Tuesday, March 12, 2013

యండమూరి గారికి మనసు విరిగిన అభిమాని ఆవేదన


నవలా ప్రపంచంలో తిరుగులేని యండమూరి , నిజజీవితం లో ఇంత చీప్ గ ఆలోచించడం తట్టుకోలేక పోతున్నాను. ఆయనంటే ఒక రచయితగా ఎంతో ఇష్టపడ్డాను , కానీ ఆయన  మాటల్లో కలంలో ఉన్న గొప్పతనం ఏది కనిపించలేదు కాని ఒక ఊహకు అందని , మనసు తట్టుకోలేని మనిషిని చూడవలసి వచ్చింది .  దానికి గల కారణం జ్యోతి అనే అమ్మాయి ఆత్మహత్య మీద ఆయన అభిప్రాయమే . ఈ క్రింది ఇంటర్వ్యూ చూసి నేను ఇలా స్పందిస్తున్నాను . 33:55 సెకండ్స్ నుండి చూస్తే అలా అనిపించింది

యండమూరి మాట :  ఈ ఇంటర్వ్యూ జాగ్రతగా చూస్తే జ్యోతి అనే అమ్మాయికి ఈయన ఆరు నెలలుగా ఉత్తరాలు రాసేవారని చెప్పారు. అందులో నీ కళ్ళు నాకు చాల ఇష్టం , నువ్వంటే చాల ఇష్టం అని రాసినట్లు చెప్పరు.
విమర్శ: అప్పటికే పెళ్లై న వాడు , ఒక అమ్మాయికి అలా  నువ్వంటే ఇష్టం , నీ కళ్ళు ఇష్టం అని రాయండం ఏమిటి? నార్మల్ గా రచయితలు మీ అభిమానానికి ధన్యవాదాలు అని సరిపెడతారు -ఎవరైనా
యండమూరి మాట :  విజయవాడలో ఈయన lodge లో ఉంటె  జ్యోతి అనే అమ్మాయి ఉదయం 7 గంటలకు  lodge కి వచ్చింది అన్నారు
విమర్శ: అసలు విజయవాడ వెళుతున్నట్లు , lodge  లో ఉన్నట్లు జ్యోతికి ఎలా తెలుస్తుంది . ఈయనేమి రాజకీయ నాయకుడు కాదు  మీడియా ద్వారా తెలియడానికి.  ఈయనే జ్యోతిని  పిలిపిస్తే తప్ప ఆ అమ్మాయికి తెలియదు.  సరే ఒక పెళ్లి కాని అమ్మాయిని లాడ్జ్ కి పిలవడం ఏమిటి? ఇదేనా సంస్కారం ?
"అసలు ఈయన జ్యోతి ఫోటో చూసి మతి పోయి , ఛాన్స్ దొరుకుతుంది అని విజయవాడ వెళ్ళిన విషయం మనకు క్లియర్ గా తెలుస్తోంది . ఆయనే చివర్లో ఆమాట అన్నరు. అవకాసం దొరికితే RK  గారు మీరు వదులు కొంటార
అని కూడా అడిగారు . "
యండమూరి మాట : జ్యోతి ఫోటోలో లా లేదు అని నాకు విపరీతమైన కోపం వచ్చింది , బాగా తిట్టేసాను . 
విమర్శ:  అసలు రచయిత అందంగా ఉండాలని ఏ  పాఠకుడు/పాఠకురాలు  కొరుకోరు. అలాగే అభిమానులు అందం గురించి రచయితా ఆలోచించరు . అలాంటిది జ్యోతి తను ఫోటో చూసినట్లు లేదని  ఈయనకు కోపం రావడం ఏమిటి?
అసలు ఇదేమైన పెళ్లి చూపుల వ్యవహారమ ? ఇంకా పచ్చిగా చెప్పాలంటే సాని తనమా? Lodge  కి రమ్మనడం , నీ కళ్ళు ఫోటోలోలా  లేవు,  అందంగా  లేవు అని బాగా తిట్టడం ..నమ్మ శక్యం గా లేవు.
యండమూరి మాట : నేను  జ్యోతిని ముట్టు కొన్నాన? ఏదైనా తప్పు చేసాన?
విమర్శ: ఎంత దిగజారుడు తనం ? ఏ కాలంలో ఉన్నారు బాబు మీరు ? ముట్టు కొంటే తప్పు , ముట్టుకోకుండా మనసును ముక్కలు చేస్తే ఒప్పా ? అసలు పరాయి ఆడదాని అనమతి లేకుండా ముట్టుకొంటే అది బలాత్కారం , దానికి శిక్ష ఉంటుంది. అదే తనే ఇష్టపడి వచ్చినా ముట్టుకోకుంటే అది సంస్కారం అవుతుంది. మరి మీరు ఈ ఉదేశ్యం  లో ముట్టుకోనే వరకు ఆలోచించారు . అంటే మీరు  ముట్టుకొన్న ఆ అమ్మాయి ఏమి చేయలేదనే ధీమా తో అలా మాట్లాడార ?
యండమూరి మాట : నా ఫ్రెండ్ మరో తోటి రచయిత ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళారు. 
 విమర్శ:  దీనిని బట్టి మీరు మీ ఫ్రెండ్ విజయవాడ వెళ్ళిన పని ఏమిటో తెలుస్తోంది , మీరు ఆ అమ్మాయిని కేవలం ఒక పాఠకురాలిలా చూస్తే , మీరే తనని నలుగురు ఉండే చోటుకు రమ్మనే వారు, ఆవిడ అభిమానానికి కృతజ్ఞతలు తెలిపెవారు. ఇలా రహస్యంగా లాడ్జ్ కి రమ్మనే వారు కాదు.
యండమూరి మాట : శవాన్ని మళ్ళి తవ్వి తీసారు , కన్య అని తేలింది.
విమర్శ: ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకొంటే ఆ కుటుంబం ఎంత కుమిలి పోతుందో మీకు తెలియదా? అలాంటిది , చని పోయిన అమ్మాయిని మళ్ళి తవ్వి తీసి కన్యత్వ పరీక్ష చేసారు అంటే అంత కంటే ఆకుటుంబానికి అవమానం ఉంటుందా? చనిపోయినా ఆ పరీక్షలో నెగ్గిన ఆ అమ్మాయిని సీత దేవి అంత గొప్పది కాదా ? మీరు తన చావు పైన ఏ  మాత్రం జాలి లేకుండా , మీరు తన కన్యత్వం దోచుకోలేదు కనుక నా తప్పు లేదు అని సమర్ధించు కొంటున్నారా ? రావణుడు కూడా తన వాకిలిలో ఉన్న సీతను ఎన్నడు ముట్టుకోనే సాహసం చేయలేదు.
మరి మీరు , ఫోటో పంపించి , కళ్ళు బాగుండే సరికి , ఇల్లు పెళ్ళాం వదిలి విజయవాడ పరిగెత్తుకు వెళ్లి ,  లాడ్జ్ కి రమ్మని , అమ్మాయి ఫోటో లో లా  లేక పోయేసరికి తనని మానసికంగా హింసించి , ఆత్మ హత్యకు ప్రేరేపించడం రావణుని తప్పుకన్న పెద్ద తప్పు అనిపించడం లేదా?


చివరగా ఒక్క మాట మీ నవలా  భాషలో చెబుతాను -  ఆడవారి  విషయంలో అవకాశం కోసం ఎదురు చూసేవాడు సన్నాసి , అవకాశమున్న వదులుకొనెవాడు  ఋషి, అసలు ఈ ఆలోచనలే  రానివాడు మహర్షి .

9 comments:

  1. తప్పుగా అనుకోవద్దు. రచనల్ని అభిమానించండి కాని రచయితల్ని కాదు. రచనల్ని చదివి రచయితల్ని అభిమానిస్తే పరిస్థితి ఇలాగే వుంటుంది. అత్యుత్తమమైన రచనల్ని రాసిన వ్యక్తులు వ్యక్తిగత జీవితంలో మంచి వ్యక్తులు కాకపోవచ్చు.

    ReplyDelete
    Replies
    1. డియర్ vkbabu మీరు చెప్పింది అక్షరాలా నిజమే, కాని రచనలు చూసి రచయిత కూడా అంత గొప్పవాడుగా ఉంటాదనుకోవడం తప్పంటారా?
      ఆ మాటకొస్తే ఈయన ఫిక్షన్ మాత్రమె కాకుండా వ్యక్తిత్వ వికాసం అంటూ చాల రచనలు చేసారు గా? మరి నిజజీవితం లో వ్యక్తిత్వం లేనివారు వ్యక్తిత్వ వికాసం పుస్తకాలు వ్రాయ అర్హులా? చెప్పండి

      Delete
    2. మీ కోణంలోనుండి ఆలోచిస్తే మీ ఆవేదన నాకు అర్ధం అయింది. నిజజీవితంలో వ్యక్తిత్వం లేని వారు వ్యక్తిత్వ వికాసపుస్తకాలు వ్రాయటానికి అర్హులా అంటే, నైతిక కోణంలో చూస్తే అర్హులు కాదు.

      కాని మనం చరిత్రలో మహోన్నతులు అనుకున్న వ్యక్తులు కూడా ఎన్నో బలహీనతలతో వ్యవహరించిన సంగతులు మనందరికి తెలుసు.అంతమాత్రాన చరిత్రలో వారు సాధించిన ఘనకార్యాలు విలువలేకుండా పోతాయా? అందుకే వ్యక్తుల పర్సనల్ జీవితానికి వారు సాధించిన విజయాలకు ముడిపెట్టుకోవద్దు.

      Delete
  2. రచనల్ని అభిమానించండి కాని రచయితల్ని కాదు.I too want to say rhis.

    ReplyDelete
  3. క్షమించాలి. శ్రీ వి.కె.బాబుగారి అభిప్రాయంతో యేకీభవించ లేకపోతున్నాను.
    వ్యక్తిగతంగా సఛ్ఛీలురు కాని వారు ప్రపంచానికి హితవాక్యాలు చెబుతూ ఆషాఢభూతుల్లాగా చెలామణీ కావటం హర్షణీయం కాదు. నయవంచకుల విజయాల వెనుక వారి వాక్చాతుర్యమో, రచనాచాతుర్యమో మరొక కళానైపుణ్యమో ఉన్నంతమాత్రాన వాటికి హారతిపట్టి వాటి వెనుకనున్న కుశీలురను మన్నించటం హేతుబధ్ధం కాదు.

    ప్రద్మప్రియగారి అభిప్రాయం రచయితల వ్యక్తిత్వాలను పటీంచుకోవద్దనా? అర్థం కాలేదు.

    గంగాధరులవారే కాదు, సమాజంలోని అందరూ మనిషి మాటలకూ చేతలకూ పొంతన ఉండాలని భావిస్తారు. అలా లేకపోవటాన్ని హర్షించలేరు కూడా.

    ReplyDelete
  4. ప్రద్మప్రియగారి అభిప్రాయం రచయితల వ్యక్తిత్వాలను పటీంచుకోవద్దనా? అర్థం కాలేదు

    ఆవిడ ఉద్దేశం .. యండమూరి ఎలాంటోడైనా 'వెన్నెల్లో ఆడపిల్ల' వెన్నెల్లో ఆడపిల్లే కదా అని అయ్యుండొచ్చు. ఫిక్షన్ వరకూ యండమూరి వ్యక్తిత్వానికీ ఆయన రచనలకీ ముడిపెట్టనవసరం లేదు. ఇక వ్యక్తిత్వవికాస రచనల సంగతంటారా ..... అసలా కాన్సెప్టే చెత్త. అవి చదివి జీవితాన్ని మెరుగుపర్చుకోవటమంటే అంబడిపూడి 'ముప్పై రోజుల్లో ముష్టియుద్ధం' చదివేసి కరాటే, కుంగ్‌పూ ఔపోసన పట్టేసినట్లన్నమాట. అటువంటివి ఎవర్రాసినా ఒకటే కాబట్టి వాటిని రాసినోళ్లు ఎంత గొప్పోళ్లన్న ప్రశ్నే రాకూడదు.

    ReplyDelete
  5. I too watched it n was shocked to hear all this. When a man n a woman involve into a relationship it's not wrong unless one of them starts thinking that they were neglected n may be his negligence made her do all this. He might not have discussed abo her virginity here. Anyway, it's really painful for us.

    ReplyDelete
  6. మీ అందరు మీ అభిప్రాయాలూ పంచు కున్నందుకు ధన్యవాదలు. అసలు ఆడదానికి మగ వాడికి ఇష్టమైతే తప్పేముంది అంటారా? తప్పు కాదా ?
    ఉదాహరణకు ఒకడికి పెళ్లి అయింది , అతనికి భార్య కాకుండా వేరే అమ్మాయికి, ఇతనికి ఇద్దరికి ఇష్టమే మరి వాలిద్దరు కలిసి ఉండొచ్చా?
    ఇదేవిధంగా ఒక పెళ్ళన స్త్రీ చేయగలదా ? మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఏదేశం లో నయినా ఇది నేరమే . ఇద్దరికీ పెళ్లి కాకపోతే వాళ్ళు కలిసుంటే
    అది డేటింగ్ (సహజీవనం) అంటారు , అది అమెరికాలో వందశాతం , ఇండియా లో కూడా కొంతవరకు అంగీకారమే. ఇండియాలో అలా కలిసుండి
    పెళ్లి చేసుకోకపోతే దానిని నేరంగా పరిగణించిన కేసులు చాల ఉన్నయి. అమెరికా లోఅలా పెళ్లి విషయంలో పట్టింపులు లెవు.

    యండమూరి గారి విషయంలో ఆయన కావాలని జ్యోతి అభిమానాన్ని దారి మళ్ళించారు . ఇంటర్వ్యూ చివరలో ఎంత చెత్తగా మాట్లాడారో చూసారా ?
    ఒక ఆడది ఫోన్ చేసి పిలిస్తే వెళ్లక పోతే అది మగవాడి తప్పు అన్నట్లు మాట్లాడారు. అంతే కాకుండా, కెమెరా మెన్లు , అక్కడున్నవారిని మీరు.. మీరు.. వెళ్ళరా ..అని అడిగి ?
    అని తన ఆర్గుమెంట్ కి సపోర్ట్ వెతుక్కొన్నారు. అసలు అందరు మగవాళ్ళు అలా పరాయి ఆడదాని పిలుపు కోసం కాచుకు కూర్చోంటారు , ఇంట్లో పెళ్ళానికి ద్రోహం
    చేస్తారు అని ఆయన ఎందుకు అనుకొంటున్నాడు ? చాల సిగ్గు చేటు వ్యవహారం . ఇంకా ఇదే ఇంటర్వ్యూ లో అతనన్నాడు , ఈ వయసులో కూడా అమ్మాయి ఫోన్ చేస్తే
    వెళతానేమో అని నీచంగా మాట్లాడాడు . అసలు ఈయనకు మాట్లాడడం రాదు కేవలం నవలలు రాయడం వచ్చు. ఈయన స్కూల్ లో ఎందఱో ఆడపిల్లలు చదువుతున్నారు
    వాళ్ళ మనస్సులో ఈయన ఎంత నీచంగా ముద్ర వేయిన్చుకొన్నా డో తలుచుకొంటే భాధ వేస్తోంది . ఈయనకు స్కూల్ నడిపే అర్హత లేదు.

    ఇంటర్వ్యూ లో అన్నారు "శవాన్ని మళ్ళి పరీక్ష చేస్తే నా మొహం ఏముంది కన్య అని తేలింది " ఎంత నీచంగా మాట్లాడాడు ఈయన . చాల అసహ్యం వేసింది .
    ఈయన ఈ ఇంటర్వ్యూ ఇవ్వకుండా ఉండాల్సింది , ఈ యన మీద నాకున్న అందమైన ముసుగు, అల అందంగా ఉన్దిపొయెది. ఈయన వెన్నెల్లో ఆడపిల్ల నవలలో
    చివరలో రేవంత్ చెప్పినట్లు , "రమ్యని అందమైన ఊహాగానే ఉండిపోని" లాగ. ఈయనకు మాట్లాడడం రాకుండా, ఎంతో తెలివైన RK , ఎన్నో ఇంటర్వ్యూ ల అనుభవం ఉన్న ఆయన
    ద్వార , జీవితాంతం మర్చిపోలేని తన నీచ ప్రవుత్తి ని "ఇంటర్నెట్ " ఉన్నంత కాలం ఈయన సరిదిద్దుకోలేని విధంగా తనంతట తానే బయట పెట్టుకొన్నారు .

    ReplyDelete
  7. ఎదుటి వ్యక్తి కి ఎటువంటి బలహీనతలూ ఉండకూడదు అనుకోవడమే ఒక బలహీనత. ఆయన " నాకు ఏ పాపం తెలియదు , నేను అమాయకుడిని" అంటే వదిలేస్తారా?? ఆ అమ్మాయిని ఆయన ఏదో చేసాడని గోల పెట్టి ప్రచారం చేసింది ఎవరు? తీరా నేనేమీ చెయ్యలేదని prove అయ్యింది కదా అని చెప్పుకొంటే అది కూడా తప్పే. రామాయణం రాసిన వాడు రాముడంత గొప్పవాడు అయిఉండాలా?? ఇక్కడ total episode ని support చెయ్యడం లేదు.కానీ ఆ అమ్మాయి పిలిచిందని, ఈయన పరిగెట్టుకొని వెళ్ళారని, ..ఏదో live లో చూసినట్టు comments?? మన మీద ఒకరు తీవ్రమైన ఆరోపణ చేస్తే అందులోనుండి బయటపడేటప్పుడు తెలుస్తుంది ఆ బాధ.

    ReplyDelete