాధ్యపడొచ్చు. ఈ ప్రతిద్రవ్యం మాత్రమే పదార్ధాన్ని సంపూర్ణంగా మండించి  అత్యధిక శక్తిని అందించగలదు. ఐన్స్టీన్ ఫార్ములా
E = mc².   పదార్ధం సంపూర్ణంగా మండి (నాశనం అయి ) శక్తి ఉత్పన్నం అయ్యింది అనుకొందాం (అవ్వక పోవచ్చు ),

500 kgs ప్రతిద్రవ్యం నుండి ఇంత శక్తి పొందే వీలుంటుంది. 1000 kg × (3 × 108 m/s)² = 90 exajoules.
 ఇంతకు ముందు మనకు కావలిసింది 50 ఎక్సజౌల్స్ కదా , కాబట్టి ఈ శక్తి సరిపోతుంది అనుకోవచ్చు , కానీ ఇక్కడే చిన్న చిక్కు ఉంది. సరే అంతరిక్ష వాసులు ఒక నౌకను తయారు చేసుకొని , ప్రతిద్రవ్యం తో ఫ్యూయల్ తయారు చేసుకొని వస్తున్నారు అనుకొందా, కానీ వాళ్ళు 3 వ వంతు కాంతి వేగం నుండి భూమి కక్ష వేగానికి వాళ్ళ నౌక యొక్క వేగాన్ని తగ్గించాలి కదా ? వేగాన్ని తగ్గించాలి అంటే వేగాన్ని పెంచడానికి ఎంత శక్తి వాడారో అంతే శక్తి వాడాల్సి ఉంటుంది. అప్పటికే వాళ్ళ దగ్గర ఫ్యూయల్ అయిపోయి ఉంటుంది. అవలేదు అనుకొందాము , భూమి మీదకు వచ్చారు అనుకొందాము, తిరిగి వెళ్ళడానికి ఇప్పడు చెప్పిన శక్తి అంతా కావాలి. మనం మాట్లాడుకొంటున్నది ఇద్దరు కూర్చొనే స్పేస్ క్రాఫ్ , సినిమాలో చూపించినట్లు పెద్ద పెద్ద స్పేస్ షిప్పులు కాదు. నిజంగా అంత పెద్ద స్పేస్ షిప్ వాడితే ఈ ఉదాహరణకు వందల రెట్లు శక్తి కావాల్సి ఉంటుంది. మనం ఇంకా ప్రతిద్రవ్యం సృష్టించలేదు. ప్రతి ద్రవ్యమే కాదు ప్రతి పరమాణువు anti-atom లు కూడా ఇంకా మనం సృష్టించలేదు. 

 ఈ అనంత విశ్వంలో సైన్స్ మాత్రం మారదు , మనకైనా , గ్రహాంతర వాసులకైనా సైన్స్ సిద్ధాంతాలు ఒక్కటే .

ప్రయాణ శక్తి ఒక్కటే కాదు ఇక్కడ గ్రహాంతర వాసులు విచారించవలసింది, నిరోధక శక్తి కూడా. చిన్న చిన్న రేణువులు, అతి చిన్న పెయింట్ చుక్కలు కూడా అంత వేగంతో వస్తున్న అంతరిక్ష నౌకకు ఆటం బాబులా తగులుతాయి. మనం తయారు చేసిన అంతరిక్ష నౌకలు 10 k /s వేగంతో ప్రయాణించేవి చిన్న పెయింట్ తాకిడికి ఎలా దెబ్బతిన్నాయో మీరు పిక్చర్ లో చూడండి.

ఛాలెంజర్ నౌక STS 7 ఫ్రంట్ విండో చిన్న పెయింట్ చుక్క తగలడంతో ఎంత డామేజ్ అయ్యిందో 


 మరి 10,000 రెట్ల వేగంతో ప్రయాణించే గ్రహాంతర వాసుల నౌకలకు ఇదే పెయింట్ చుక్క తగిలితే 100 మిలియన్ రెట్లు దాని ప్రభావం ఉంటుంది.  ఒక చిన్న మంచు రేణువు తగిలింది అనుకొందాం  అప్పుడు అది 4 టన్నుల TNT (విస్పోటకం ) అంత శక్తి విడుదల చేస్తుంది.  హిరోషిమా బాంబు 13 TNT అయితే 4 టన్నుల TNT ఎంతో మీరే ఊహించండి. ఆ ఒత్తిడి ఎక్కడో ఒక చోట రిలీజ్ అవ్వాలి కదా, ఆ ఒత్తిడి స్పేస్ క్రాఫ్ మీద పడుతుంది. అదే 1 kg వస్తువు వచ్చి స్పేస్ క్రాఫ్ట్ ని గుద్దుకొంది అనుకొందాం , అప్పుడు ఒక మెగా టన్ను హైడ్రోజన్ బాంబు అంత శక్తి విడుదల అవుతుంది. 
హైడ్రోజన్ బాంబు



చిన్న చిన్న శకలాలు , ఆస్టరాయిడ్స్ తగిలితే ఇక చెప్పక్కరలేదు. మరి అంత వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు , ఏదైనా తగిలితే ఉత్పన్నం అయ్యే  టన్నుల కొద్దీ శక్తిని దారి మళ్లించి , స్పేస్ షిప్ కు ప్రమాదం లేకుండా చెప్పాలి అంటే ఇంకెన్ని టన్నుల నిరోధక శక్తి స్పేస్ క్రాఫ్ట్ కు ఉండాలి. స్పేస్ క్రాఫ్ట్ ఫ్యూయల్ మాత్రమే కాకుండా , ఈ విశాల అంతరిక్షంలో ఎదురయ్యే సవాళ్లు , వాటిని తప్పించుకొనే మార్గాలకోసం ఆ స్పేస్ షిప్ ఎంత శక్తితో పనిచేయాలో మీరే ఊహించండి. 

భూమి చుట్టూ ఉన్న దుమ్ము - ఇలా అంతరిక్షంలో ఎన్నో
                       కాబట్టి సైన్స్ ఫిక్షన్ కథలలో లాగ ఎగిరే పళ్ళాలలో గ్రహాంతర వాసులు వచ్చి పలకరించి పోతారు అని చదివితే , సినిమాలలో చూస్తే బాగుంటుంది కానీ , నిజానికి అత్యంత వేగంతో ప్రయాణించే నౌకలను తయారు చేసి , వాటిలో అత్యంత శక్తి వంతమైన ఇంధనం నింపడం అంటే సైన్స్ కి ఇంకా చాలా దూరంలో ఉంది. ఇన్ని కష్టాలు పడి , మన పక్క నక్షత్రం ఆల్ఫా సెంట్యారి లో ఉన్న ఒక గ్రహం ఆల్ఫా సెంట్యారి B నుండి గ్రహాంతర వాసులు (ఒక వేళ ఉంటే ) వచ్చి మనలను చూసి వెళ్లారు అనుకొంటే (కాంతిలో 3 వ వంతు వేగం తో వస్తే ) వారికి అది 25 సంవత్సరాలు పడుతుంది.  ఇక ఇంకా సుదూర నక్షత్రాల సంగతి ఎవరికి తెలుసు? అందుకే అత్యంత సాంకేతిక పరిజ్ఞానం ఉన్న గ్రహాంతర వాసులు ఒక వేళ ఉంటే, ఇంత కష్టపడి వచ్చిన వాళ్ళు మన భూమిమీదే కొన్ని రోజులు ఉండి ఇక్కడి పరిస్థితులు చూసి వెళ్లే వాళ్లేమో , మనము ఎందుకు వద్దంటాము ?


Monday, June 22, 2015

                                              పాల పుంత వైపు  నా ప్రయాణం (పార్ట్ 1)

ఆరు బయట ఆకాశం క్రింద కూర్చొని చుక్కలు లెక్కపెట్టడం మన చిన్నతనపు సరదా . చంద్రుడు మనకు రోజూ కనిపించక పోయినా నక్షత్రాలు మాత్రం రోజూ పలకరిస్తాయి.  ఒకరకంగా మనకు వాటితోనే అనుభంధం ఎక్కువ.  ఇలాంటి నక్షత్రాలు వందలు, వేలు , లక్షల్లో దర్సనమిస్తే ? ఆ ఊహే నన్ను పాలపుంత వైపు నడిపించింది.  మరి పాలపుంత ను వెతుకుతూ నా ప్రయాణం ఎలా సాగిందో మీరు వివరించే ప్రయత్నమే ఇది.

 మనం ఉన్న గాలక్సీ ని పాలపుంత లేదా మిల్కీ వే అంటారని మనకు తెలుసు. పాలపుంత  గురించి నేను చాల చదివాను. అప్పటినుండి దానిని ప్రత్యక్షం గా చూడాలని మనస్సులో ఎంతో కోరిక కలిగింది. అసలు పాల పుంత అంటే ఏమిటి ? అది తెలుసు కొంటే గాని నేను పాలపుంత చూడాలని ఎందుకు తపన పడ్డానో మీకు అర్ధం అయ్యేలా చెప్పలేను.


మన భూమి ఒక గ్రహం అని, అది సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది అని , అలాగే తొమ్మిది గ్రహాలూ సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అని , వీటినే సౌర కుటుంబం అంటారని మన అందరం చిన్నప్పుడే చదువుకొన్నాము.  ఈ సౌర కుటుంబం చివరలో అంటే ప్లూటో తర్వాత  , సౌర కుటుంబం అంచున ఏముంటుంది..?  ఒక మేఘాకార వలయం ఉంటుంది. దానినే ఓర్ట్  క్లౌడ్ (oort cloud )అంటారు.  ఇది దాదాపు రెండు కాంతి సంవత్సరాల దూరం విస్తరించి ఉంటుంది.  ఇక్కడే అతి పెద్ద తోకచుక్కలు హీలీ లాంటివి పుడతాయి.  దీని తర్వాత మనకు దగ్గరి నక్షత్రం ఆల్ఫా సెంటారీ ప్రారంభం అవుతుంది.














 కాంతి వేగం గురించి మనకు తెలుసు. కాంతి గంటకు 670,616,629 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. సంవత్సరంలో 5,880,000,000,000  మైళ్ళు ప్రయాణిస్తుంది .  విమానం గంటకు 920 km  వరకు ప్రయాణిoచగలదు. అంతరిక్షంలో ప్రయాణం చేసే స్పేస్ షటిల్ గంటకు 17,500 మైళ్ళ  వేగంతో ప్రయాణించగలదు. మన ఇండియా వాళ్ళు మొన్నామధ్యన అంగారకుడు మీదకు పంపించిన MOM (Mars orbiter mission ) 4356 kph వేగంతో ప్రయాణించి0ది. సరే ఇప్పుడు వీటితో కాంతి వేగం పోల్చి చూడండి -  అస్సలు పోలిక లేదు కదూ .  మనకు సూర్యుని నుండి కాంతి భూమికి చేరడానికి 8 నిముషాల 20 సెకండ్లు పడుతుంది . అదే చంద్రుని నుండి కాంతి భూమి చేరడానికి ఒక్క సెకండ్ పడుతుంది . అంటే మనం చూస్తున్న సూర్యుడు 8 నిముషాల 20 సెకండ్స్ క్రిందటి వాడు , చంద్రుడు ఒక్క సెకండ్ క్రిందటి వాడు.  హటాత్తుగా సూర్యుడు మాయం అయిపోయాడు అనుకోండి ఆ విషయం మనకు 8 నిముషాల 20 సెకండ్స్ తర్వాత తెలుస్తుంది. ఇలా మనం ఎన్నైనా ఊహించుకోవచ్చు. అసలు ఇది ఎందుకు చెప్పుకొంటున్నాము అంటే , మనం చూసే నక్షత్రాలు అసలు అక్కడే ఉంటాయనే వీలు లేదు , అవి అసలు లేక పోవొచ్చు కూడా , ఎందుకంటే వాటి కాంతి మనకు చేరడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు.  మనం చూసే కొన్ని నక్షత్రాల కాంతి  దాదాపు 10,000 వేల సంవత్సరాల కాలం క్రిందటిది కూడా అయి ఉండవచ్చ్చు. ఇంకా విశేషం ఏమిటంటే మనం ఆకాశంలో చూసే నక్షత్రాలు వేరే గాలక్సీ(galaxy )కి చెందినవి కూడా అయిఉంటాయి.  ఇక  oort cloud తర్వాత సూర్యుని ప్రభావం ఉండదు.  అంతా శూన్య ప్రదేశం , మళ్ళి మరొక నక్షత్రం దగ్గరకు మనం చేరుకోన్నప్పుడు ( చేరుకోగలిగితే ..) , ఆ నక్షత్రం యొక్క ఆకర్షణ శక్తి తాలూకు ప్రభావం మన మీద పడుతుంది.  ఆ నక్షత్రానికి కూడా కొన్ని గ్రహాలూ , వాటికి మళ్ళి ఉపగ్రహాలు ఉండొచ్చు, తర్వాత మరో నక్షత్రం ... ఇలా ఒక్క మన మిల్కీ వే లోనే  100 బిలియన్  నక్షత్రాలు ఉన్నాయి.  ఈ మిల్కీ వే  100,000 light years విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. మన భూమికి మిల్కీ వే కి  దూరం 25,000 లైట్ ఇయర్స్ ఉంటుంది.





మనం కాంతి వేగంతో ప్రయాణించే వాహనం కని పెడితే , మన మిల్కీ వే మధ్యలోకి చేరడానికి 25 వేల సంవత్సరాలు పడుతుంది.   లేదా మన సూర్యుని కాంతి మిల్కీ వే మధ్యలోకి చేరడానికి కూడా  అంతే సమయం  పడుతుంది. ఈ ప్రయాణం మన వల్ల అవుతుందా ? అంతెందుకు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంటారీ మనకు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది.  NASA వాళ్ళు వోయెజర్ అనే ఒక వ్యోమ నౌక ని మన సౌరకుటుంబంలోకి 1977 లో పంపించారు, దాని వేగం 38,610 mph.  అది అన్ని గ్రహాలూ దాటుకుని 38 సంవత్సరాల తర్వాత  19,000,000,000 km ప్రయాణించింది. ఇంకా ప్రయాణిస్తూనే ఉంది.   ఇక ఒక కాంతి సంవత్సర దూరం అది ప్రయాణించాలి అంటే దాని వేగంతో  దానికి దాదాపు 15 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ లెక్కన మనకు అతి దగ్గర నక్షత్రం చేరడానికి దానికి 60 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ విశ్వం అనంత మైనది.  మనకు పక్కనున్న గాలక్సీ పేరు ఆన్డ్రోమెడ గాలక్సీ . అది మన భూమికి  2. 5 మిలియన్ లైట్ ఇయర్స్  దూరంలో ఉంది . ఒక లైట్ ఇయర్ దూరానికే కోట్ల సంవత్సరాలు పడితే  2. 5 మిలియన్ లైట్ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు ..? ఇలాంటి గాలక్సీలు కలిపి  యూనివర్స్ అంటారు.  ఒక యూనివర్స్ లో  సుమారు 100 బిలియన్ గాలక్సీ లు ఉంటాయి . ఇలాంటి యూనివర్స్ లు కొన్ని బిలియన్ లు కలిసి మల్టీవెర్సు ఏర్పడు తుంది.  దీని ద్వారా మన విశ్వం ఎంత పెద్దదో ఊహకు కూడా అందదు . కాబట్టి నా ఆలోచనలు మనం ఉన్న గాలక్సీ అదే మిల్కీ వే దగ్గరే ఆపివేస్తున్నాను.


ఈ విషయాలు చదువు తున్నప్పుడు ,  ఈ భూమి ఈ అనంత విశ్వం లో ఎంత చిన్నదో అని. నేను కనీసం మన పాలపుంత ని చూస్తే ఏదో కొంత సాధించినట్లు అనిపిస్తుంది,  కాని పాలపుంతని  చూడాలంటే ఎలా ? అసలు మన భూమి కూడా పాలపుంత లో ఒక భాగం అయినప్పుడు నాకు పాల పుంత ఎలా కనిపిస్తుంది? ఎన్నో ప్రశ్నలు. కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది , ఈ భూమి మీద ఉంటూ పాల పుంత చూడొచ్చు అని . ఆ ఊహే నాకు అద్భుతం అనిపించిది.  పాల పుంత చూడాలంటే మన హైదరాబాదు , విశాఖపట్నం నుండి కనిపించదు , ఎందుకంటే అలాంటి పెద్ద పట్టణాలలో  లైట్ పొల్యూషన్ ఉంటుంది. అమెరికాలో అయితే న్యూ యార్కు , వాషింగ్టన్ dc లాంటి పెద్ద నగరాలలో కనిపించదు , అసలు అంత ఎందుకు మీరు ఏ సిటీ లో ఉన్నా కూడా  కనిపించదు.  సిటీ లైట్ లేకుండా , ఊరికి చాల దూరంగా ఉన్న ప్రదేశం లో,  చంద్రుడు లేని ఆకాశం లో , చిట్ట చీకటి రాత్రి లో ఎటువంటి లైట్ లేని వేళ ఆకాశం లోకి చూస్తే మీకు తప్పకుండా పాలపుంత కనిపిస్తుంది.  మరి అలాంటి ప్రదేశం అమెరికాలో ఎక్కడ ? ఉంటే నేను వెళ్ళగలనా ?




-- మిగతా విషయాలు కోసం చూస్తూ ఉండండి .





Wednesday, January 1, 2014

శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ కధ - తెలుగు అనువాదం

                   శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణం తెలుగు అనువాదం

 అందరకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ  ఉత్తమ మైన రోజున శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కళ్యాణ  కధ చదువుతే మంచిది అనిపించిది . దానితో నేను తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెబ్సైటు www.tirumala.org
లో కధ కోసం వెతకడం జరిగింది.  కధ అయితే ఉంది కాని అది పూర్తిగా ఇంగ్లీష్ లో ఉంది .   స్వామి ఉండేది తెలుగు నేలపైన , అత్యధిక శాతం భక్తులు తెలుగు వారు  కనుక  మన మాతృ భాషలో స్వామి కధ ఉంటే చాల బాగుంటుంది అనే అభిప్రాయంతో నేను ఆ ఇంగ్లీష్ కధను  తెలుగు లోకి  నేరుగా అనువాద ప్రయత్నం చేశాను . ఎక్కడైనా టైపింగ్ తప్పులు ఉంటే మన్నించండి. 




  శ్రీ శ్రీనివాస కళ్యా ణం " కథా చిత్ర మాలిక " కోసం ఇక్కడ క్లిక్ చేయండి ..

 
  ధన్యవాదాలు 

చంద్రశేఖర్ జలసూత్రం



Monday, May 13, 2013

పిడుగు అంటే ఏమిటి -? ఎలా రక్షించుకోవచ్చు

                పిడుగు అంటే ఏమిటి -? ఎలా రక్షించుకోవచ్చు 

మనం రోజూ దిన పత్రికలలో చూస్తూ ఉంటాము , పిడుగు పడి కొంత మంది చనిపోయారు అని , చాలా బాధ గా ఉంటుంది. అంతవరకూ చక్కగా ఉన్న వాళ్ళు ఒక్క సారిగా తీవ్రంగా గాయపడడం గాని చనిపోవడం గాని జరుగుతుంది .  అసలు ఈ పిడుగు పడడం అంటే ఏమిటో నాకు తెలిసిన విషయాలు, మీతో పంచుకుంటున్నాను.   ఈ సబ్జెక్టు గురించి కెమిస్ట్రీ గురు లా క్లాసు తీసుకొనే సబ్జెక్టు నాకు లేదు కాని చాల సరళం గా వివరించే ప్రయత్నం చేస్తాను. 

పిడుగు :  దీనిని ఇంగ్లీష్ లో lightning లేదా lightning strike  లేదా lightning ఫ్లాష్ అని కూడా అంటారు.  పిడుగు అంటే  మేఘం లో ఉన్న  ఋణ విద్యుదావేశం భూమి మీదకు ప్రవహించడం. 

అంతేనా అనిపిస్తోంది కదా ? అవును అంతే.  కరెంటు షాక్ గుర్తు తెచ్చుకోండి , పాజిటివ్ కరెంటు , మన ద్వార   భూమి లోకి ప్రవహిస్తే  మనకు షాక్ తగులు తుంది.  
మనకు కనిపించే మేఘం లో రెండు భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్ ఛార్జ్ తో ఉంటే , క్రిందనున్నది నెగటివ్ ఛార్జ్ తో ఉంటుంది. 
మేఘం అడ్డం గా ఉంటుంది కదా మరి ఏది పాజిటివ్ , ఏది నెగటివ్ అనే సరదా ప్రశ్న పక్కన పెడితే , ప్రతి మేఘం ఇలాగే పాజిటివ్ ఎనర్జీ , నెగటివ్ ఎనర్జీ తో  నిర్మితం అయి ఉంటుంది.  మేఘం లో నెగటివ్ ఎనర్జీ , పక్క మేఘం లో పాజిటివ్ ఎనర్జీ కి తగిలితే , ఆకాసంలో మనకు మెరుపు కనిపిస్తుంది. అదే మేఘం లో నెగటివ్ ఎనర్జీ భూమి మీద పాజిటివ్ ఎనర్జీ తో కలిస్తే పిడుగు అవుతుంది.  అసలు పిడుగు పడడం అనే మాటే తప్పు గా తోస్తోంది , ఎందుకంటే 
భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ , మేఘంలో లో నెగటివ్ ని ఆకర్షిస్తోంది, కాబట్టి తప్పు భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ దే అంటారా ?  పిడుగు పడేడప్పుడు మనకు కనిపించే  పెద్ద మెరుపు భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ నుండి మొదలై , మేఘాన్ని చేరుతుంది అంతే కాని ఆ మెరుపు మేఘం నుండి భూమికి చేరదు. 

 ప్రక్క చిత్రం చూడండి , మెరుపు భూమి నుండి పైకి వెళుతోంది . 

 


మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:

పిడుగు ఈ ప్రదేశంలో పడుతుంది , ఇక్కడ పడదు అని ఖచ్చితంగా చెప్పలేము. కాని ఎత్తైన భవనాలు , పెద్ద చెట్లు మీద ఎక్కువగా పడుతుంది , ఎత్తైనవి త్వరగా పిడుగు ను ఆకర్షిస్తాయి. పెద్ద చెట్లు, బిల్డింగ్ లు లేకపోతే పిడుగు మనషుల మీద నేరుగా  పడుతుంది , మనిషి మంచి విద్యుత్ వాహకం కదా.  మిగతా పరిసరాలు కన్నా మన ఎత్తు తక్కువగా ఉన్నపుడు పిడుగు మనిషి మీద పడే అవకాశం తక్కువ . 


1.వర్షం వస్తోంది కదా అని పొరపాటున కూడా ఎత్తైన చెట్టు క్రింద నిలబడకూడదు. తాడి చెట్టు , మర్రి చెట్టు లాంటి వాటి క్రింద అస్సలు నిలబడకూడదు. ఎందుకంటే ఎత్తైన చెట్లు త్వరగా పిడుగు ను ఆకర్షిస్తాయి. వాటికింద ఉన్న వాళ్లకు తప్పకుండా పిడుగు దెబ్బ తగులు తుంది. 
2.  చెట్టు క్రింద నిలబదకూడదు , అలాగే   నేల మీద కూడా పడుకోకూడదు. చేతులు రెండు మోకాళ్ళ మీద పెట్టు కొని , తల క్రిందకు వంచి ఎటువంటి చెట్లు లేని చోట చేతులు భూమికి తగల కుండా అరికాళ్ళ మీద కూర్చోవాలి. వర్షం పడిన ప్రతిసారి ఇలా చేయమని కాదు , కాని విపరీత మైన మేఘాలు , మెరుపులు తో  పిడుగులు పడుతున్నప్పుడు, అందుబాటులో ఏ బిల్డింగ్ లేనప్పుడు , ఇది తప్పదు. 
3. నేల మీద తక్కువ ఎత్తు ఉన్న చోట పై విధంగా చేయాలి,  పెద్ద వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు , పక్కనే షెల్టర్ లేకపోతే  ఒక కారు , బస్సు లాంటి పైన మూసివేసిన  వాహనాలు లో కూర్చొంటే  మంచిది.  కారు మీద , ఇలా పైన మూత ఉన్న వాహనాలు మీద పిడిగు పడే అవకాశాలు తక్కువ.  ఒక వేల పడినా , వాటి పెద్ద ఉపరితలం విద్యుత్ ను అన్ని దిక్కులకు పంపించి తర్వాత భూమిని చేరుతుంది.  (కారు మీద వర్షం పడితే చినుకులు అన్ని చెల్లా చెదురు అయినట్లు) తద్వారా పిడుగు ఎఫెక్ట్ ను అంతగా లేకుండా చేస్తుంది . MICHEAL FARADAY ఎఫెక్ట్ చదవండి . 
4. ఉరుములతో వర్షం మొదలైన తర్వాత , కాలి నడకన , మోటార్ సైకిల్, సైకిల్ ద్వార  ప్రయాణం అంత మంచిది కాదు .  పిడుగుల వర్షం మొదలవగానే ఒక కిటికీలు లేని గదిలో వర్షం తగ్గే వరకు ఉండాలి. రూమ్ కిటికీలు ఉంటె తప్పకుండా మూసి ఉంచాలి. పిడుగు కిటికీల నుండి లోపలకు చక్కగా రాగలదు. కిటికీ ఉంటే , కనీసం కొంత సేఫ్ కదా. 
5.  నేల మీద చెట్లకు , ఇనుప పెన్శింగ్ నకు, పైపులకు, పొడవైన భవంతులకు, ట్రాన్స్ఫార్మర్ లకు  దూరంగా ఉండడం మంచిది. 
6 .  సిటీ లో కాదు కాని కొంచం పల్లెటూరు లలో రేకులతో చేసిన బాత్ రూములు ఇప్పటికీ ఉన్నాయి, రేకులు విద్యుత్ వాహకాలు కాబట్టి , మనం చక్కగా వర్షం పడుతోంది అని రెండు వేడి వేడి చెంబులతో స్నానం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మాను కోవాలి.
7. ఈ సమయంలో సముద్రం, నది , చెరువులలో ఈత కొట్టటం వెంటనే ఆపుచేయాలి, వెంటనే ఒడ్డుకి , తలుపులు మూసి ఉన్న భవంతి లోకి చేరాలి. 
8. గొర్రెల కాపరులు , గొర్రెలను వర్షంలో ఏమాత్రం ముందుకు నడపక, తగు జాగ్రతలు తీసుకోవాలి. 
9. ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ వాడకండి ,  పిడుగు ఎఫెక్ట్ ఫోన్ లైన్ మీద పడితే మీరు పట్టుకొన్న ఫోన్ కి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు . ఇంట్లో సెల్ ఫోన్ కానీ కార్డ్ లెస్ ఫోన్ కాని ఫర్వాలేదు . 



Tuesday, March 12, 2013

యండమూరి గారికి మనసు విరిగిన అభిమాని ఆవేదన


నవలా ప్రపంచంలో తిరుగులేని యండమూరి , నిజజీవితం లో ఇంత చీప్ గ ఆలోచించడం తట్టుకోలేక పోతున్నాను. ఆయనంటే ఒక రచయితగా ఎంతో ఇష్టపడ్డాను , కానీ ఆయన  మాటల్లో కలంలో ఉన్న గొప్పతనం ఏది కనిపించలేదు కాని ఒక ఊహకు అందని , మనసు తట్టుకోలేని మనిషిని చూడవలసి వచ్చింది .  దానికి గల కారణం జ్యోతి అనే అమ్మాయి ఆత్మహత్య మీద ఆయన అభిప్రాయమే . ఈ క్రింది ఇంటర్వ్యూ చూసి నేను ఇలా స్పందిస్తున్నాను . 33:55 సెకండ్స్ నుండి చూస్తే అలా అనిపించింది

యండమూరి మాట :  ఈ ఇంటర్వ్యూ జాగ్రతగా చూస్తే జ్యోతి అనే అమ్మాయికి ఈయన ఆరు నెలలుగా ఉత్తరాలు రాసేవారని చెప్పారు. అందులో నీ కళ్ళు నాకు చాల ఇష్టం , నువ్వంటే చాల ఇష్టం అని రాసినట్లు చెప్పరు.
విమర్శ: అప్పటికే పెళ్లై న వాడు , ఒక అమ్మాయికి అలా  నువ్వంటే ఇష్టం , నీ కళ్ళు ఇష్టం అని రాయండం ఏమిటి? నార్మల్ గా రచయితలు మీ అభిమానానికి ధన్యవాదాలు అని సరిపెడతారు -ఎవరైనా
యండమూరి మాట :  విజయవాడలో ఈయన lodge లో ఉంటె  జ్యోతి అనే అమ్మాయి ఉదయం 7 గంటలకు  lodge కి వచ్చింది అన్నారు
విమర్శ: అసలు విజయవాడ వెళుతున్నట్లు , lodge  లో ఉన్నట్లు జ్యోతికి ఎలా తెలుస్తుంది . ఈయనేమి రాజకీయ నాయకుడు కాదు  మీడియా ద్వారా తెలియడానికి.  ఈయనే జ్యోతిని  పిలిపిస్తే తప్ప ఆ అమ్మాయికి తెలియదు.  సరే ఒక పెళ్లి కాని అమ్మాయిని లాడ్జ్ కి పిలవడం ఏమిటి? ఇదేనా సంస్కారం ?
"అసలు ఈయన జ్యోతి ఫోటో చూసి మతి పోయి , ఛాన్స్ దొరుకుతుంది అని విజయవాడ వెళ్ళిన విషయం మనకు క్లియర్ గా తెలుస్తోంది . ఆయనే చివర్లో ఆమాట అన్నరు. అవకాసం దొరికితే RK  గారు మీరు వదులు కొంటార
అని కూడా అడిగారు . "
యండమూరి మాట : జ్యోతి ఫోటోలో లా లేదు అని నాకు విపరీతమైన కోపం వచ్చింది , బాగా తిట్టేసాను . 
విమర్శ:  అసలు రచయిత అందంగా ఉండాలని ఏ  పాఠకుడు/పాఠకురాలు  కొరుకోరు. అలాగే అభిమానులు అందం గురించి రచయితా ఆలోచించరు . అలాంటిది జ్యోతి తను ఫోటో చూసినట్లు లేదని  ఈయనకు కోపం రావడం ఏమిటి?
అసలు ఇదేమైన పెళ్లి చూపుల వ్యవహారమ ? ఇంకా పచ్చిగా చెప్పాలంటే సాని తనమా? Lodge  కి రమ్మనడం , నీ కళ్ళు ఫోటోలోలా  లేవు,  అందంగా  లేవు అని బాగా తిట్టడం ..నమ్మ శక్యం గా లేవు.
యండమూరి మాట : నేను  జ్యోతిని ముట్టు కొన్నాన? ఏదైనా తప్పు చేసాన?
విమర్శ: ఎంత దిగజారుడు తనం ? ఏ కాలంలో ఉన్నారు బాబు మీరు ? ముట్టు కొంటే తప్పు , ముట్టుకోకుండా మనసును ముక్కలు చేస్తే ఒప్పా ? అసలు పరాయి ఆడదాని అనమతి లేకుండా ముట్టుకొంటే అది బలాత్కారం , దానికి శిక్ష ఉంటుంది. అదే తనే ఇష్టపడి వచ్చినా ముట్టుకోకుంటే అది సంస్కారం అవుతుంది. మరి మీరు ఈ ఉదేశ్యం  లో ముట్టుకోనే వరకు ఆలోచించారు . అంటే మీరు  ముట్టుకొన్న ఆ అమ్మాయి ఏమి చేయలేదనే ధీమా తో అలా మాట్లాడార ?
యండమూరి మాట : నా ఫ్రెండ్ మరో తోటి రచయిత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారు. 
 విమర్శ:  దీనిని బట్టి మీరు మీ ఫ్రెండ్ విజయవాడ వెళ్ళిన పని ఏమిటో తెలుస్తోంది , మీరు ఆ అమ్మాయిని కేవలం ఒక పాఠకురాలిలా చూస్తే , మీరే తనని నలుగురు ఉండే చోటుకు రమ్మనే వారు, ఆవిడ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపెవారు. ఇలా రహస్యంగా లాడ్జ్ కి రమ్మనే వారు కాదు.
యండమూరి మాట : శవాన్ని మళ్ళి తవ్వి తీసారు , కన్య అని తేలింది.
విమర్శ: ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొంటే ఆ కుటుంబం ఎంత కుమిలి పోతుందో మీకు తెలియదా? అలాంటిది , చని పోయిన అమ్మాయిని మళ్ళి తవ్వి తీసి కన్యత్వ పరీక్ష చేసారు అంటే అంత కంటే ఆకుటుంబానికి అవమానం ఉంటుందా? చనిపోయినా ఆ పరీక్షలో నెగ్గిన ఆ అమ్మాయిని సీత దేవి అంత గొప్పది కాదా ? మీరు తన చావు పైన ఏ  మాత్రం జాలి లేకుండా , మీరు తన కన్యత్వం దోచుకోలేదు కనుక నా తప్పు లేదు అని సమర్ధించు కొంటున్నారా ? రావణుడు కూడా తన వాకిలిలో ఉన్న సీతను ఎన్నడు ముట్టుకోనే సాహసం చేయలేదు.
మరి మీరు , ఫోటో పంపించి , కళ్ళు బాగుండే సరికి , ఇల్లు పెళ్ళాం వదిలి విజయవాడ పరిగెత్తుకు వెళ్లి ,  లాడ్జ్ కి రమ్మని , అమ్మాయి ఫోటో లో లా  లేక పోయేసరికి తనని మానసికంగా హింసించి , ఆత్మ హత్యకు ప్రేరేపించడం రావణుని తప్పుకన్న పెద్ద తప్పు అనిపించడం లేదా?


చివరగా ఒక్క మాట మీ నవలా  భాషలో చెబుతాను -  ఆడవారి  విషయంలో అవకాశం కోసం ఎదురు చూసేవాడు సన్నాసి , అవకాశమున్న వదులుకొనెవాడు  ఋషి, అసలు ఈ ఆలోచనలే  రానివాడు మహర్షి .

Sunday, January 22, 2012

అవధానం సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!

సమస్య: గీతను నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!



సమస్య వివరణ: భగవద్గీతను నమ్మరాదని శ్రీకృష్ణుడు పార్థునితో అంటే అర్జునునితో అన్నాడట. అదేమిటి? గీత బోధ జేసిన శ్రీకృష్ణుడే గీతను నమ్మ రాదని అర్జునుడితో యెట్లా చెబుతాడండీ? అదే సమస్య. అవధాని గారెట్లా ఈ వాక్యాన్ని సమర్థించారో చూద్దాం.


అవధాని: . ద్విశతావధాని, రాళ్ళ బండి కవితా ప్రసాద్..
చందస్సు: ఉత్పలమాల

పూరణ:ఉ.

 జాతికి దారి చూపి దృధసత్వమునిచ్చి మనస్సునందునన్
 భీతిని పారద్రోలి పలువేదనలన్ పరిమార్చు గీత, దు
 ర్నీతులబద్ధ మిద్దియని నిందలతో పరిహాసమాడినన్
 గీతను, నమ్మరాదనియె కృష్ణుడు పార్థునితోడ మిత్రమా!


వ్యాఖ్యానము: మన జాతి మొత్తానికి దారి చూపించి, దృఢమైన శక్తినిచ్చి మనమనస్సులలోని భయాన్ని పారద్రోలింది భగవడ్గీత. ఆ విధంగా మనకున్న యెన్నో వేదనలనీ, బాధలనీ పోగొట్టింది భగవద్గీత. అటువంటి భగవద్గీతనెవరైనా యివన్నీ అబద్ధాలు అని నిందజేసి పరిహాసమాడితే నమ్మ రాదని కృష్ణుడు పార్థుడితో అంటే అర్జునుడితో అన్నాడయ్యా మిత్రుడా అని ఒక అతను యింకొక అతనితో అంటున్నాడని అవధానిగారు పూరించారు.

Tuesday, January 17, 2012

ఆముక్తమాల్యద మొదటి పద్యం వివరణ

                                 ఆముక్త మాల్యద మొట్ట మొదటి పద్యం వివరణ చూడండి