Friday, July 22, 2011

బాబా నీ మందిరంలో సోదాలను ఎప్పుడు ఆపిస్తావు?

బాబా - క్తులకు రోసా నిచ్చే రెండు అక్షరాలు.  బహుశ అమ్మ తర్వాత అంత శక్తి ఉన్న మాట. మరేమిటి ఇప్పుడా పేరు వింటే నాకు యజుర్వేద మందిరం, అపార ధనరాసులు, అక్రమ సంపాదన, బెంగలూరుకి తరలి వెళుతున్న డబ్బు గుర్తొస్తోంది ఏమిటి? నేను కూడా పుట్ట పర్తి వెళ్ళిన వాడినే, బాబా దర్శనం కోసం పడిగాపులు కాసిన వాడినే, బాబాకి సమర్పించిన కానుకలు, సాక్షాత్తు ఈశ్వరార్పణం అని భావించిన వాడినే, మరి ఈనాడు నా మనసు ఎందుకు పరివిధాల ఆలోచిస్తోంది?  నా మనస్సు నిలా కలుషితం చేస్తే హక్కు మీకేవరిచ్చారు?
సర్వసంగ పరిత్యాగిని సాధువు, మరో మాటలో చెప్పాలంటే బాబా అని అనడం పరిపాటి. వాళ్ళ మార్గం ఆధ్యాత్మికం, పయనం శివ కైలాసం. భౌతిక సుఖాల మీద ఆశ లేక, పంచ భౌతిక సుఖాలు అసాస్వతం అని నమ్మి, మనసును పరమేశ్వరుని మీద పెట్టి, తను వెళ్ళే మార్గంలో ఉన్న కష్టనష్టాలు, ఎత్తు పల్లాలు,  సంసార సాగరాన్ని ఈదుతున్న మన  సామాన్య ప్రజానీకానికి, అర్ధమయ్యే రీతిలో చెప్పేవాళ్ళు నిజానికి బాబాలుగా  మన సంస్కృతిలో నిలిచారు. వాళ్ళ చూపు, మనకు మోక్షమార్గపు రెండు మెట్లు ఎక్కిస్తుంది అనే నమ్మకం, వాళ్ళు నిరంతరం మన వెన్నంటే ఉండి, సర్వ ఆపదలనుండి రక్షిస్తారు అనే బలమైన నమ్మకం వాళ్ళకు శిరస్సు వంచి నమస్కరించేల చేస్తుంది. ఇది జన్మ జన్మల అదృష్టంగా భావించేలా చేస్తుంది.
ఈ నాడు మరి ఏమైంది?  సాయి బాబా మందిరంలో సోదాలు ఏమిటి? నడిచే దేవునిగా పిలవబడ్డ బాబా, బ్రతికున్న రోజులలో ప్రధాన మంత్రులు, క్రికెట్ ఆటగాళ్ళు, సినిమావాళ్ళు, విదేశీయులు, ఒక్కరేమిటి, ప్రతి ఒక్కరు ఆయన పాదాల మీద పడ్డ వాళ్ళే. అసలు యజుర్వేదమందిరం అనేది ఒకటి ఉంది, దానిలో ధనం ఉంటుంది అనే ఆలోచన కూడా రాని వాళ్ళే.  సోదాలు ఎప్పుడు చేస్తారు? అన్యాయం జరిగినప్పుడు, దొంగ సొత్తు కనుగోవడానికి చేస్తారు. మరి సాక్ష్యాత్తు బాబా నివాసంలో సోదాలు ఏమిటి? ఆయన వీభూది కల్లకద్దుకొని అదే పది కోట్లు గా మురిసిపోయిన వాళ్ళు ఈ రోజు ఆయన చనిపోయిన తర్వాత చేస్తున్న ఈ  సోదాలు ఏమిటి?
బాబా ఈ అన్యాయం మేము చూడలేము. నిన్ను సాక్ష్యాత్తు దైవ స్వరూపం గా భావించాము, ప్రపంచంలో ఎక్కడా దేవుని గుడిలో అక్రమ ధనం కోసం సోదాలు నిర్వహించబడలేదు. అయినా మీ ఆంతరంగిక మందిరంలో అన్ని కోట్ల రూపాయలు ఎందుకున్నాయి?  అన్ని KG ల బంగారం ఎందుకుంది? మాకూ తెలుసు బాబా,  మీరు ఎన్నడు ప్రజలకు పంచే వాళ్ళే కాని, ఎవరి దగ్గర నోరు తెరిచి అడగలేదు. మీకు సర్వజన క్షేమం తప్ప, మరే విషయం మీద మోజు లేదు.  ఇప్పుడు జరుకుతున్న వన్ని, మీకు తెలియకుండా మీరు చని పోయిన తర్వాత వచ్చి చేరాయి. చిన్నతనం నుండి సర్వసంగ పరిత్యాగి అయిన మీకు డబ్బు బంగారం మీద మోజు ఉండదని, అసలు  మరే విషయం మీద వ్యామోహం ఉండదని మాకూ తెలుసు, మా భాదల్లా ఒక్కటే, మీ చుట్టూ ఇలాంటి విషపురుగులు చేరుతుంటే మీరు ఏమిటి చేస్తున్నారు? అవును బాబా ఇది తప్పు ఒప్పులు బేరీజు వేసే  తరుణం కాదు, కానీ  మీ మందిరం లో దొరికే ప్రతి ఒక్క రూపాయి  నాణెం , మా నమ్మకమనే పాలలో ఒక్కో  విషపు బిందువు కలుపుతోంది. దయ చేసి దీనిని  ఇక్కడితో ఆపించు బాబా.

3 comments:

  1. చాలా బాగా రాశారు.మీ ఆక్రోశాన్ని, ఆవేదనను నేను కూడా పడుతున్నాను.నా మనసులోని మాటలను మీరు రాశారు.

    ReplyDelete
  2. సన్యాస దీక్షలో ఉన్నవారికి కొన్ని కఠిన నియమాలున్నాయి. కామినీ కాంచనాలను దరికిచేరనియ్యరాదని. అవి దగ్గర చేరితే చాలు మాహాత్ములైనా మహిమాన్వితులైనా కలి ప్రవేశాన్ని అడ్డుకోలేరు. భూమ్మీద తామొచ్చిన పని తాముచేసుకుని వెల్లిపోతారు మహాత్ములు /ఆవెలుగువెంట చీకటిలోనే దాగుంటాయి చీడపురుగులు అవొచ్చినపని చేసుకోవటానికి. ముందు ఇప్పుడు భగవంతుడు వేరు భగవక్రుపవైపు మనలను మల్లించటానికొచ్చిన మహాత్ములు వేరన్న విషయాన్ని మనం మరవటం ద్వారా ఈ కలిమాయలకు శక్తిద్విగుణీక్రుతమవుతున్నది.
    గురుసిధ్ధారూఢుల నుండి రమణమహర్షులు ,సాయివంటి సాధువులదగ్గర ఇలాంటి చీడపురుగుల చేరిక కేవలం సన్యాసధర్మపాలనలో వారు కఠినత్వం వహించకపోవటంవలనేనేమో ?

    ReplyDelete
  3. శ్రీనివాసు గారు మీకు ధన్యవాదాలు.
    దుర్గేశ్వర్ గారు, చాల బాగా చెప్పారు. అయినా బెల్లం దగ్గర చేరండని చీమలకు పిలుపెందుకు? అన్ని కోట్ల రూపాయల ప్రజల డబ్బు, బంగారం ఆ స్వామి మందిరంలో లభించడం, అందునా, ప్రభుత్వానికి తెలియబరచకుండ లభించడం, మన దురదృష్టం. బాబా గారు కూడా ఎన్ని విషయాలు చూసుకోగలరు? నిజంగా అన్ని కానుకలకు లెక్క, పత్రాలు ఉండి వుంటే, అదే ట్రస్ట్ సభ్యులు బాబాకి ఇచ్చే ఘనమైన నివాళి. అలా చేయలేదు కనుకే, మనందరికీ బాబా శివైక్యం చెందిన భాధ, ఈ ట్రస్ట్ సభ్యుల వల్ల మరో బాధ వెరసి, ఒక అంతు లేని వ్యధ.

    ReplyDelete