Saturday, May 15, 2010

మన రాజకీయ అవగాహన రాహిత్యం

మనకు స్వాతంత్రం రాక ముందు ప్రతి భారతీయుడి లక్షం ఒక్కటే, బ్రిటిషు వాడిని దేశంనుండి వెళ్ళగొట్టడం. జై హింద్ అనే ఒక్క మాట అంటే చాలు ప్రతి ఒక్క భారతీయ హృదయం ఉప్పొంగి పోయేది.  దేశ స్వాతంత్రం కన్నా మించి రాజకీయాల గురించి  తెలుసుకోవలసిన అవసరం ఎవరకూ ఉండేది కాదు.  సరే ఇప్పడు స్వతంత్రం వచ్చి యాభై సంవస్తరాలు పైగా అయ్యాయి ! ఇప్ప్పడున్న పరిస్థితి ఏమిటి ? అసలు మనకు రాజకీయాల గురించి నిజంగా ఏమిటి తెలుసు?

                   మనలో ప్రతిఒక్కరికి ప్రస్తుతం ఉన్న స్థితి కంటే ఇంకా బాగుండాలి,  మన కాలనీ లో రోడ్లు చాల విశాలంగా ఉండాలి, ఒక చక్కటి స్కూల్ ఉండాలి, బస్సు సౌకర్యం ఉండాలి , ఆసుపత్రి ఉండాలి , మన ఊరు చాల అందంగా ఉండాలి , ట్రాఫ్ఫిక్ ఉండకూడదు, చక్కటి పరిశ్రమలు ఉండాలి , ఎన్నో ఉద్యోగాలు అందుబాటులో ఉండాలి, రేషన్ దొరకాలి ,  .... ఇలా అంతులేని కోరికల చిట్టా.  ఇంత వరకు బాగానే ఉంది గాని ఇవన్నే సాధిచడం ఇలా , సరిగ్గా ఈ ప్రశ్న దగ్గరే ఒక రాజకీయ నాయకుడి జననం.
                   మనకు ఏమిటి తక్కువ , ఆ పక్క ఊరులో పైన చెప్పిన వన్ని ఉన్నాయి , మన తలరాత ఇలా ఉందేమిటి, పదండి ముందుకు, మనకు అన్నే వచ్చే  వరకు పోరాటం చేద్దాం ఇది  ఆ రాజకీయనకుడి మొదటి అడుగు.  ఇక ప్రజల వైపు నుండి ఆలోచిస్తే , మనకు కొన్ని దొరకలేదు,  మనం వాటిని సాధించు కోవాలి , అందుకు ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడు మనకోసం ఎన్నో కష్టాలు పడి, తను  కొవ్వోతి ల కరిగి మనకు కరెంటు తెస్తాడు, తన చెమట ధారపోసి బోరింగు పంపు వేయిస్తాడు , ఎముకలతో ఇల్లు కట్టిస్తాడు , ఇలా జనం డిసైడు అయి పోతారు. సరే కానీ మన ప్రజలకు తెలిసింది ఇదేనా ? పోరాటం చెయ్యటం , లేని దాన్ని సాధించు కోవడం ఇంతేనా రాజకీయం?
చిన్న ఉదాహరణకు మన ఊరికి  ఒక కొత్త బస్సు కావాలి,  ఊరికి బస్సు రావాలంటే ఆ పని ఎవరు చెయ్యాలి? MLA న , MP న, మినిస్టర ?   కలేక్టరా? కౌన్సులర?  బస్సు ఒక్కటే కాదు  ఒక స్కూల్ , ఆసుపత్రి , ఫ్యాక్టరీ ఇవి ఎవరి పనులు ? ఏ ఏ పనులకు ఎవరు భాద్యులు?  అదే స్థానంలో ఇంతకు ముందున్న వాళ్ళు చేసిన పనులు ఏమిటి , ఇప్పుడున్న వాళ్ళు చేస్తోన్న పనులు ఏమిటి?  మన పనులు జరగడం లేదంటే అది నాయకుడికి చేతకావడం లేదా? లేక నిధులు లేక ?  ఇలాంటి ఆలోచనలు మనం నిజం గ చేస్తాం? మనకు తెలిసిందల్ల గట్టిగ జై కొట్టడమే, మిగత పని రాజకీయ నాయకులూ చూసుకొంటారు.  లేదా రాజకీయ నాయకుడిని గాని  వాళ్ళ పార్టీని గాని మనకు పనులు చేసి పెట్టనందుకు  తిట్టడమే . జే కొట్టు లేక తిట్టు , రెండు ఎంతో చక్కని శ్రమలేని పనులు కదా!.


మన మీద మన పురాణాల ప్రభావం చాల ఉంటుంది. మనం కష్టాల్లో ఉంటాము, ఎంత ప్రయత్నించిన అందులోంచి బయటకు రాలేము అప్పుడు మనకోసం ఒకడు   వస్తాడు , ఆరోజునుండి మనకే భయం లేదు , అన్ని పనులు అనుకోన్నట్టు గ జరుగు తాయి.  నిజంగ మనకు ఆ భావన ఇప్పటికి కూడా ఉంది.  ఇందుకు చక్కటి ఉదాహరణ ఈ రాజకీయాలు.  రాజకీయ నాయకుడు రాతికి రాత్రే మన జాతకం మార్చేస్తాడు, ఎన్నో ఉచిత వరాలు అందిస్తాడు అని ఎన్నో కోట్లమంది ఈరోజుకు కూడా నమ్ముతున్నారు.  రాజకేయం ఒక శాస్త్రం, ఒక మెడిసిన్ లాగా, 'లా'  లాగా , ఇంజనీరింగ్ లాగా ప్రతి రాజకీయ నాయకుడు దానిని అభ్యసించాలి అని మన ఆలోచించం. రాజకీయ నాయకుల దగ్గర ఒక మంత్ర దండం ఉంటుంది, దానితో వాళ్ళు ఎన్ని పనులైన చేస్తామని మాటివ్వగలరు అనే అభిప్రాయంతో మనలో చాలామంది ఉన్నారు. రాజకీయ నాయకుడిని మనం ఒక పరిపాలన అధికారిగా,   మనకు సేవ చెయ్యడం అతని కర్తవ్యమ్ అని కాకుండా  వరాలిచ్చే దేవుడిల చూస్తాము.  నీను మీకు ఉచితంగా  ఇల్లు కట్టిస్తాను అంటే నువ్వు మా దేముడు అంటాం,  దండలు వేస్తాం పూజలు చేస్తాం,  వాళ్ళ వారసులకు కూడా అదే సంప్రదాయం కొనసాగిస్తాం. వంద కోట్ల జనాభా ఉన్న పేద భారత దేశంలో కొన్ని వేల ఇల్లు ఉచితంగా కట్టిస్తాము అంటే మరో ఆలోచన లేకుండా నమ్మేస్తము, అది రాజకీయ శాస్త్రం ప్రకారం ఎలా సాధ్య పడుతుందో మనకు అక్కరలేదు.   మనకు తెలిసిందల్ల   జై కొట్టడమే , ఎవరినా ఏదైనా ఇస్తే తీసుకోవడమే , ఇస్తానన్న మాట అన్నంత మాత్రాన ఆశపడి పోవడమే.  దాని సాధ్య సాధ్యాలు కానీ , పరిధి కానీ మనకు అవసరం లేదు.
ఇంతకూ ముందు జై హింద్ అనే ఒక్క నినాదం ఉండేది,  మనకు అక్కరలేని పరాయి పాలనని తరిమి కొట్టడానికి , తెల్ల వాళ్ళ గుండెల్లో ప్రతిధ్వని౦చెధీ. ఇప్పడు మనం కొట్టే జే జే లు మాత్రం మనకు ఏదైనా  ఇస్తానన్నఒట్టి మాటలకే సరిపోతున్నయి .  భారత రాజ్యాంగాన్ని చిన్న తనం నుండి ఒక సబ్జెక్టు లాగా బోధించి, ప్రతి రాజకీయ నాయకుడికి రాజ్యాంగ పరీక్షా పెట్టి పాసైన తర్వాతే పదవిలోకి అనుమతించాలి. ఇక పైన ఎవరినా ప్రజాధనం తో మీకు ఉచితంగా ఏదైనా పని చేస్తామని చెపితే వాళ్ళను తక్షణం పదవినుండి తొలిగించాలి, ప్రజలు రాజకేయ శాస్త్రం మీద అవగాహన పెంచుకోవాలి, దానికోసం మన మీడియా చాల కృషి చేయాలి, వారసత్వపు రాజకీయాలను దూరం చేయాలి.  అప్పుడైనా  దండలు, దండాలు  నిజమైన దేవుల్లకే చెందుతాయి. 

3 comments:

  1. this is very nice. you have gone to be basics and root cause of problem.

    ReplyDelete
  2. Chandra Shekar Gaaru ,
    Excellent andi. Could you please try to add your profile also so that we will come to know about you

    Regards
    telugukingdom.net

    ReplyDelete