Monday, May 13, 2013

పిడుగు అంటే ఏమిటి -? ఎలా రక్షించుకోవచ్చు

                పిడుగు అంటే ఏమిటి -? ఎలా రక్షించుకోవచ్చు 

మనం రోజూ దిన పత్రికలలో చూస్తూ ఉంటాము , పిడుగు పడి కొంత మంది చనిపోయారు అని , చాలా బాధ గా ఉంటుంది. అంతవరకూ చక్కగా ఉన్న వాళ్ళు ఒక్క సారిగా తీవ్రంగా గాయపడడం గాని చనిపోవడం గాని జరుగుతుంది .  అసలు ఈ పిడుగు పడడం అంటే ఏమిటో నాకు తెలిసిన విషయాలు, మీతో పంచుకుంటున్నాను.   ఈ సబ్జెక్టు గురించి కెమిస్ట్రీ గురు లా క్లాసు తీసుకొనే సబ్జెక్టు నాకు లేదు కాని చాల సరళం గా వివరించే ప్రయత్నం చేస్తాను. 

పిడుగు :  దీనిని ఇంగ్లీష్ లో lightning లేదా lightning strike  లేదా lightning ఫ్లాష్ అని కూడా అంటారు.  పిడుగు అంటే  మేఘం లో ఉన్న  ఋణ విద్యుదావేశం భూమి మీదకు ప్రవహించడం. 

అంతేనా అనిపిస్తోంది కదా ? అవును అంతే.  కరెంటు షాక్ గుర్తు తెచ్చుకోండి , పాజిటివ్ కరెంటు , మన ద్వార   భూమి లోకి ప్రవహిస్తే  మనకు షాక్ తగులు తుంది.  
మనకు కనిపించే మేఘం లో రెండు భాగాలు ఉంటాయి. పైన ఉన్న భాగం పాజిటివ్ ఛార్జ్ తో ఉంటే , క్రిందనున్నది నెగటివ్ ఛార్జ్ తో ఉంటుంది. 
మేఘం అడ్డం గా ఉంటుంది కదా మరి ఏది పాజిటివ్ , ఏది నెగటివ్ అనే సరదా ప్రశ్న పక్కన పెడితే , ప్రతి మేఘం ఇలాగే పాజిటివ్ ఎనర్జీ , నెగటివ్ ఎనర్జీ తో  నిర్మితం అయి ఉంటుంది.  మేఘం లో నెగటివ్ ఎనర్జీ , పక్క మేఘం లో పాజిటివ్ ఎనర్జీ కి తగిలితే , ఆకాసంలో మనకు మెరుపు కనిపిస్తుంది. అదే మేఘం లో నెగటివ్ ఎనర్జీ భూమి మీద పాజిటివ్ ఎనర్జీ తో కలిస్తే పిడుగు అవుతుంది.  అసలు పిడుగు పడడం అనే మాటే తప్పు గా తోస్తోంది , ఎందుకంటే 
భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ , మేఘంలో లో నెగటివ్ ని ఆకర్షిస్తోంది, కాబట్టి తప్పు భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ దే అంటారా ?  పిడుగు పడేడప్పుడు మనకు కనిపించే  పెద్ద మెరుపు భూమి మీద ఉన్న పాజిటివ్ ఎనర్జీ నుండి మొదలై , మేఘాన్ని చేరుతుంది అంతే కాని ఆ మెరుపు మేఘం నుండి భూమికి చేరదు. 

 ప్రక్క చిత్రం చూడండి , మెరుపు భూమి నుండి పైకి వెళుతోంది . 

 


మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి:

పిడుగు ఈ ప్రదేశంలో పడుతుంది , ఇక్కడ పడదు అని ఖచ్చితంగా చెప్పలేము. కాని ఎత్తైన భవనాలు , పెద్ద చెట్లు మీద ఎక్కువగా పడుతుంది , ఎత్తైనవి త్వరగా పిడుగు ను ఆకర్షిస్తాయి. పెద్ద చెట్లు, బిల్డింగ్ లు లేకపోతే పిడుగు మనషుల మీద నేరుగా  పడుతుంది , మనిషి మంచి విద్యుత్ వాహకం కదా.  మిగతా పరిసరాలు కన్నా మన ఎత్తు తక్కువగా ఉన్నపుడు పిడుగు మనిషి మీద పడే అవకాశం తక్కువ . 


1.వర్షం వస్తోంది కదా అని పొరపాటున కూడా ఎత్తైన చెట్టు క్రింద నిలబడకూడదు. తాడి చెట్టు , మర్రి చెట్టు లాంటి వాటి క్రింద అస్సలు నిలబడకూడదు. ఎందుకంటే ఎత్తైన చెట్లు త్వరగా పిడుగు ను ఆకర్షిస్తాయి. వాటికింద ఉన్న వాళ్లకు తప్పకుండా పిడుగు దెబ్బ తగులు తుంది. 
2.  చెట్టు క్రింద నిలబదకూడదు , అలాగే   నేల మీద కూడా పడుకోకూడదు. చేతులు రెండు మోకాళ్ళ మీద పెట్టు కొని , తల క్రిందకు వంచి ఎటువంటి చెట్లు లేని చోట చేతులు భూమికి తగల కుండా అరికాళ్ళ మీద కూర్చోవాలి. వర్షం పడిన ప్రతిసారి ఇలా చేయమని కాదు , కాని విపరీత మైన మేఘాలు , మెరుపులు తో  పిడుగులు పడుతున్నప్పుడు, అందుబాటులో ఏ బిల్డింగ్ లేనప్పుడు , ఇది తప్పదు. 
3. నేల మీద తక్కువ ఎత్తు ఉన్న చోట పై విధంగా చేయాలి,  పెద్ద వర్షం పడే సూచనలు ఉన్నప్పుడు , పక్కనే షెల్టర్ లేకపోతే  ఒక కారు , బస్సు లాంటి పైన మూసివేసిన  వాహనాలు లో కూర్చొంటే  మంచిది.  కారు మీద , ఇలా పైన మూత ఉన్న వాహనాలు మీద పిడిగు పడే అవకాశాలు తక్కువ.  ఒక వేల పడినా , వాటి పెద్ద ఉపరితలం విద్యుత్ ను అన్ని దిక్కులకు పంపించి తర్వాత భూమిని చేరుతుంది.  (కారు మీద వర్షం పడితే చినుకులు అన్ని చెల్లా చెదురు అయినట్లు) తద్వారా పిడుగు ఎఫెక్ట్ ను అంతగా లేకుండా చేస్తుంది . MICHEAL FARADAY ఎఫెక్ట్ చదవండి . 
4. ఉరుములతో వర్షం మొదలైన తర్వాత , కాలి నడకన , మోటార్ సైకిల్, సైకిల్ ద్వార  ప్రయాణం అంత మంచిది కాదు .  పిడుగుల వర్షం మొదలవగానే ఒక కిటికీలు లేని గదిలో వర్షం తగ్గే వరకు ఉండాలి. రూమ్ కిటికీలు ఉంటె తప్పకుండా మూసి ఉంచాలి. పిడుగు కిటికీల నుండి లోపలకు చక్కగా రాగలదు. కిటికీ ఉంటే , కనీసం కొంత సేఫ్ కదా. 
5.  నేల మీద చెట్లకు , ఇనుప పెన్శింగ్ నకు, పైపులకు, పొడవైన భవంతులకు, ట్రాన్స్ఫార్మర్ లకు  దూరంగా ఉండడం మంచిది. 
6 .  సిటీ లో కాదు కాని కొంచం పల్లెటూరు లలో రేకులతో చేసిన బాత్ రూములు ఇప్పటికీ ఉన్నాయి, రేకులు విద్యుత్ వాహకాలు కాబట్టి , మనం చక్కగా వర్షం పడుతోంది అని రెండు వేడి వేడి చెంబులతో స్నానం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన మాను కోవాలి.
7. ఈ సమయంలో సముద్రం, నది , చెరువులలో ఈత కొట్టటం వెంటనే ఆపుచేయాలి, వెంటనే ఒడ్డుకి , తలుపులు మూసి ఉన్న భవంతి లోకి చేరాలి. 
8. గొర్రెల కాపరులు , గొర్రెలను వర్షంలో ఏమాత్రం ముందుకు నడపక, తగు జాగ్రతలు తీసుకోవాలి. 
9. ఇంట్లో ఉన్నప్పుడు ల్యాండ్ లైన్ వాడకండి ,  పిడుగు ఎఫెక్ట్ ఫోన్ లైన్ మీద పడితే మీరు పట్టుకొన్న ఫోన్ కి కూడా ఎఫెక్ట్ చేయొచ్చు . ఇంట్లో సెల్ ఫోన్ కానీ కార్డ్ లెస్ ఫోన్ కాని ఫర్వాలేదు .