పాల పుంత వైపు నా ప్రయాణం (పార్ట్ 1)
ఆరు బయట ఆకాశం క్రింద కూర్చొని చుక్కలు లెక్కపెట్టడం మన చిన్నతనపు సరదా . చంద్రుడు మనకు రోజూ కనిపించక పోయినా నక్షత్రాలు మాత్రం రోజూ పలకరిస్తాయి. ఒకరకంగా మనకు వాటితోనే అనుభంధం ఎక్కువ. ఇలాంటి నక్షత్రాలు వందలు, వేలు , లక్షల్లో దర్సనమిస్తే ? ఆ ఊహే నన్ను పాలపుంత వైపు నడిపించింది. మరి పాలపుంత ను వెతుకుతూ నా ప్రయాణం ఎలా సాగిందో మీరు వివరించే ప్రయత్నమే ఇది.
మనం ఉన్న గాలక్సీ ని పాలపుంత లేదా మిల్కీ వే అంటారని మనకు తెలుసు. పాలపుంత గురించి నేను చాల చదివాను. అప్పటినుండి దానిని ప్రత్యక్షం గా చూడాలని మనస్సులో ఎంతో కోరిక కలిగింది. అసలు పాల పుంత అంటే ఏమిటి ? అది తెలుసు కొంటే గాని నేను పాలపుంత చూడాలని ఎందుకు తపన పడ్డానో మీకు అర్ధం అయ్యేలా చెప్పలేను.
మన భూమి ఒక గ్రహం అని, అది సూర్యుడు అనే నక్షత్రం చుట్టూ తిరుగుతుంది అని , అలాగే తొమ్మిది గ్రహాలూ సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అని , వీటినే సౌర కుటుంబం అంటారని మన అందరం చిన్నప్పుడే చదువుకొన్నాము. ఈ సౌర కుటుంబం చివరలో అంటే ప్లూటో తర్వాత , సౌర కుటుంబం అంచున ఏముంటుంది..? ఒక మేఘాకార వలయం ఉంటుంది. దానినే ఓర్ట్ క్లౌడ్ (oort cloud )అంటారు. ఇది దాదాపు రెండు కాంతి సంవత్సరాల దూరం విస్తరించి ఉంటుంది. ఇక్కడే అతి పెద్ద తోకచుక్కలు హీలీ లాంటివి పుడతాయి. దీని తర్వాత మనకు దగ్గరి నక్షత్రం ఆల్ఫా సెంటారీ ప్రారంభం అవుతుంది.
కాంతి వేగం గురించి మనకు తెలుసు. కాంతి గంటకు 670,616,629 మైళ్ళ వేగంతో ప్రయాణిస్తుంది. సంవత్సరంలో 5,880,000,000,000 మైళ్ళు ప్రయాణిస్తుంది . విమానం గంటకు 920 km వరకు ప్రయాణిoచగలదు. అంతరిక్షంలో ప్రయాణం చేసే స్పేస్ షటిల్ గంటకు 17,500 మైళ్ళ వేగంతో ప్రయాణించగలదు. మన ఇండియా వాళ్ళు మొన్నామధ్యన అంగారకుడు మీదకు పంపించిన MOM (Mars orbiter mission ) 4356 kph వేగంతో ప్రయాణించి0ది. సరే ఇప్పుడు వీటితో కాంతి వేగం పోల్చి చూడండి - అస్సలు పోలిక లేదు కదూ . మనకు సూర్యుని నుండి కాంతి భూమికి చేరడానికి 8 నిముషాల 20 సెకండ్లు పడుతుంది . అదే చంద్రుని నుండి కాంతి భూమి చేరడానికి ఒక్క సెకండ్ పడుతుంది . అంటే మనం చూస్తున్న సూర్యుడు 8 నిముషాల 20 సెకండ్స్ క్రిందటి వాడు , చంద్రుడు ఒక్క సెకండ్ క్రిందటి వాడు. హటాత్తుగా సూర్యుడు మాయం అయిపోయాడు అనుకోండి ఆ విషయం మనకు 8 నిముషాల 20 సెకండ్స్ తర్వాత తెలుస్తుంది. ఇలా మనం ఎన్నైనా ఊహించుకోవచ్చు. అసలు ఇది ఎందుకు చెప్పుకొంటున్నాము అంటే , మనం చూసే నక్షత్రాలు అసలు అక్కడే ఉంటాయనే వీలు లేదు , అవి అసలు లేక పోవొచ్చు కూడా , ఎందుకంటే వాటి కాంతి మనకు చేరడానికి కొన్ని వందల సంవత్సరాలు పట్టినా ఆశ్చర్యం లేదు. మనం చూసే కొన్ని నక్షత్రాల కాంతి దాదాపు 10,000 వేల సంవత్సరాల కాలం క్రిందటిది కూడా అయి ఉండవచ్చ్చు. ఇంకా విశేషం ఏమిటంటే మనం ఆకాశంలో చూసే నక్షత్రాలు వేరే గాలక్సీ(galaxy )కి చెందినవి కూడా అయిఉంటాయి. ఇక oort cloud తర్వాత సూర్యుని ప్రభావం ఉండదు. అంతా శూన్య ప్రదేశం , మళ్ళి మరొక నక్షత్రం దగ్గరకు మనం చేరుకోన్నప్పుడు ( చేరుకోగలిగితే ..) , ఆ నక్షత్రం యొక్క ఆకర్షణ శక్తి తాలూకు ప్రభావం మన మీద పడుతుంది. ఆ నక్షత్రానికి కూడా కొన్ని గ్రహాలూ , వాటికి మళ్ళి ఉపగ్రహాలు ఉండొచ్చు, తర్వాత మరో నక్షత్రం ... ఇలా ఒక్క మన మిల్కీ వే లోనే 100 బిలియన్ నక్షత్రాలు ఉన్నాయి. ఈ మిల్కీ వే 100,000 light years విస్తీర్ణంలో వ్యాపించి ఉంది. మన భూమికి మిల్కీ వే కి దూరం 25,000 లైట్ ఇయర్స్ ఉంటుంది.
మనం కాంతి వేగంతో ప్రయాణించే వాహనం కని పెడితే , మన మిల్కీ వే మధ్యలోకి చేరడానికి 25 వేల సంవత్సరాలు పడుతుంది. లేదా మన సూర్యుని కాంతి మిల్కీ వే మధ్యలోకి చేరడానికి కూడా అంతే సమయం పడుతుంది. ఈ ప్రయాణం మన వల్ల అవుతుందా ? అంతెందుకు మనకు అతి దగ్గరలో ఉన్న నక్షత్రం ఆల్ఫా సెంటారీ మనకు 4 కాంతి సంవత్సరాల దూరంలో ఉంది. NASA వాళ్ళు వోయెజర్ అనే ఒక వ్యోమ నౌక ని మన సౌరకుటుంబంలోకి 1977 లో పంపించారు, దాని వేగం 38,610 mph. అది అన్ని గ్రహాలూ దాటుకుని 38 సంవత్సరాల తర్వాత 19,000,000,000 km ప్రయాణించింది. ఇంకా ప్రయాణిస్తూనే ఉంది. ఇక ఒక కాంతి సంవత్సర దూరం అది ప్రయాణించాలి అంటే దాని వేగంతో దానికి దాదాపు 15 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ లెక్కన మనకు అతి దగ్గర నక్షత్రం చేరడానికి దానికి 60 కోట్ల సంవత్సరాలు పడుతుంది. ఈ విశ్వం అనంత మైనది. మనకు పక్కనున్న గాలక్సీ పేరు ఆన్డ్రోమెడ గాలక్సీ . అది మన భూమికి 2. 5 మిలియన్ లైట్ ఇయర్స్ దూరంలో ఉంది . ఒక లైట్ ఇయర్ దూరానికే కోట్ల సంవత్సరాలు పడితే 2. 5 మిలియన్ లైట్ ఇయర్స్ అంటే ఎన్ని సంవత్సరాలు ..? ఇలాంటి గాలక్సీలు కలిపి యూనివర్స్ అంటారు. ఒక యూనివర్స్ లో సుమారు 100 బిలియన్ గాలక్సీ లు ఉంటాయి . ఇలాంటి యూనివర్స్ లు కొన్ని బిలియన్ లు కలిసి మల్టీవెర్సు ఏర్పడు తుంది. దీని ద్వారా మన విశ్వం ఎంత పెద్దదో ఊహకు కూడా అందదు . కాబట్టి నా ఆలోచనలు మనం ఉన్న గాలక్సీ అదే మిల్కీ వే దగ్గరే ఆపివేస్తున్నాను.
ఈ విషయాలు చదువు తున్నప్పుడు , ఈ భూమి ఈ అనంత విశ్వం లో ఎంత చిన్నదో అని. నేను కనీసం మన పాలపుంత ని చూస్తే ఏదో కొంత సాధించినట్లు అనిపిస్తుంది, కాని పాలపుంతని చూడాలంటే ఎలా ? అసలు మన భూమి కూడా పాలపుంత లో ఒక భాగం అయినప్పుడు నాకు పాల పుంత ఎలా కనిపిస్తుంది? ఎన్నో ప్రశ్నలు. కొంచెం రీసెర్చ్ చేస్తే తెలిసింది , ఈ భూమి మీద ఉంటూ పాల పుంత చూడొచ్చు అని . ఆ ఊహే నాకు అద్భుతం అనిపించిది. పాల పుంత చూడాలంటే మన హైదరాబాదు , విశాఖపట్నం నుండి కనిపించదు , ఎందుకంటే అలాంటి పెద్ద పట్టణాలలో లైట్ పొల్యూషన్ ఉంటుంది. అమెరికాలో అయితే న్యూ యార్కు , వాషింగ్టన్ dc లాంటి పెద్ద నగరాలలో కనిపించదు , అసలు అంత ఎందుకు మీరు ఏ సిటీ లో ఉన్నా కూడా కనిపించదు. సిటీ లైట్ లేకుండా , ఊరికి చాల దూరంగా ఉన్న ప్రదేశం లో, చంద్రుడు లేని ఆకాశం లో , చిట్ట చీకటి రాత్రి లో ఎటువంటి లైట్ లేని వేళ ఆకాశం లోకి చూస్తే మీకు తప్పకుండా పాలపుంత కనిపిస్తుంది. మరి అలాంటి ప్రదేశం అమెరికాలో ఎక్కడ ? ఉంటే నేను వెళ్ళగలనా ?
-- మిగతా విషయాలు కోసం చూస్తూ ఉండండి .

No comments:
Post a Comment