Wednesday, July 27, 2011

నేను అనుకొన్న పనులెందుకు చేయలేక పోతున్నాను.. మీ కైనా తెలుసా?

 తెలుసుకోన్నంత సులువు కాదు, దానిని ఆచరించడం.  ఒక వేళ అలా చేసిఉంటే, నేను ఎంతో సాధించే వాడినేమో? . అసలు నేనేనా?  లేక అందరు అలాగే ఉంటారా?   చిన్నప్పుడు పెద్ద వాళ్ళు ఎవరు కనబడిన అంటుండేవాళ్లు, "బాగా చదువుకో బాబు" ! అని, చాల చిన్న మాట అది "బాగా చదువుకో" నేను సరే అని, "బూం .. బూం  అని  నా ఊహాజనిత మోటారు సైకిల్ ను  నడుపుకొంటూ పారి పోయేవాడిని.  అసలు బాగా చదువు కోవడం ఏమిటి అని ఒక్క సారి ఆలోచించి ఉంటే, అప్పుడే అర్ధం అయ్యేది, వినడానికి, తెలుసుకోడానికి, ఆచరణలో పెట్టడానికి ఉన్న తేడ.

సరే కొంత వయసు వచ్చింది, అప్పుడైనా అనుకొన్నది చెయ్యొచ్చు కదా?  అవును 'అనుకొన్నది' అన్న మాట వాడాను ఏమిటి? ఎవరినా చెప్పింది అనొచ్చు కదా? అవునులే నాకు కొంత వయసు వచ్చిన తర్వాత, ఎవరిమాటైన నేను ఎందుకు వింటాను? నాకేం కావాలో నాకు తెలుసు!  సరే మరి 'అనుకొన్నది' ఎందుకు చెయ్యలేదు? ఉదయాన్నే నిద్రలేవాలని, ధ్యానం చెయ్యాలని, తనువూ మనసు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, కొత్త విషయాలు తెలుసుకోవాలని జీవితాన్ని, ఉత్శాహంగా మలచుకోవాలని ఇవ్వని నాకు తెలియనివి కావు, మరి ఇందులో కొన్ని కూడా చెయ్యలేను? ఎందుకు? ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు చదువే లోకంగా ఉండి ఉంటే, డాక్టర్ అయి, బ్రతికున్నన్నాళ్ళు  ఎవరో ఒకరిచే గౌరవింపబడేవాడినని తెలుసు, కాని ఆ రోజుల్లో మంచులో తడిసిన నందివర్ధనం లాంటి అమ్మాయిల మీద కళ్ళు నిలిపితే , వాళ్ళలో కొంత మంది నాకు కళ్ళజోడు మిగిల్చి, EYE డాక్టర్స్ అయ్యారు.   సరే నాకున్నఈ శరీరానికి (ఫిజిక్ అనేవాళ్ళు కొంతమంది), S.I అవుతావని అంటే, అదీ ప్రయత్నించాను. అసలది చాల సింపుల్ మేటర్,  గట్టిగ గ్రౌండ్ చుట్టూ పరిగెత్తాలి, ఇనుప గుండు బలంగా విసరాలి, ఓ చిన్నరాత పరిక్ష పాస్ అవ్వాలి. మరి వాటి కైనా ప్రేపేరు అవ్వాలి కదా ? ఉదయాన్నే నిద్ర లేవలేను, పరిగెత్త మంటే చాల బద్ధకం, ఎక్షమ్ కి చదవడం అంటే ఎంతో కష్టం.  ఆరోజుల్లో కొంచెం కష్ట పడి ఉంటే, ఈ పాటికి కమీషనరు అయ్యి ఉండేవాడిని, లేదా కమీషనరకు ఒక కూతురుంటే, చంటి గాడిలా లైన్లోపెట్టేసే వాడిననే చిలిపి ఊహ!.  అలా నాకు తెలిసిన విషయాలనే సాధించలేక పోయాను.
BSRB, RRB అని ఎన్నో యాడ్లు, పాన్ షాప్ ముందు చూసినట్లు గుర్తు, అవన్నీ కూడా మనసు పెట్టి  గట్టిగ నెల రోజులు చదివితే పాస్ అవ్వొచ్చు, తెలుసండి బాబు తెలుసు, కాని చెయ్యలేదు, ఇక చెయ్యలేను కూడా ( వయసు లిమిట్ ఉంటుంది కదా).  అవి ఎందుకు చెప్పానంటే, జాబు తెచ్చుకోర అని నాన్న ఒకటే భాధపడినప్పుడు, కళ్ళముందే  కొంచెం కష్టపడితే ఎన్నో అవకాశాలు, కనిసం ఎప్పుడు సీరియస్ గ ట్రై చెయ్యలేదు.   సరే ఏ దిక్కు లేనివాడికి IT ఏ దిక్కు అన్నట్లు, అదృష్టవశాత్తు దీనిలో వచ్చి పడ్డాను, మరి ఇక్కడైన, అనుకొన్నవి చెయ్యొచ్చు కదా, ఒక నెలరోజుల్లో బిజినెస్ మొత్తం నేర్చుకొని, అందరకు తలలో నాలుకగా ( కొంచెం బరువైన తెలుగు సామెతల ఉంది, ఐన తలలో నాలుక అంటే కొంచెం హర్రోర్ టచ్ కనిపిస్తోంది కదూ) ఉండొచ్చు, కానీ నా వల్ల అవదు, అసలు నా వల్ల ఏపని అవుతుందో నాకే తెలీదు. మొత్తానికి నాకు  ఇన్నాళ్ళకి అర్ధం అయింది ఏమిటంటే,  నా మనసు వేగాన్ని, నా శరీరం అందుకోలేక పోతోంది, అందుకే నాకు అసంతృప్తి. ఇప్పుడు నేను చేయవలసిందల్ల, మనసును మామూలు స్పీడ్ కు తెచ్చి, శరీరాన్ని మనసుకన్న ముందుంచడం. అలా కాకపోతే, శరీరాన్ని మనసుతో సమానంగా పరిగెత్తించడం.  మొదటి దాని కంప్రమైస్ అంటారని తెలుసు. రెండోదాన్ని పట్టుదల లేదా విల్ పవర్ అంటారని తెలుసు. కానీ ఏమిలాభం, అటు కంప్రమైస్ అవలేక, ఇటు శరీరాన్ని పరిగేట్టించలేక, ఎన్నో విషయాలు తెలుసుకొని వాటిని పాటించలేక, ఎప్పటికైనా అనుకొన్నది చేస్తాననే నమ్మకాన్ని వదులుకోలేక,  నా సమయం అంతా ఇలా ఆలోచనలకే పరిమితం చేసి, ఈ సంఘర్షణ లోనే జీవించడం నాకు తెలియకుండానే నాకు అలవాటై పోయింది.  అది ఇన్నాళ్లకు మీతో పంచుకొనే అవకాసం కలిగింది.

Friday, July 22, 2011

బాబా నీ మందిరంలో సోదాలను ఎప్పుడు ఆపిస్తావు?

బాబా - క్తులకు రోసా నిచ్చే రెండు అక్షరాలు.  బహుశ అమ్మ తర్వాత అంత శక్తి ఉన్న మాట. మరేమిటి ఇప్పుడా పేరు వింటే నాకు యజుర్వేద మందిరం, అపార ధనరాసులు, అక్రమ సంపాదన, బెంగలూరుకి తరలి వెళుతున్న డబ్బు గుర్తొస్తోంది ఏమిటి? నేను కూడా పుట్ట పర్తి వెళ్ళిన వాడినే, బాబా దర్శనం కోసం పడిగాపులు కాసిన వాడినే, బాబాకి సమర్పించిన కానుకలు, సాక్షాత్తు ఈశ్వరార్పణం అని భావించిన వాడినే, మరి ఈనాడు నా మనసు ఎందుకు పరివిధాల ఆలోచిస్తోంది?  నా మనస్సు నిలా కలుషితం చేస్తే హక్కు మీకేవరిచ్చారు?
సర్వసంగ పరిత్యాగిని సాధువు, మరో మాటలో చెప్పాలంటే బాబా అని అనడం పరిపాటి. వాళ్ళ మార్గం ఆధ్యాత్మికం, పయనం శివ కైలాసం. భౌతిక సుఖాల మీద ఆశ లేక, పంచ భౌతిక సుఖాలు అసాస్వతం అని నమ్మి, మనసును పరమేశ్వరుని మీద పెట్టి, తను వెళ్ళే మార్గంలో ఉన్న కష్టనష్టాలు, ఎత్తు పల్లాలు,  సంసార సాగరాన్ని ఈదుతున్న మన  సామాన్య ప్రజానీకానికి, అర్ధమయ్యే రీతిలో చెప్పేవాళ్ళు నిజానికి బాబాలుగా  మన సంస్కృతిలో నిలిచారు. వాళ్ళ చూపు, మనకు మోక్షమార్గపు రెండు మెట్లు ఎక్కిస్తుంది అనే నమ్మకం, వాళ్ళు నిరంతరం మన వెన్నంటే ఉండి, సర్వ ఆపదలనుండి రక్షిస్తారు అనే బలమైన నమ్మకం వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరించేల చేస్తుంది. ఇది జన్మ జన్మల అదృష్టంగా భావించేలా చేస్తుంది.
ఈ నాడు మరి ఏమైంది?  సాయి బాబా మందిరంలో సోదాలు ఏమిటి? నడిచే దేవునిగా పిలవబడ్డ బాబా, బ్రతికున్న రోజులలో ప్రధాన మంత్రులు, క్రికెట్ ఆటగాళ్ళు, సినిమావాళ్ళు, విదేశీయులు, ఒక్కరేమిటి, ప్రతి ఒక్కరు ఆయన పాదాల మీద పడ్డ వాళ్ళే. అసలు యజుర్వేదమందిరం అనేది ఒకటి ఉంది, దానిలో ధనం ఉంటుంది అనే ఆలోచన కూడా రాని వాళ్ళే.  సోదాలు ఎప్పుడు చేస్తారు? అన్యాయం జరిగినప్పుడు, దొంగ సొత్తు కనుగోవడానికి చేస్తారు. మరి సాక్ష్యాత్తు బాబా నివాసంలో సోదాలు ఏమిటి? ఆయన వీభూది కల్లకద్దుకొని అదే పది కోట్లు గా మురిసిపోయిన వాళ్ళు ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత చేస్తున్న ఈ  సోదాలు ఏమిటి?
బాబా ఈ అన్యాయం మేము చూడలేము. నిన్ను సాక్ష్యాత్తు దైవ స్వరూపం గా భావించాము, ప్రపంచంలో ఎక్కడా దేవుని గుడిలో అక్రమ ధనం కోసం సోదాలు నిర్వహించబడలేదు. అయినా మీ ఆంతరంగిక మందిరంలో అన్ని కోట్ల రూపాయలు ఎందుకున్నాయి?  అన్ని KG ల బంగారం ఎందుకుంది? మాకూ తెలుసు బాబా,  మీరు ఎన్నడు ప్రజలకు పంచే వాళ్ళే కాని, ఎవరి దగ్గర నోరు తెరిచి అడగలేదు. మీకు సర్వజన క్షేమం తప్ప, మరే విషయం మీద మోజు లేదు.  ఇప్పుడు జరుకుతున్న వన్ని, మీకు తెలియకుండా మీరు చని పోయిన తర్వాత వచ్చి చేరాయి. చిన్నతనం నుండి సర్వసంగ పరిత్యాగి అయిన మీకు డబ్బు బంగారం మీద మోజు ఉండదని, అసలు  మరే విషయం మీద వ్యామోహం ఉండదని మాకూ తెలుసు, మా భాదల్లా ఒక్కటే, మీ చుట్టూ ఇలాంటి విషపురుగులు చేరుతుంటే మీరు ఏమిటి చేస్తున్నారు? అవును బాబా ఇది తప్పు ఒప్పులు బేరీజు వేసే  తరుణం కాదు, కానీ  మీ మందిరం లో దొరికే ప్రతి ఒక్క రూపాయి  నాణెం , మా నమ్మకమనే పాలలో ఒక్కో  విషపు బిందువు కలుపుతోంది. దయ చేసి దీనిని  ఇక్కడితో ఆపించు బాబా.