అన్నా, మనం అంటే అందరకు చిన్న చూపే, ముష్టి వాడిగా పుట్టడం అంత పాపం మరోటి లేదు, పొరపాటున ఈ వృతి లోకి పచ్చాను, ఇక నేనెంతమాత్రం ఈపని చేయలేను అని భాదపడుతున్న ఓ జూనియర్ ముష్టి వాడిని ఓదారుస్తూ సీనియర్ ఇలా అంటున్నాడు.
నిజమే ముష్టివాళ్ళు అంటే అందరకు చిన్నచూపు, నాకు తెలుసు మనగురించి ఈ గోప్పోల్లంతా ఇలా అనుకొంటారు. "ముష్టివాళ్ళు బాబు, అయ్యా అని అదేపనిగా దీనమైన స్వరం తో, నరకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు ప్రాధేయ పడతారు. మనం వెళ్ళవయ్య , చిల్లరలేదు పో అంటే వెళ్ళ కుండ , మళ్ళిమళ్ళి ప్రాధేయ పడతారు. ఎక్కడో జేబులో ఏదో మూలనుండి ఒక రూపాయ్ నాణెం తీయక పోతార అనే ఆసతో, గొంతులో దీనత్వ౦ తగ్గగుండా, సిగ్గు మోఖమాటం లేకుండా అదే పనిగా వెంట పడతారు. డబ్బులేస్తే దణ్ణం పేడతారు, లేక పొతే ఇంకో దాత కోసం ఎదురు చూపులు. వీళ్ళకు ఒక సారి చెపితే అర్ధం కాదా? అసలు ఇలాంటివాళ్ళు ఎందుకు పుడతారు?"
"కానీ మనలను ఇంత తిడుతున్నా వీళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో మనలాగా అడుకోన్నేవాళ్ళే" అనగానే జూనియర్ నమ్మలేదు. "లేదు అన్నా మనం అడుక్కున్నమంటే కడుపుకాలే పిల్లలకు ఇంత ముద్ద పెట్టాలని, మరి గోప్ప్పోల్లు ఎందుకడుక్కుoటారు? నేన్నమ్మను" అన్నాడు. "సరే నువ్వే చూద్దూగాని" అని సీనియర్, జూనియర్ ని రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్ళాడు.
అది రైల్వే స్టేషన్ , విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే రైల్ కొద్ది సేపటిలో బయలుదేరబోతోంది, హడావిడిగా వచ్చిన రిజర్వేషను కన్ఫర్మ్ కాని ఒక సూటు బూటు హీరో గారు టీసి దగ్గరకెళ్ళి "బాబ్బాబు ఏదో ఒక బెర్త్ రిజర్వు చెయ్యండి" అంటున్నాడు. టీసి మర్యాదగా "బెర్తులు లేవండి, వెయిటింగ్ లిస్టు చాల ఉంది ఇప్పుడు కుదరదు" అనే చెప్పాడు, కానీ మన హీరో గారు పట్టు వదలని అక్రమర్కుడులాగా మళ్ళి మళ్ళి టీసి ని విసిగించడం మొదలు పెట్టాడు, టీసి కి సహనం నశించి "ఎన్ని సార్లు చెప్పాలండి బెర్తులు లేవని , నన్ను ఇక ఇబ్బంది పెట్టకండి" అని కసురుకొన్నాడు. కానీ మన హీరో గారు అదేమీ పట్టించుకోక, టీసి వెంటే తిరిగి తిరిగి , ఎన్నో సార్లు తిట్లు తిని , మర్యదంతా పోగొట్టుకొని .. చివరకు ..ఇక బెర్త్ దొరికే ఎంత లేక పొతే ఎంత ? ఆ వేడికోలు, ప్రార్ధనలు చూసి నేనైతే కేవలం నిద్ర కోసం ఇంత దిగాజారను అని జూనియర్ కళ్ళల్లో విస్మయం తో కూడిన ఆశ్చర్యo
ఒక్క రైల్వే స్టేషన్ కాదు, బస్సు స్టేషన్, RTO ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, రేషన్ డిపో, మునిసిపల్ ఆఫీసు , ఇలా ఎన్నో తిప్పి చూపించాడు సీనియరు . ఏక్కడ చూసిన అవే దీన మైన వేడికోలు. వాళ్ళందరూ వాళ్ళ స్థాయికు తగ్గి దీనంగ తమ పనులు జరగడం కోసం ప్రాధేయ పడ్డ దృశ్యాలెన్నో! పైకి గంభీరంగా కనిపించే వాళ్ళందరూ, ఒక చిన్న లాభం కోసం, సౌకర్యం కోసం తమ స్థాయిని మర్చిపోవడం చూస్తె వింతగా అనిపించింది జూనియర్ కు . అతనన్నాడు , " అన్నా నాకు ఒక విషయం అర్ధం ఐంది, ఈ గొప్ప వాళ్ళందరూ తమ పని పూర్తి అవడం కోసం ఎవ్వరి కాళ్ళు పట్టుకొన్న తప్పులేదు, ఎలాంటి వాడిని "సర్" అని పిలిచినా తప్పులేదు, సిగ్గు, అభిమానం, వ్యక్తిత్వం ఇవేవి పని జరగడం కన్నా గోప్పవేమి కాదు, ఇవ్వన్ని పని పూర్తి అయ్యాక , వాటంతట అవే తిరిగి చేరతాయి అందుకే పనులు జరగాలంటే వీటినన్నిటిని కాస్త పక్కన పెట్టాలి" అన్నాడు. అది విని సీనియర్, "బాగా గ్రహించావురా, ఇంకో విషయం వింటే నవ్వుతావు, వాళ్ళు అలా బ్రతిమిలాడక పొతే వాళ్ళ పనులు కొంచెం ఆలస్యం అవుతాయ్ లేదా తాత్కాలికంగా కొంచెం కష్ట పడతారు, కానీ పని జరగకుండా పోదు, ఆ కాస్త ఆలస్యం భరించలేకే ఎంతకైనా దిగాజారుతున్నారు. ఈ గొప్ప మనుషులు తమకు అన్నే అనుకూలంగ ఉన్నప్పుడు, నీతికి, వ్యక్తిత్వానికి, మాటకి కట్టుబడినట్లు, ఎంత బిల్డప్ ఇస్తారు, వీళ్ళ వల్ల ఒక్క చిన్న మాట తేడాతో పెళ్ళిళ్ళు ఆగిపోవడం చూసాం, సొంత బంధువులు సంవస్సరాల తరబడి మాట్లాడడం మానేయడం చూసాం, ప్రాణ స్నేహితులు విడిపోవడం చూసాం, కొంచెం సౌకర్యం కోసం, కాస్త సుఖం కోసం అదే జనం మన ముష్టి వాళ్ళకన్నా, దారుణంగ ప్రాధేయ పడడం చూస్తున్నాం. కానీ ఈలోకo చాల విచిత్రమైంది రా! మనకు ఎప్పటికి అర్ధం అవదు, అందుకే అడుక్కునావని ఎప్పుడు బాధపడకు, మనకన్నా గొప్ప వాళ్ళు చాల మందే ఉన్నారు" అని జూనియర్ కి ఉపదేశం చేసాడు.
తమ ఊరి యంయేల్య కాళ్ళు పట్టుకొని, పాదాభివందనాలు చేసి తమ కొడుకులకి గవర్నమెంటు కాలేజి లో సీట్లు ఇప్పించుకోవాలని వెళుతున్న ఇద్దరు సగటు తండ్రులు ఈ సంభాషణ విని , అడుగు ముందుకు పడక, అక్కడే ఆగి , మమ్మలను క్షమించండి అని మనసులో వేడుకొని , ముస్టివాళ్ళను (ఇంకా ముష్టి వాళ్ళు అందామ?) ప్రేమతో పలకరించి, చేతనైన ధర్మం చేసి , భారంగ యంయేల్య ఇంటికేసి సాగిపోయారు.
Monday, May 17, 2010
Sunday, May 16, 2010
నన్ను పోషించే పేదవాడు
నాకు ఎందుకో ఇవ్వాళ్ళ తెగ కవిత్వం రాయాలనిపిస్తోంది నేస్తం !
ఆగకుండా, ఆపకుండా ఈ ప్రపంచం నడుం విరిగేలా
నిద్రపోతున్న సమాజాన్ని ఉలిక్కిపడి లేపెల, ఉతికి ఆరేసేలా ఏదో రాయాలనిపిస్తోంది
అలవాటుపడ్డ ప్రాణం కదా, రాయకపోతే చెయ్యి ఊరుకోదే
సరే ఆవేశం ఐతే ఉంది గాని, కవితా వస్తువేది?
ఎందుకు నేస్తం పైనున్న ఆ ఫోటోని చూసి అలా అర్ధం కానట్లు నవ్వుతావు?
అవును నేను రోజు పూజించే ఫొటోనే, ఆ ఫొటోనే మాకు కులదైవం!
ఆ ఫోటో అవసరంలో నాకు కవితా వస్తువు, నా ప్రాణ వాయువు
అవును నేను మరోసారి
ఆ అర్ధనగ్న బడుగు జీవికి కవిత్వభిషేకం చేస్తాను
నాకు తెలుసు నేస్తం, నే నేనాడు పిడికెడు అన్నం పెట్టక పోయినా
ఏ ఒక్కరి గుడిసేలో వెలిగే దీపానికి వత్తు కొనివ్వక పోయినా
నన్ను బ్రతికించేది మాత్రం ఆ పేదవాడే
నన్ను మాత్రమె కాదు, ఎంతమందిని మహాకవులను చేసాడని ?
ఎంతమందికి అవార్డులు ఇప్పించాడని, ఎన్ని కుటుంబాలను నిలబెట్టాడని?
ఆ లెక్క చేప్పనలవిది కాదు; చిరుగు చొక్కలతో, విస్తరాకుల్లాంటి బ్రతుకులతో,
తను తాగే గంజి నీటితో ఎంతమంది కవులకు కవితా దాహాన్ని తీర్చాడని!
పట్టెడు మెతుకులకు నోచుకోనివాడిని నేను ఎలుగెత్తి ఈ ప్రపంచం మొత్తానికి
వినిపించేలా అరవమంటే, మారు మాట్లాడకుండా ఎంత గట్టిగ అరిచాడని!
ఒక సమిధివై నువ్వు వెలగాలి అంటే ఇంటిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పి
తను దీపమై వెలిగాడని, తను బ్రతికున్న, పిల్లలనుకన్న, వాళ్ళు ఆకలితో ఏడుస్తున్న,
చివరకు తను చనిపోయిన ఏమాత్రం సంభంధంలేని నాలాంటి వాళ్ళ హృదయాలు కరిగించి,
మమ్మలను ఏడిపించి, తన బాధ మేము పడేలా చేసి , మా పెన్నుల్లో సిరాగ, మా బ్రతుకు చొక్కలమీద బొమ్మగా,
మా ఇంటిలో సన్మాన పత్రాలుగా మారిన కనిపించే దేవుడే పేదవాడు.
పేదవాడు తనని నమ్మే కవులకు ఏమాత్రం అన్యాయం చేయని మహనీయుడు
ఏ భందుత్వాలు చూడడు, నీ సన్మానం లో వాటా అడగడు, నీ జీవిత గమ్యానికి చొక్కలేని మెట్టావుతాడు
వాడి కన్నా గొప్ప కవితా వస్తువు ఏముంది నేస్తం? నన్ను ఈసారికి ఎప్పటిలాగే మన్నించు
మరో సారి పేదవాడి అవసరం నాకుంది
ఓ పేదవాడ నీకోసం నా కవితా విన్నపం, దయచేసి మీరు అంతా ఎన్ని తరాలైన ఇలాగే ఉండి
నాలాంటి సమాజసేయస్సు కోసం పాటుపడే కవులకు రాజపోషకులు కండి మీరు చస్తూ మమ్ములను బ్రతకనివ్వండి

Saturday, May 15, 2010
మన రాజకీయ అవగాహన రాహిత్యం
మనకు స్వాతంత్రం రాక ముందు ప్రతి భారతీయుడి లక్షం ఒక్కటే, బ్రిటిషు వాడిని దేశంనుండి వెళ్ళగొట్టడం. జై హింద్ అనే ఒక్క మాట అంటే చాలు ప్రతి ఒక్క భారతీయ హృదయం ఉప్పొంగి పోయేది. దేశ స్వాతంత్రం కన్నా మించి రాజకీయాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎవరకూ ఉండేది కాదు. సరే ఇప్పడు స్వతంత్రం వచ్చి యాభై సంవస్తరాలు పైగా అయ్యాయి ! ఇప్ప్పడున్న పరిస్థితి ఏమిటి ? అసలు మనకు రాజకీయాల గురించి నిజంగా ఏమిటి తెలుసు?
మనలో ప్రతిఒక్కరికి ప్రస్తుతం ఉన్న స్థితి కంటే ఇంకా బాగుండాలి, మన కాలనీ లో రోడ్లు చాల విశాలంగా ఉండాలి, ఒక చక్కటి స్కూల్ ఉండాలి, బస్సు సౌకర్యం ఉండాలి , ఆసుపత్రి ఉండాలి , మన ఊరు చాల అందంగా ఉండాలి , ట్రాఫ్ఫిక్ ఉండకూడదు, చక్కటి పరిశ్రమలు ఉండాలి , ఎన్నో ఉద్యోగాలు అందుబాటులో ఉండాలి, రేషన్ దొరకాలి , .... ఇలా అంతులేని కోరికల చిట్టా. ఇంత వరకు బాగానే ఉంది గాని ఇవన్నే సాధిచడం ఇలా , సరిగ్గా ఈ ప్రశ్న దగ్గరే ఒక రాజకీయ నాయకుడి జననం.
మనకు ఏమిటి తక్కువ , ఆ పక్క ఊరులో పైన చెప్పిన వన్ని ఉన్నాయి , మన తలరాత ఇలా ఉందేమిటి, పదండి ముందుకు, మనకు అన్నే వచ్చే వరకు పోరాటం చేద్దాం ఇది ఆ రాజకీయనకుడి మొదటి అడుగు. ఇక ప్రజల వైపు నుండి ఆలోచిస్తే , మనకు కొన్ని దొరకలేదు, మనం వాటిని సాధించు కోవాలి , అందుకు ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడు మనకోసం ఎన్నో కష్టాలు పడి, తను కొవ్వోతి ల కరిగి మనకు కరెంటు తెస్తాడు, తన చెమట ధారపోసి బోరింగు పంపు వేయిస్తాడు , ఎముకలతో ఇల్లు కట్టిస్తాడు , ఇలా జనం డిసైడు అయి పోతారు. సరే కానీ మన ప్రజలకు తెలిసింది ఇదేనా ? పోరాటం చెయ్యటం , లేని దాన్ని సాధించు కోవడం ఇంతేనా రాజకీయం?
చిన్న ఉదాహరణకు మన ఊరికి ఒక కొత్త బస్సు కావాలి, ఊరికి బస్సు రావాలంటే ఆ పని ఎవరు చెయ్యాలి? MLA న , MP న, మినిస్టర ? కలేక్టరా? కౌన్సులర? బస్సు ఒక్కటే కాదు ఒక స్కూల్ , ఆసుపత్రి , ఫ్యాక్టరీ ఇవి ఎవరి పనులు ? ఏ ఏ పనులకు ఎవరు భాద్యులు? అదే స్థానంలో ఇంతకు ముందున్న వాళ్ళు చేసిన పనులు ఏమిటి , ఇప్పుడున్న వాళ్ళు చేస్తోన్న పనులు ఏమిటి? మన పనులు జరగడం లేదంటే అది నాయకుడికి చేతకావడం లేదా? లేక నిధులు లేక ? ఇలాంటి ఆలోచనలు మనం నిజం గ చేస్తాం? మనకు తెలిసిందల్ల గట్టిగ జై కొట్టడమే, మిగత పని రాజకీయ నాయకులూ చూసుకొంటారు. లేదా రాజకీయ నాయకుడిని గాని వాళ్ళ పార్టీని గాని మనకు పనులు చేసి పెట్టనందుకు తిట్టడమే . జే కొట్టు లేక తిట్టు , రెండు ఎంతో చక్కని శ్రమలేని పనులు కదా!.
మన మీద మన పురాణాల ప్రభావం చాల ఉంటుంది. మనం కష్టాల్లో ఉంటాము, ఎంత ప్రయత్నించిన అందులోంచి బయటకు రాలేము అప్పుడు మనకోసం ఒకడు వస్తాడు , ఆరోజునుండి మనకే భయం లేదు , అన్ని పనులు అనుకోన్నట్టు గ జరుగు తాయి. నిజంగ మనకు ఆ భావన ఇప్పటికి కూడా ఉంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఈ రాజకీయాలు. రాజకీయ నాయకుడు రాతికి రాత్రే మన జాతకం మార్చేస్తాడు, ఎన్నో ఉచిత వరాలు అందిస్తాడు అని ఎన్నో కోట్లమంది ఈరోజుకు కూడా నమ్ముతున్నారు. రాజకేయం ఒక శాస్త్రం, ఒక మెడిసిన్ లాగా, 'లా' లాగా , ఇంజనీరింగ్ లాగా ప్రతి రాజకీయ నాయకుడు దానిని అభ్యసించాలి అని మన ఆలోచించం. రాజకీయ నాయకుల దగ్గర ఒక మంత్ర దండం ఉంటుంది, దానితో వాళ్ళు ఎన్ని పనులైన చేస్తామని మాటివ్వగలరు అనే అభిప్రాయంతో మనలో చాలామంది ఉన్నారు. రాజకీయ నాయకుడిని మనం ఒక పరిపాలన అధికారిగా, మనకు సేవ చెయ్యడం అతని కర్తవ్యమ్ అని కాకుండా వరాలిచ్చే దేవుడిల చూస్తాము. నీను మీకు ఉచితంగా ఇల్లు కట్టిస్తాను అంటే నువ్వు మా దేముడు అంటాం, దండలు వేస్తాం పూజలు చేస్తాం, వాళ్ళ వారసులకు కూడా అదే సంప్రదాయం కొనసాగిస్తాం. వంద కోట్ల జనాభా ఉన్న పేద భారత దేశంలో కొన్ని వేల ఇల్లు ఉచితంగా కట్టిస్తాము అంటే మరో ఆలోచన లేకుండా నమ్మేస్తము, అది రాజకీయ శాస్త్రం ప్రకారం ఎలా సాధ్య పడుతుందో మనకు అక్కరలేదు. మనకు తెలిసిందల్ల జై కొట్టడమే , ఎవరినా ఏదైనా ఇస్తే తీసుకోవడమే , ఇస్తానన్న మాట అన్నంత మాత్రాన ఆశపడి పోవడమే. దాని సాధ్య సాధ్యాలు కానీ , పరిధి కానీ మనకు అవసరం లేదు.
ఇంతకూ ముందు జై హింద్ అనే ఒక్క నినాదం ఉండేది, మనకు అక్కరలేని పరాయి పాలనని తరిమి కొట్టడానికి , తెల్ల వాళ్ళ గుండెల్లో ప్రతిధ్వని౦చెధీ. ఇప్పడు మనం కొట్టే జే జే లు మాత్రం మనకు ఏదైనా ఇస్తానన్నఒట్టి మాటలకే సరిపోతున్నయి . భారత రాజ్యాంగాన్ని చిన్న తనం నుండి ఒక సబ్జెక్టు లాగా బోధించి, ప్రతి రాజకీయ నాయకుడికి రాజ్యాంగ పరీక్షా పెట్టి పాసైన తర్వాతే పదవిలోకి అనుమతించాలి. ఇక పైన ఎవరినా ప్రజాధనం తో మీకు ఉచితంగా ఏదైనా పని చేస్తామని చెపితే వాళ్ళను తక్షణం పదవినుండి తొలిగించాలి, ప్రజలు రాజకేయ శాస్త్రం మీద అవగాహన పెంచుకోవాలి, దానికోసం మన మీడియా చాల కృషి చేయాలి, వారసత్వపు రాజకీయాలను దూరం చేయాలి. అప్పుడైనా దండలు, దండాలు నిజమైన దేవుల్లకే చెందుతాయి.

Subscribe to:
Posts (Atom)