నాకు ఎందుకో ఇవ్వాళ్ళ తెగ కవిత్వం రాయాలనిపిస్తోంది నేస్తం !
ఆగకుండా, ఆపకుండా ఈ ప్రపంచం నడుం విరిగేలా
నిద్రపోతున్న సమాజాన్ని ఉలిక్కిపడి లేపెల, ఉతికి ఆరేసేలా ఏదో రాయాలనిపిస్తోంది
అలవాటుపడ్డ ప్రాణం కదా, రాయకపోతే చెయ్యి ఊరుకోదే
సరే ఆవేశం ఐతే ఉంది గాని, కవితా వస్తువేది?
ఎందుకు నేస్తం పైనున్న ఆ ఫోటోని చూసి అలా అర్ధం కానట్లు నవ్వుతావు?
అవును నేను రోజు పూజించే ఫొటోనే, ఆ ఫొటోనే మాకు కులదైవం!
ఆ ఫోటో అవసరంలో నాకు కవితా వస్తువు, నా ప్రాణ వాయువు
అవును నేను మరోసారి
ఆ అర్ధనగ్న బడుగు జీవికి కవిత్వభిషేకం చేస్తాను
నాకు తెలుసు నేస్తం, నే నేనాడు పిడికెడు అన్నం పెట్టక పోయినా
ఏ ఒక్కరి గుడిసేలో వెలిగే దీపానికి వత్తు కొనివ్వక పోయినా
నన్ను బ్రతికించేది మాత్రం ఆ పేదవాడే
నన్ను మాత్రమె కాదు, ఎంతమందిని మహాకవులను చేసాడని ?
ఎంతమందికి అవార్డులు ఇప్పించాడని, ఎన్ని కుటుంబాలను నిలబెట్టాడని?
ఆ లెక్క చేప్పనలవిది కాదు; చిరుగు చొక్కలతో, విస్తరాకుల్లాంటి బ్రతుకులతో,
తను తాగే గంజి నీటితో ఎంతమంది కవులకు కవితా దాహాన్ని తీర్చాడని!
పట్టెడు మెతుకులకు నోచుకోనివాడిని నేను ఎలుగెత్తి ఈ ప్రపంచం మొత్తానికి
వినిపించేలా అరవమంటే, మారు మాట్లాడకుండా ఎంత గట్టిగ అరిచాడని!
ఒక సమిధివై నువ్వు వెలగాలి అంటే ఇంటిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పి
తను దీపమై వెలిగాడని, తను బ్రతికున్న, పిల్లలనుకన్న, వాళ్ళు ఆకలితో ఏడుస్తున్న,
చివరకు తను చనిపోయిన ఏమాత్రం సంభంధంలేని నాలాంటి వాళ్ళ హృదయాలు కరిగించి,
మమ్మలను ఏడిపించి, తన బాధ మేము పడేలా చేసి , మా పెన్నుల్లో సిరాగ, మా బ్రతుకు చొక్కలమీద బొమ్మగా,
మా ఇంటిలో సన్మాన పత్రాలుగా మారిన కనిపించే దేవుడే పేదవాడు.
పేదవాడు తనని నమ్మే కవులకు ఏమాత్రం అన్యాయం చేయని మహనీయుడు
ఏ భందుత్వాలు చూడడు, నీ సన్మానం లో వాటా అడగడు, నీ జీవిత గమ్యానికి చొక్కలేని మెట్టావుతాడు
వాడి కన్నా గొప్ప కవితా వస్తువు ఏముంది నేస్తం? నన్ను ఈసారికి ఎప్పటిలాగే మన్నించు
మరో సారి పేదవాడి అవసరం నాకుంది
ఓ పేదవాడ నీకోసం నా కవితా విన్నపం, దయచేసి మీరు అంతా ఎన్ని తరాలైన ఇలాగే ఉండి
నాలాంటి సమాజసేయస్సు కోసం పాటుపడే కవులకు రాజపోషకులు కండి మీరు చస్తూ మమ్ములను బ్రతకనివ్వండి
Chadra Shekar Gaaru ,
ReplyDeleteCould you please permit me to add your story to my forum( or you can add) ? it is forum.telugukingdom.net ( yelugetthu , yendagattu mariyu yekeyyi )?
Please let me know your opinion to telugukingdom@gmail.com
Telugu garu, thanks for your comments, please feel free to add it to your forum.
ReplyDeletechaala santhosham , Chandra shekar gaaru .
ReplyDelete