Monday, September 20, 2010

దేవుడు నీకు ఎలా కనిపించాలి?

దేవుడు ఎక్కడున్నాడు ? ఉంటే కనపడడే? ఇది ప్లహలాదుడి కాలం నాటి ప్రశ్న!.  ఈ రాళ్ళలో ఉన్నాడా? ఈ పువ్వులో ఉన్నాడా ? ఇలాంటి ప్రశ్నలు వేస్తె, కొంచెం పెద్దరికం వహించి,  పెద్దలు అనబడే వాళ్లు , ఒక్క చిరునవ్వు నవ్వి , పిచ్చి వాడ!, మూర్ఖుడా, దేవుడు ఎక్కడో లేడుర నీ మనసులో ఉన్నాడు, ఈ సమస్త ప్రాణికోటిలో ఉన్నాడు, అని వేదాంతం లాంటిది చెబుతారు కానీ విషయాన్నీ సూటిగా చెప్పరు.  ఆ చెప్పేవాళ్ళకు దేవుడు ఎక్కడ ఉన్నాడో ఏమితెలుసనీ ? నిజానికి వాళ్ళకే కాదు, మనకేవ్వరకు తెలీదు.  తెలిస్తే మీరు కంప్యూటర్, ఈ బ్లాగ్ వదిలి , దేవుడున్న చోటికి పరిగెత్తరూ? కంప్యూటర్ మీది కాకపోతే పరిగెత్తుతార? సరే మీ ఇష్టం.

అదిసరే , మన టాపిక్ దేవుడు ఎక్కడున్నాడని కాదు!, అసలు దేవుడెలా ఉంటాడు , వొకవేళ హటాతుగా కనిపిస్తే మనం గుర్తు పట్టగలమా అని?  ఒక్క సారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చెయ్యండి. మీరు ఉన్న ఖండం, దేశం గుర్తు పట్టండి. ఇంకా జూమ్ చెయ్యండి, మీరు ఉన్న పట్టణం, మీ ఊరు, మీ వీధి, మీ ఇల్లు , ఇక మీరు. కనిపిస్తున్నార?  లేదే ..? మన భూమి మీద మనం ఒక చిన్న బిందువు లాంటి వాళ్ళం , అది కూడా గుర్తు పట్ట లేనంత.  అది సరే కానీ దీనికి , దేవుడు కనిపించడానికి సంభందం ఏమిటి?
మరి దేవుడంటే ఎవరు?  మనలను సృష్టించాడు, మన పొరుగు వాళ్ళను సృష్టించాడు, మన ఊరు, పట్టణం, దేశం, ఈ సముద్రాలూ , పక్షులు సృష్టించాడు. అంతెందుకు ఈ మొత్తం భూమిని సృష్టించాడు.  ఒక్క భూమేనా!,  స్వర్గం, నరకం,  వైకుంటం , ఇంద్రలోకం లాంటి వన్ని సృష్టించాడు.  ఇవే కాకుండా, మన భూమి లాంటి కొన్ని లక్షల గ్రహాలు సృష్టించాడు.  సూర్యుడు లాంటి కొన్ని కోట్ల నక్షత్రాలు సృష్టించాడు.  కేవలం సృష్టించడమే కాకుండా , వాటిని నిరంతరం సంరక్షిస్తున్నాడు.  బాబు..., ఇక చాలు... దేవుడు , దేవుడే అని ఒప్పుకోన్నారా..? సరే  మరి.

వీటన్నిటిని సృష్టించాలి అంటే, దేముడు ఇంకా ఎంత పెద్దగ ఉండాలి?  భూమిని  సృష్టించాలి అంటే, భూమి కన్నా పెద్దగ ఉండాలా లేదా? సూర్యున్ని సృష్టించాలి అంటే, సూర్యుని కన్నా పెద్దగ ఉండాలా లేదా?  ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాలి అంటే, విశ్వం కన్నా పెద్దగ ఉండాలా లేదా ?  అక్కర లేదా?  ఒక చిన్న ఉదాహరణ , మీకు కొన్ని ఇటుకలు ఇచ్చి ఒక దాని మీద ఒకటి పరచమంటే ఎంత వరకు పరచగలరు?  మీ అంత ఎత్తు వచ్చే వరకు, తర్వాత ఇక మీ వల్లకాదు.  మరి విశ్వాన్ని మొత్తం సృష్టించాలి అంటే, దేవుడు మనలా చిన్నగా ఉంటే సరిపోదు కదా. మరి అంత పెద్ద దేవుడిని, గూగుల్ మ్యాప్ లో కనపడని నువ్వు ఎలా చూడగలవు?  అంటే నీకోసం దేవుడు మనిషి రూపం ధరించాలి అన్న మాట . అప్పడు నీ ఎదురుగ నిలబడితే ఒక మనిషి తో మాట్లాడినట్టు మాట్లాడతావన్న మాట.  దానికోసం నువ్వు ఎదురు చూస్తున్నావా?  మరి నీ పక్క వాళ్ళలో దేవుడిని చూడు అంటే మనం వినం,  మనం ఎప్పుడు చూడని వాళ్ళు వచ్చి నేను దేవుడిని అంటే నమ్మం, మరి దేవుడు నీకెలా కనిపించాలి.  ఈ సమస్త ప్రాణికోటి లో మరే జంతువు గని, పక్షి లా గని కనిపిస్తే గుర్తు పట్టలేవు, మరి ఎలాగా ? అన్ని నీకు అనుకూలంగా మర్చుకున్నావు కదా ఓ మనిషి. దేవుడిని నమ్మావు,  ఆయనకు మనిషి రూపం ఇచ్చావు, ఇంత విశాల సృష్టికి అధిపతి, నీకు ఎదురుగ రావాలి అన్నావు, ఆ వచ్చేదేదో మనిషి రూపంలో రావాలి అన్నావు, ఒక్క గాలి వాన వస్తేనే చెల్లా చెదురై పారిపోయే నువ్వు, ఆ అనంత సృష్టికి అధిపతి యొక్క శక్తి తట్టుకోగలవా? అప్పుడు కూడా దేవుడు నీకు సహాయం చేసి , తన శక్తి తగ్గించుకొని నీకు మరో మానవుడుగా, (నీ పక్కింటి వాడుగా మాత్రం కాదు) కనిపించాలి, నీతో మాట్లాడాలి, నువ్వు ఆయనను కుశల ప్రశ్నలు వేసి , నిన్ను అయన ప్రశ్నలు అడిగి (అక్కడికి ఆయనకు నీ గురించి తెలియనట్లు!), కొంత సేపు మాట్లాడుకోవాలి. తర్వాత మోక్షం గురించి అడగాలి ... అబ్బో ఇంకా చాల కోరికలే నీకు .. , దేవుడి పని దేవుడిని చేసుకోనియకుండా, నాకు ఒకసారి కనిపించు అంటే ఆయన నీకోసం ఎంత కష్టపడాలో కదా!  అందుకే మన పెద్దలు , ఈ సమస్త ప్రాణి కోటిలోను దేవుడున్నాడు అన్నారేమో ? ఆలోచించు నేస్తం.

Sunday, September 19, 2010

నేను స్వామిజి ఎందుకు కాకూడదు?

నిన్న మినియాపోలిస్ లో  ఒక టెంపుల్ కి వెళ్ళాను, అక్కడ ఒక ప్రఖ్యాత  స్వామిజి  వస్తున్నారని అరగంట ముందునుంచి హడావిడి మొదలు.  టెంపుల్ కమిటీ మెంబర్స్ మొఖంలో ఒక సరదా, ఉత్సాహం , బిజీగ ఉన్నట్టు బాడీ లాంగ్వేజ్.  సీనియర్ కమిటీ మెంబర్ ని జూనియర్ అడుగుతున్నాడు , "వచ్చారా ..? ఇప్పు డు ఎక్కడున్నారు"?,  "హ వస్తున్నారు .. ఇంకో పది నిముశలలలో  వస్తున్నారంట",  వీళ్ళ హడావిడి చూసే గుడిలో మిగిలిన భక్తులకు కొంచెం టెన్షన్ పెరిగింది, నాకు కూడా!

గుడికి కొన్ని కార్లు రావడం, వచ్చిన కార్ల వంక చూసి కమిటి పెద్దలు, అబ్బే.. స్వామిజి  ఈ కార్లలో లో రారు అని తేల్చేసారు. తర్వాత వాళ్ళే , " ఆయన టొయోట లో రారు,  BMW లో వస్తారంట" అనుకొంటున్నారు. నాలాంటి మిగత భక్తుల మొఖంలో కొంచెం గర్వం తొంగి చూసింది. నిజమే ఇంత దూరం , ఇంత ఖర్చుపెట్టు కొని , స్వామిజి చూద్దాం అని వచ్చిన తర్వాత , తీర ఆయన డొక్కు కార్లో దిగితే మన భక్త హృదయం తట్టుకోగలద?  అలాంటి గొప్పవాళ్ళు మనల  హోండా లోనో టొయోట లోనో రారు , వాళ్ళకు తగ్గ కార్లు వాళ్ళకు ఉండాలిసిందే. 

ఇంతలో గుడిలో ఒక్కసారిగా హడావిడి, స్వామి వచ్చారంటే వచ్చారు అని.   ఇంతలో చిరు నవ్వులు  చిందిస్తూ , శిష్య పరమాణువు నడిపిన  BMW కారులోనుండి, భక్త కోటిని, కారులోనుంచే  ఆశ్వేరదిస్తూ  స్వామిజి .  ఒక డ్రెస్ కోడ్ లాగా , కాషాయ వస్త్రం, మొఖాన వీభూధీ ,  మెడలో రుద్రాక్ష మాలలు , చేతికి కడియం, వేళ్ళకు పచ్చ, పుష్యరాగం లాంటి ఉంగరాలు , మొఖాన రూపాయి కాసంత కుంకం బొట్టు.  ఎంత మంది  ఇలా  చూడలేదు స్వామి అనే నా మనసు నోరు నొక్కి , నేను జనంలో కలిసిపోయాను.

పూజ అర్చన ఐన తర్వాత స్వామి ఉపదేశం ఇవ్వాలి. భక్తులు అందరు రెండు చేతులతో నమస్కారం చేస్తూ, స్వామి ఏమి చెబుతారా అని ఎదురు చూస్తున్నారు.  నేను కూడా జనం లో ఒక మూల కూర్చొన్నాను. నమస్కారం మాత్రం చెయ్యొద్దని నా మనసుకు చెప్పాను.  స్వామి ఒక్క సైగ చేసారు.  కొంచెం వంగితే అందే మైకు ని , మరో భక్తుడు ఆయన నోటిదగ్గర పెట్టాడు.  ఇంకో సైగతో , గాలి కంట్రోల్ చెయ్యబడింది.  స్వామిని నిశితంగా పరిశీలించిన మనసు ఇంకో ప్రశ్న అడిగింది, ఎందుకు స్వామికి పొట్ట వచ్చింది అని?  దీని అసాధ్యం కూల , కొంచెం మనసు మూసుకూర్చోరాదు?  నీకెందుకే స్వామికి పొట్ట ఉంటే, లేక పొతే? నా సమాధానం తో  అది తృప్తి పొందలేదు.  అదికాదు అన్న , స్వామి అంటే  భగవంతునికి ఎంతో చేరువతో ఉండి, ఖటిన ఉపవాసాలతో, శరీరంపైన నియంత్రణ కలిగి ఉంటారు , కాదా ? మరి పొట్ట వస్తే అర్ధం ఏమిటి? బాగా కొవ్వు పదార్ధాలు తింటున్నట్టు కదా?  నాకు సమాధానం తెలీదు, మనసుని మళ్ళి నోరు మూసుకోమన్నాను.  ఇంతలో స్వామి ఇంకో పది మందికి గాల్లో నే ఆస్వేరదించారు.  నిజమే ఆశ్వీర్వాదం గాల్లో నే కదా చేస్తారు? కాదురా, తల మీద చెయ్యి పెట్టి కూడా చెయ్యొచ్చు, అది కూడా తెలీద , నా మనసు మందలింపు.

స్వామి ప్రసంగం మొదలైంది,  వెంకటేశ్వర స్వామి గూర్చి చెప్పారు. వెన్ అంటే పాపం అని , కట అంటే తొలిగించే వాడని చెప్పారు. ఈ విషయం నాకు తెలుసు.  చాల మందికి కూడా.  ఇక తిరుమల గురించి,  మన శరీరంలో ఉండే ఏడు కొండలగురించి, మన శరీరమే తిరుమల అని , ఇలా చెప్పుకొంటూ పోయారు.  మనసే దేవాలయం అనే పాట పాడి  భక్తులను రంజింప చేసారు. ఆ యన చేబుతున్నంత సేపు నా పక్కనున్న మహా భక్తుడు , ఒక్కటే దండాలు. ఆహ, ఓహో అంటూ తన్మయత్వం. ఎవరి ఆనందం వారిది. 

పాట పడడం అయిపోయింది.  ఇక అప్పుడు ప్రారంభమైంది , ఆశ్వీర్వాద కార్యక్రమం.  పొలో మని, ఆశ్వీర్వాదం తీసుకోడానికి లైను లో నుంచున్నారు భక్త వందలు (వంద మంది ఉంటారేమో)  ఒకరి తర్వాత ఒకరు, కాళ్ళ మీద పడి పోతున్నారు.  ఆ స్వామిజి వెనుక శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం ఉంది, "ఆ దేవదేవునికి మొక్క కుండ, ఈ స్వామికి మొక్కడం ఏమిటి" అని, నా మనసు ప్రశ్న. నాకు తెలీదు.  "అలా చేస్తే ఆ దేవునికి అవమానం కాదా", నోరు మూసుకో, ఇంకో ప్రశ్న అడగకు.  స్వామి గుప్పిళ్ళతో బాదం పప్పులు తీసారు.  తీసి ఒక్కొకరికి ఇస్తూ పోతున్నారు.  భక్తులు తీసుకొని, కళ్ళకు అద్దుకొని, కాళ్ళ మీద పడుతున్నారు.  ఆశ్చర్యం ఏమిటి అంటే , స్వామి  అలా కాళ్ళ మీద పడడం స్వాగతించి, వాళ్ళను దీవిస్తూ పోవడం.  నేను కొంత మంది పూజారులను చూసాను.  పూజ చేయించిన తర్వాత ఎవరినా భక్తులు , పూజారులను దేవుని ప్రతిరూపంగా భావించి పాదాభివందనం చేస్తే, ఆ పూజారి , ఆ నమస్కారాన్ని ఆ దేవునికి అంకితం చెయ్యడం చూసాను. అది వారి అవున్నత్యాన్ని సూచిస్తుంది. మరి స్వామిజి లా విషయం అలా కాదు. వాళ్ళే దేవుళ్ళుగా , భక్తులను ఆశ్వీర్వదిస్తున్నారు.
ఇంతలా స్వామి  టచ్ స్క్రీన్ ఫోన్ మోగింది, ఆ .. ఆ.. వస్తున్నా .. కలుస్తా.. అంటూ మాటలు , ఫోన్ అయిన తర్వాత , మళ్ళే ఆశ్వీర్వాదo .

ఇక చివరి ఘట్టం. స్వామి చిన్న పిల్లలను దగ్గరకు పిలిపించుకొని ముద్దాడడం.  వాళ్ళ తల్లి తండ్రుల మొఖంలో రెండు వెలిగిన బల్బులు.  పిల్లలకు అక్కడున్న బాదాం పప్పులు ఇస్తే తీసుకోలేదు.  అరటిపళ్ళు ఇస్తే తీసుకొన్నారు.  ఇంతలో, స్వామి వారిని పిలిచిన, ఆలయ కమిటి వాళ్ళు, ఒక వెండి పళ్ళెంలో, తాంబూలం, వక్క, అరటిపళ్ళు, రెండు సీల్డు కవర్లు పెట్టి, స్వామికి ఇచ్చారు.  స్వామి,  దూరంగా నిలబడ్డ ఇద్దరు భక్తులను పిలిచి, అరటిపళ్ళతో ఆశ్వీర దించారు. తాంబూలం, వక్క ఒక సోదరికి ఇచ్చారు, ఆవిడ పిల్లడు అందులో అరటి పండు తినేస్తే, ఆవిడ తాంబూలం చప్పరించింది.  స్వామి మాత్రం రెండు సీల్డు కవర్లు, మడిచి బాగ్ లో పెట్టుకొన్నారు. ఎవరు చెప్పక్కరలేదు అవి దక్షిణ అని.

నాకు ఆది శంకరాచార్య ఒక్క సారి గుర్తుకు వచ్చారు.  ఆయన  ఎలాంటి పల్లకిల్ల్లో తిరగలేదు, ఎలాంటి సేవలు చేయించుకోలేదు , ఒకసారి ఆయన భిక్షకు వెళితే , ఒక స్త్రీ దగ్గర  ఏమి భిక్ష లేక పొతే, మీ ఇంట్లో ఏది వుంటే అది ఇవ్వు అమ్మ తీసుకొంటాను అన్నారు. ఆవిడ ఇల్లంతా వెతికి ఒక్క ఎండి పోయిన ఉసిరికాయ ఉంటే , అదే భిక్షగా వేసింది.  ఆ మహాత్ముడు, ఆది గురువు చలించి పోయి,  కనక ధర స్త్రోత్రం చేస్తే,  ఇల్లంతా బంగారు ఉసిరికాయలు రాలాయి.  ఇప్పటికి కనక ధర స్త్రోత్రం చేస్తే, ఇంచు మించు అలాంటి ఫలితమే కలుగుతుంది అని నమ్మకం.  అలాంటి గురువులు తిరిగిన నేల మనది. ఇప్పటి స్వాములకు AC కార్లు,  నడుం నొప్పెట్ట కుండ చక్కటి ఆసనాలు, కాళ్ళకింద మెత్తటి తలగడాలు, ఆశ్వీర్వాది౦చ డానికి బాదాం పప్పులు .
తను కొన్ని వందల కోరాడ దెబ్బలు తిని, శ్రీ రాముడికి గుడి కట్టించిన రామ దాసు ఎక్కడ, ఇచ్చిన దక్షిణ పంచలో కుక్కుకొని  పలాయనం చిత్తగించే స్వామిజి లు ఎక్కడ?   స్వామి ఇంకా అమెరికా అంత పర్యతిస్తారంట!.   ఇవ్వన్ని చూసి అనిపించింది, నేను కూడా స్వామిజి ఎందుకు కాకూడదు?  అసలు ఈ సృష్టిలో స్వామిజి కన్నా మించిన ఉద్యోగం , క్షమించాలి, సమాజ సేవ, కాదుకాదు, ప్రజా సేవ, అయ్యో నామతి మండ, నాకు సరైన పదమే గుర్తుకు రావడం లేదు, సరే ఏదోటి కానీ, స్వామిజి అయితే బాగుంటుంది కదా. 

Monday, September 13, 2010

మనకు ఎంత మంది దేవుళ్ళు?

ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఆకాసంలో ఉన్న నక్షత్రాల కన్నా ఎక్కువ దేవుళ్ళున్నారు మనకు.  మన వాళ్లకు దేవుళ్ళు చాలక ఇంకా సృష్టిలో మనకు చేరువులో ఉండే జీవ రాసులన్నిటిని కూడా దేవుళ్ళుగా చేసే సారు.  ఇది ఎవరు ఎందుకు చేసారో తెలుసుకోవడం మాములు విషయం కాదు.  తెలుసుకొనే అవకాసం కూడా లేదు. మనలో ఒక్కరైన "మనకు ఉన్న దేవుల్లెంతమంది" అంటే ఒక్క రోజులో లెక్క వేసి చెప్పగలరా? చెప్పి ఒప్పించగలరా?


మనకు రొజూ పాలిచ్చె  ఆవుని కామధేనువు చేసారు,  కుక్కని కాలభైరవుడిని చేసారు,  పాముల సంగతి ఇక చెప్పక్కరలేదు.   గూటిలో ఉన్న సాలె పురుగు, ఏనుగు, వరాహం, తాబేలు, పులి , సింహం , మర్రి చెట్టు, వేపచెట్టు ఇలా ఒకటేమిటి సమస్త ప్రాణకోటిని దేవుళ్ళు చేసారు.  ఇలా ఇన్ని రకాల దేవుళ్ళని  సృష్టించి మనం సాధించుకొంది ఏమిటి?  "శ్రీ రామ రామ రామేతి రమే రమే మనో రమే , సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే", అన్న ఒక్క రామ వాక్యం చాలదా వెయ్యి సార్లు రామ నామ జపం ఫలితం ఇవ్వడానికి?  ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రం చాలదా?  అసలు ఎందుకు ఇన్ని పురాణ కధలు రాసారు? 


మన కావ్య రచన ఎంతో గొప్పగా మొదలైంది.  ఆది కావ్యంగా రామాయణం ఇప్పటికి  ప్రపంచానికి ఆదర్శ ప్రాయమైనది. రామాయణం మీద పరిశోధించి ఎందరో దేశ విదేశీయులు డాక్టరేట్ డిగ్రీలు పొందితే, మరెందరో మోక్షాన్ని పొందారు.  వాల్మీకి రచన ఎంతో సౌందర్యవంతమైంది అనన్య సామాన్య మైనది. ఆయన రచనలో ఎక్కడ అతిశయం లేదు.  వానర లక్షణాలు వర్ణించినప్పుడు ఇంక దూకుడుగా వ్యవహరించారో , రాముని సీత వియోగాన్ని వర్ణించినప్పుడు, ఒక మానవుడిగా రాముడు పడే భాదను మనవ సహజంగ వర్ణించారు.  తర్వాత రాసిన మహా భారతం కూడా అత్యంత సహజంగా రాయబడింది. ఏ సృష్టిలో ఏ జీవికి ఉండవలసిన లక్షణాలు ఆ జీవికి ఆపాదించారు ఈ మహాకావ్యాలలో.  ఉదాహరణకు మాయ లేడి విషయానికి వస్తే, అది సీతాదేవి వద్దకు వచ్చి , అక్కడే తిరుగాడుతుంది, లేడి సహజ సిద్దమైన బెరుకు, తడబాటు , వయ్యారం అన్ని ఆ లేడికి ఉంటాయి.  అంతే  కానీ ఆ లేడి గబుక్కున "నన్ను పట్టుకో " అంటూ మాట్లాడదు. సర్వాంతర్యామి ఐన శ్రీ కృష్ణుడు మాయ జూదం గురించి తెలుసు కోలేకన, మౌనంగా ఉన్నాడు ?  తనకి అన్ని తెలిసిన ఎక్కడ తన మాయలు మంత్రాలూ ఉపయోగించలేదు. అత్యంత సహజంగా కావ్య రచన సాగింది.


మరి అంత గొప్ప రచనలు కలిగిన మనం, రాముడు, కృష్ణుడు, శివుడు చాలదన్నట్టు, వేలకు వేలు దేవుళ్ళని ఎవరు సృష్టించారు?  బలి చక్రవర్తి కధ మనం ఎన్నో సార్లు విన్నాము.  విష్ణు మూర్తి ఒక కాలు భూమి మీద, రెండో కాలు ఆకాసంలో పెడతాడు, అంటే మరి అప్పటికి  బలి చక్రవర్తి ఎక్కడున్నట్టు?  విష్ణువు ఎక్కడున్నట్టు ? మనకు వేదాలు ప్రామాణికం అంటారు, మరి వేదాలలో ఈ కధలు ఎమన్నా చెప్పారా?  మిగతా ఏ మతంలో నైన గుడికి వెళుతున్నాను అంటే ఒక దేవుడి గుడికి అనే అర్ధ వస్తుంది, కానీ మనకు వెంటనే ఏ గుడికి అన్న ప్రశ్న అడగక పోతే అవదు.   మన వాళ్ళ ఉహ శక్తికి అంతం లేదు.  ఒకటికి  ఒకటి  అలా సృష్టించుకొంటు వెళ్లి పోయారు. ఇప్పటికి ఆగటం లేదు.  అసలు  మన దేవుల్లందరి గురించి చదివి, తెలుసుకొని దానిని ఇంకొకరికి చెప్పాలంటే  ఒక జన్మకు సాధ్య పడుతుందా?

గొప్పవాళ్ళంటే ఎవరు? మనం కాలేమా?

మనం చాల మందిని గొప్పవాళ్ళు అనుకోని ఫిక్స్ అయిపోతము. అబ్బో ఆయన చాల గోప్పవాడండి అంటాము లేదా ఆవిడ సామాన్యురాలు కాదండి అంటాము. గొప్పతనం అనేది నిరంతర ప్రక్రియ. తెలివితేటలూ అనేవి వర్తమానానికి చెందినవి అవుతే, గొప్పతనం ఎదిగే మొక్క లాంటిది.  అసలు ఏది గొప్ప? గొప్పతనం అంతే ఏమిటి? గొప్ప పని చేసే వాళ్ళను గొప్పవాళ్ళు అంటాము.  చాల చిన్న విషయం కదూ? అది సరే ఏది గొప్ప పని?  మీరు మీ ఇంటి నుండి నడుచుకొంటూ వీధి చివరన ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లారు.  మిమ్ములను ఎవరైనా గొ..ప్ప పని చేసావో సుందరం అని పొగుడుతార?  లేక పోతే మీ పిల్ల ఆ డుకొంటుంటే గట్టిగ కేక వేసి పిలిచారు, అది ఒక గొప్ప పన? ఎందుకు కాదు?  నిజమే పైన రెండు ఉదాహరణలు గొప్ప పనులు ఎందుకు కావు?


ఎందుకంటే అవి సామాన్యంగా ప్రతి మనిషి చెయ్యగలిగే పనులే.  కాబట్టి అందరు చేసే పని చేస్తే అది సాధారణ పని అవుతుంది కానీ గొప్ప పని కాదు.  మీరొక స్టూడెంట్ అనుకొందాం, క్లాసు లో ఉండేది ఒక నలభయ్ మంది అనుకొంటే, మీకు అందరికన్నా ఎక్కువ మార్కులు వస్తే మీరు గొప్ప. మీరో ఎ౦ప్లయి అయితే , మీ ఆఫీసు లో అందరికన్నా మీరు బాగా  పని చేస్తే గొప్ప. గృహిణి ఐతే ఎంత చక్కగా ఇంటిని అలంకరిస్తే అంత గొప్ప.  అసలు మనం ఎక్కడున్నా, ఎందరి మధ్యలో ఉన్న మనం చేసే పని అత్యుతమది ఐతే మనమే గొప్ప.

మరి ఇంత సులువుగా గొప్ప వాళ్ళు అయిపోవచ్చా?  కాలేము, అందుకంటే ఏ చిన్న విషయం అందరకు తెలిసిందే , అందరు వాళ్ళ శక్తి సామర్ధ్యాల మేరకు పని చేసేవాళ్ళే. మరైతే మనం చేసేదేముంది?  ఇక్కడే మనం కష్టం అనే పదాన్ని ఉపయోగించుకోవాలి.  సాధారణంగ మీ వీధి చివరనున్న కిరణా కొట్టుకు అందరు పది నిముషాలలో వెళ్లి వస్తే , మీరు కొంచెం ఎక్కవ కష్ట పడి ౩ నిముషాలలో వెళ్లి వస్తే , కొంతమంది దృష్టిలో మీరు ఆ సమయానికి గొప్పే.  మీరు రాత్రి చాల పొద్దు పోయేవరకు కష్ట పడి మీ ఇంటిని అలంకరిస్తే మరుసటి రొజూ ఉదయానికి వచ్చే మీ బంధువులకు మీరు గొప్పే.  ఎప్పుడు  క్లాసు లో మధ్య ర్యాంకు లో పాస్ ఇయ్యే మీరు ఫస్టు ర్యాంకు లో పాస్ ఐతే నిజంగా గొప్పే.

కష్ట పడడం అన్నాము కదా, అదేంటి?  కష్టం అంటే మీ స్కిల్ల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం.  మీరు రొటీన్ కి భిన్నంగా ఆలోచించడం, క్వాలిటీ కోసం నిరంతరం అన్వేషించడం.  గృహిణి ఉదాహరణ చెప్పుకొందాం,  ప్రతి రొజూ ఆవిడ ఇల్లు సర్దుతుంది, వస్తువులు ఎక్కడుండాలి అన్ని అక్కడ పెడుతుంది, ఇలా రొజూ  చేస్తూ ఉన్నప్పుడు , ఆవిడకు  కొన్ని వస్తువుల ప్లేసులు మారుస్తే ఇంకా అందంగా ఉంటుంది అని అనిపించచ్చు, ఇల్లు ఇంకాస్త తుడుస్తే బాగుంటుంది అనిపించచ్చు, అంటే ఆవిడ మెరుగైన క్వాలిటీ కోసం  చుస్తుందన్న మాటే కదా. వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి నప్పుడు అక్కడున్న  అలంకరణ వస్తువులు చూసి తను కూడా  అవి ఇంట్లో స్వంతగా తయారు చేసుకోవచ్చు, అలా తన స్కిల్ల్స్ మెరుగు పరుచుకోవచ్చు.   ఇంటికి సంభందించిన పుస్తకాల ద్వార ఇంటిని ఇంకా మెరుగ్గా అలంకరించుకోవచ్చు.  సాధ్యమైనంత ఎక్కవగా ఏ పని గురించైనా ఆలోచిస్తే, తప్పకుండ  ఆ పనిని మెరుగ్గా సాదించకోవచ్చు. 

గొప్పగా ఉండడం నిజంగ ఎంతో హాయినిస్తుంది. మన గురించి అందరు చెప్పుకొంటారు, ప్రత్యెక మైన గౌరవం ఉంటుంది. దీనికి కావలసిందల్ల , చేసే పనిని ఇంకాస్త మెరుగ్గా చేసే చాలు. అలా నిరంతరం మెరుగ్గా చెయ్యాలని ఆలోచించిన వాళ్ళు ఇప్పటికే చాల గొప్ప వాళ్ళగా పిలవబడుతున్నారు. గొప్పతనం అంటే పేపర్లో నో , టీవీ లోనో కనపడడం మాత్రమే కాదు, మన వీధిలో , మన కుటుంబంలో, మన పక్క వీధిలో, మన పరిచయస్తుల్లో, అసలు పరిచయమే లేని వాళ్ళ మధ్యన కూడా గొప్ప వాల్లనిపించుకోవచ్చు. అది చాల సార్లు తాత్కాలికమే కావచ్చు కొని ఎనలేని ఆనందాన్ని  మాత్రం ఇస్తాయే.  త్వరలో మనమందరం కూడా గొప్పవాళ్ళం కావాలనే నా ఆశ.

Saturday, September 11, 2010

వినాయక కధలో వాస్తవాలు ఎలా తెలుసుకోవడం ?

వినాయక చవితి కధ మనం తర తరాలనుండి చదువుతున్నాము . అసలా కధ ఎప్పడు , ఎక్కడ మొదలైందో ఎవరికైనా సరిగా తెలుసా? నాకు మాత్రం ప్రతి సంవస్స్తరం ఒకే ప్రశ్న.  చంద్రుడు ఎలా నవ్వుతాడు?


సరే చంద్రుడు ఇదివరకు నవ్వే వాడె అనుకొంటే , ఇప్పుడు నవ్వడం మానేసాడ?  ఆలోచిస్తే ఇది వితండ వాదం లానే ఉంటుంది. ఏయ్ ఎంత ధైర్యం నీకు పెద్దలు చెప్పిన దాన్ని మళ్ళి ప్రస్నిస్తున్నావా?  నేరుమూసుకొని వాళ్ళు ఏది రాసారో అదే చదువు, ప్రశ్నలు అడక్కు అంతే ఏ టాపిక్ ఇక్కడే ఆగి పోతుంది.  నేను చదివే కధలో అనుమానం వస్తే దానిని నివృతి చేసుకోకూడద? అందుకే అసలు ఏ కధ ఎవరు రాసుంటారు? రాసిన వాళ్ళు చంద్రుడు నవ్వాడని ఎందుకు రాసారు?  కధనంత చంద్రుడి  చుట్టూ ఎందుకు తిప్పారు?


మన భారతీయులకు నవ గ్రహాలు ఉంటాయని, వాటి పేర్లు, అవి సూర్యుని చుట్టూ తిరిగే వేళలు, భూమికి ఇతర గ్రహాలకి ఉండే సంభంధం అన్ని  ఖచ్చితంగా  తెలుసు.  దాని ఆధారంతో నే కేలండర్ తయారు చేసారు. తిధులు, నక్షత్రాలు ఖచితంగా అంచనా వేసారు. చంద్రునికి, ఏ రొజూ  ఏ నక్షత్రం దగ్గరున్తాడో ఒక్క తప్పు లేకుండా రాసారు.  ఇన్ని తెలివి తేటలున్న వాళ్ళు, పురాణ కధలను మాత్రం, నమ్మ శక్యం కానీ రీతిలో రాసారు.  వ్రాసిన వారి ఉద్దేశ్యం బహుశా సామాన్య జనాలకు ఏ కధలను చేరువగా చెయ్యడం , తద్వారా భక్తీని పెంపొందించడం. నిజమే కానీ దానికోసం ఇలాంటి కధలు ఎందుకు రాసారో ఆ పరమేశ్వరుడికే   తెలియాలి.


ఈ కధలో శమంతక మణి ఉంటుంది , దానిని సత్రాజిత్తు తమ్ముడు ధరించి వేటకు వెళతాడు. సింహం అతనిని వధించి మణి అపహరిస్తుంది. ఇంతవరకు ఫర్వాలేదు. వెంటనే జాంబవంతుడు సింహంతో పోరాటం చేస్తాడు. జాంబవంతుడు ఒక భల్లూకం . సింహం మృగరాజు.  భల్లూకం సింహంతో తలపడినట్లు ఏ ప్రపంచ సాహిత్యం లో ను లేదు. అది సరే జాంబవంతుడు సింహాన్ని చంపేస్తాడు, ఎందుకంటే మణి కావాలని!.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , మనుషుల్ల లాగే ఈ జంతువులూ కూడా మణి కోసం దెబ్బలాడుకోవడం.  జాంబవంతుడు మణిని  తన కూతురికి ఆడుకోవడానికి ఇవ్వడం. ఇది సరేకానీ ఈ సృష్టి స్తితి కారకుడు ఇన ఆ మహా విష్ణువు, జాంబవంతుదితో  పోరాడి ఆ మణి గెలిచి, జాంబవతిని పెళ్లి చేసుకోవడం.  జాంబవతి ఒక భల్లూకం కూతురు, ఇన సరే మనవ రూప ధరి ఇన కృష్ణుడిని పెళ్ళాడడం ఏమిటో?


ఇలాగే చంద్రుడు నవ్వడం మనకు తెలుసు. భూమి చుట్టుకోలతలో నాలుగో వంతు ఉండే చంద్రుడు, ఒక మానవుని లాగా పక్కున నవ్వడం ఏమిటో ? ఈ మొత్తం కధలో లాజిక్ ఎంత ఆలో చించిన అర్ధం కాదు. ఎవరినైనా అడుగుదామంటే అది మన పురాణ కధలు , వాటికీ అర్ధాలు వేత్తక్కుడదు అంటారు.  ఈ అనుమానం నాకు చిన్నతనం లో వచ్చింది,  ఈ రొజూ పూజలో ఇదే ప్రశ్న పిల్లల దగ్గరనుండి ఎదురైంది, నాకు తెలుసు ఈ కధని వినాయక చవితి రొజూ చదవండి, అంతే కానీ ఈ ప్రశ్నలు అడగద్దు అని చెప్పడం తప్ప ఇక ఏమి చేయలేను. 

పూజారి కాళ్ళ మీద ఎందుకు పడతావు?

క్రిందటి వారం నేను మిల్వాకీ స్టేట్ కి వెళ్ళాను. అక్కడ హిందూ మందిర్ ఒకటి ఉంది.  అక్కడొక హోమం జరిగింది. హోమం అంత అయిన తర్వాత, అక్కడ పూజారులతో కొంత సేపు మాట్లాడదామని వెయిట్ చేశాను.  ఒక పూజారి కలిస్తే అతనితో మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పటికి పూజ అంత అయి చాల సేపైంది, ఎవరిమటుకు వాళ్ళు ఇళ్ళకు వెళ్లి పోతున్నారు.  పూజారి తో కుశల ప్రశ్నలు మొదలయ్యాయి. మీరు ఎక్కడుంటారు అంటే మీరేక్కడుంటారు అని కబుర్లు సాగాయి.  మేము ఇలా మాట్లాడుతుండగానే, వేరొక భక్తుడు మాతో కలిసాడు. అతను కూడా మీరేక్కడుంటారు అని కబుర్లలో పడ్డాడు. అంత వరకు బాగానే ఉంది కానీ , ఉన్న పళంగా ధడేలు మని ఎవరో పడిపోయి న  చప్పుడు. నా  పక్కన మాట్లాడుతున్న మరో భక్తుడు కనిపించలేదు. పూజారి కళ్ళు మూసుకొని ఏదో శ్లోకం చదవడం మొదలు పెట్టాడు.  కొన్ని క్షణాల తర్వాత అది ఆస్వీర్వాదం అని అర్ధం అయింది.   అది పూర్తి అవగానే,  కింద నుంచి పైకి లేచిన భారీ మనిషి, ఎక్క్కడ చూసానో ఆలోచించే అవసరం లేకుండానే అర్ధం అయింది ఇంతకుముందు నాతో కలిసి పూజారితో మాట్లాడిన మనిషి అతనే అని.  ఆస్వీర్వాద శ్లోకం అంతగా అర్ధం కాకపోయిన, అంత కంటే పెద్ద అనుమానం, నా పక్కనున్న మనిషి , ఉన్న పళంగా అలా పూజారి కాళ్ళమీద ఎందుకు పడ్డాడో తెలీలేదు. 

అదేంటి ఇందులో అర్ధం కాకపోవడం ఏంటి, పూజారి అంటే ఎవరు? సాక్షాత్తు దేవుడి ప్రతిరూపం, అలా కాళ్ళ మీద పడడంలో తప్పేంటి అనే వాళ్ళు చాల మంది వున్నారని నాకు తెలుసు.  కానీ అసలు కధంతా ఇక్కడే ఉంది.  కాళ్ళ మీద పడే భక్తుడు , పూజారి నుండి ఆశించేది ఏమిటి?  ఆ సదరు భక్తుడిని పూజారి దీవించాలి, అదికూడా ఒక సంస్కృత శ్లోకం తో దీవిస్తే మరీ  మంచిది!. నీల మీద బొక్క బోర్ల పూజారి కాళ్ళమీద పడిన భక్తుడికి ఆ సమయంలో అంత కన్నా పెద్ద కోరికలు ఏమి ఉండవు, పూజారి తనను దీవించాలి, తన కుటుంబాన్ని దీవించాలి అంతే.  అది సరే కానీ ఓ భక్తుడా నువ్వేమి ఘనకార్యం చేసావని నిన్ను దీవించాలి? పూజారిని చూసావు, ధడేల్ మని కాళ్ళ మీద పడ్డావు, అంతే! నిన్ను దీవించాలి. నువ్వు పచ్చగా ఉండాలని దీవించాలి, నువ్వు చేసిన సర్వపాపాలు నశించాలి అని దీవించాలి, సకల సంపదలు ప్రాప్తించాలి అని దీవించాలి. 

  దేవుడికి పూజ ఎందుకు చేస్తావు? పూజ చెయ్యడం అంటే, దేవుడిని సంతోష పెట్టడం.  దేవుని గుణ గణాలు వర్ణించడం. దేవుని గొప్పదనాన్ని కీర్తించడం, అష్తోతరం తో గాని , శతనామార్చన తో గాని, సహస్రనామార్చన తో గాని దీవున్ని కీర్తించడం.  నానా విధ ఫలం లతో పూజించడం, అంగ వస్త్రం సమర్పించి , తామ్బులాది సత్కార్యాలు తో సేవించడం. ఇన్ని పనులు చేసి, తర్వాత నీ కోరిక చెప్పుకొంటే,  నువ్వు చేసిన సేవల ద్వార ఆ భగవంతుని ద్రుష్టి నీ మీద ప్రసరించి, ఆయన ఆనందించి , నిన్ను అనుగ్రహించి తద్వారా నీకు మేలు జరుగుతుంది అని, దేవుణ్ణి నమ్మే మనలాంటి వాళ్ళందరి నమ్మకం.  నీ కష్టానికి తగ్గ ఫలితం ఆశించడం ఎంత మాత్రం తప్పు కాదు.  నువ్వు దేవుని కోసం కష్ట పడు , నీకోసం దేవుడు కష్ట పడ తాడు , చాల సులువైన విషయం. 

మరి ఇలాంటి పనులెవి చెయ్యకుండ, పూజారి కనిపించాడని ధడేల్ మని కాళ్ళ మీద ఎందుకు పడతావు? నిజమే పూజారి భగవంతుని సన్న్నిధిలో గడుపుతాడు. అర్చన,  అభిషేకం, హోమం , మహా హోమం  అన్ని చేస్తాడు.  అవన్నీ అతను ఎవరినా దాత చేయిస్తే చేస్తాడు.  నీకు కావాలంటే దేవునికోసం పూజ చేస్తాడు. అసలు పుణ్యం అంతా పూజలు చేయించిన వాళ్ళకు వస్తుంది కానీ పూజారికి కాదు. మరి తన ఉద్యోగ ధర్మం నిర్వహిస్తున్న పూజారి కాళ్ళమీద పడి,  నిన్ను ఉన్న పళంగా దీవించమని అడుగుతున్నవే, అది న్యాయమేనా ?  నువ్వు దేవుని కోసం ఏమి కష్ట పద్దవని దీవెనలకు అర్హుడివి? అప్పుడే ఒక దాత కోరికమేరకు దేవుని పూజ చేసి వచ్చిన పూజారి కాళ్ళ మీద పడి పొతే నీకు కూడా కొంత ఫలితం వస్తుందని అత్యాసా?