సినిమా రివ్యూలు రాయడం మంచి బిజినెస్. రివ్యు టైం లో ఇంటర్నెట్ జనం ఖచ్చితంగా వెబ్ సైట్లు చూస్తారు. ఆ వెబ్సైటు లలో అసలు మేటర్ పావు పేజి ఉంటే, యాడ్స్ ఫుల్ పేజిలు ఉంటాయి. మనం ఒక్క సారి క్లిక్ చేస్తే మెయిన్ పేజి తో పాటూ పది, పదిహేను యాడ్ విండోస్ ఓపెన్ అవుతాయి. వాటిల్లో కొన్ని యాడ్స్ ఆటోమాటిక్ గ మాట్లాడడం మొదలు పెడతాయి. ఒక్కో యాడు విండో క్లోజ్ చేసుకొని, స్పీకర్లు ఆఫు చేసి , ఇక రివ్యూ చదవడం మొదలు పెడతాం. రివ్యూ రాసే వాళ్ళ ఉదేశ్యం సినిమా బాగుందా లేదా అని ఒక్క మాటలో తెల్చేయ్యడం. దానికి కొంత రేటింగ్ ఇవ్వడం. ఆశ్చర్యం ఏమిటి అంటే, వీల్లేమి సెన్సార్ వాళ్ళు కాదు కదూ రేటింగ్ ఇవ్వడానికి!? ఏదో వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు రేటింగ్ ఇస్తారు. అయిన వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు? సినిమా బాగుంటే రేటింగ్ బాగుంటుంది , లేదంటే లేదు అని మనలాంటి వాళ్ళు సరి పెట్టుకొంటారు. నిజంగ జరిగేది అదేనా?
నాకు తెలిసి మనందరం జీవితంలో సినిమా ఒక భాగం. మంచి సినిమా చూడాలి, చూసి నలుగురికి గొప్పగా చెప్పాలి, దాని గురించి పొగడాలి, సినిమా బాగోలేక పొతే తీసిన డైరెక్టర్ ను, ప్రొడ్యూసర్ ను, హీరో హీరోయిన్ లను విశ్లేషించి, ఇంకా ఎలా బాగా తియ్యొచ్చు అని మాట్లాడాలి, ఇవన్ని మన సినిమా జీవితంలో నిత్య చిత్రాలు. సరే తెలుగు సినిమా రిలీజ్ అయ్యింది, మార్నింగ్ షో పూర్తీ అయ్యింది, కొన్ని సంవస్సరాల క్రితం , హాలులో నుండి బైటకు వచ్చే మార్నింగ్ షో వాళ్ళు , సినిమా బాగుందో లేదో చెప్పేవాళ్ళు. అది కాకపోతే, మొదటి రొజూ పూర్తి అయ్యాక సినిమా టాకు ఎలాగు తెలుస్తుంది. ఆ టాకు తెలిస్తే, పది మంది బాగోలేదు అంటే, ఇక ఆ సినిమా ఇప్పట్లో చూడనవసరం లేదు. సినిమా హిట్ అవడానికి కాక పోవడానికి ఇదే కదా కారణం.
ఇప్పుడు మన సినిమాలు దేశ విదేశాలలో ప్రదర్శిత మవుతున్నాయి. విదేశాల్లో , ఉదాహరణకు అమెరికా లో సినిమా టాకు తెలుసు కోవాలంటే, వెబ్సైటు రివ్యూలు ఒక్కటే మార్గం. మన దగ్గర ఐతే , ఒక కాఫీ షాప్ లోనో, హెయిర్ సెలూన్ లోనో, ఎక్కడో ఒక చోట సినిమా టాకు గురించి తెలుస్తుంది, మరి అమెరికా లాంటి దేశాల్లో టాకు తెలియాలంటే రివ్యూలు చదవక తప్పదు. మరి రివ్యూ రాసే వాళ్ళు మనకు అంతా నిజమే రాస్తున్నార? వాళ్ళు నిజమైన రివ్యూ రాయాలని మనం ఎందుకు ఆశించాలి? అసలు రివ్యూ చదవకుండా సినిమాకు వెళితే ఏమవుతుంది? రివ్యూ చదవకుండా, పెళ్ళాం పిల్లలతో లేదా నలుగురు ఫ్రెండ్స్ తో ఒక ౩౦ మైళ్ళ దూరంలో, (కొంతమంది ఇంకా దూరం నుండి వస్తారు, నాకు 400 మైళ్ళు ట్రావెల్ చేసిన సినిమా ప్రేమికులు తెలుసు) ఉన్న సినిమా హాలుకు వెళ్లి, తీర సినిమా బాగోలేక పోతే..? తను ఒక్కడే కాకుండా, తనతో వచ్చే ఫ్రెండ్స్ నుంచి మాట పడాలి, సినిమా బాగోలేదు అనే ఒక బాధ, వీకెండ్ వేస్ట్ అయ్యిందనే ఒక బాధ, ఫ్రెండ్స్ కి చెత్త సినిమా చూపిస్తే వాళ్ళు వేసే సెటైర్లు తో మరో బాధ. అసలు ఈ బాధలు ఏవి లేకుండా ఏదైనా రివ్యూ చదివి, ఆ రివ్యూ రాసే వాడు , కేక , కత్తి లాంటి భాషతో రివ్యూ రాస్తే ఇక ఒకటే సంతోషంతో సినిమాకు వెళ్ళొచ్చు. సినిమా బాగోలేక పోతే, డైరెక్టర్ తో పాటూ రివ్యూ రాసిన వాడిని తిట్టొచ్చు, ఫ్రెండ్స్ టార్చర్ నుండి తప్పించు కోవచ్చు. చూసారా ఎన్ని లాభాలున్నాయో?
సరిగ్గా ఈ బలహీనత మీదే కొన్ని మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. రివ్యూ రాసే వాళ్ళు మొదట నిజాయీతి గా రాయడం మొదలు పెడతారు. సినిమా బాగుంటే బాగుంది అంటారు , లేక పోతే లేదు అంటారు. ఇది చదివి సినిమాకు వెళ్ళేవాళ్ళు , రివ్యూ రాసిన వాడు చెప్పినట్టుగ సినిమా ఉండడంతో, రాసే వాడి మీద నమ్మకం ఉంచుకుంటాడు. ఇలా ఒకటికి రెండు సార్లు జరగగానే , ఈ సదరు అమెరికా ప్రేక్షకుడికి అంతులేని నిధి దొరికిన ఆనందం. సినిమాకు వెళ్ళాలంటే మొట్ట మొదట చేయవలసిన పని రివ్యూ రాసే వెబ్సైటు చూడడం , రేటింగ్ చూడడం, చిన్న రివ్యూ మొత్తం చదివితే సినిమా మీద ఒక అవగాహన ఏర్పడి , చూస్తున్న్నప్పుడు మజా పోతుంది అని , కత్తి , కెవ్వు , కేక అనే పదాలు కోసం వెతకడం. రేటింగ్ స్టారు, కెవ్వు ఉంటే చాలు , ఇక మంచి ఊపు మీద సినిమాకు బయలు దేరడం, తనతో పాటు ఒక పది మందిని వెంటేసుకుని పోవడం. ఇద్దరు విదేశీ సిని ప్రేమికులు మాట్లాడుకోన్నప్పుడు మొదట వచ్చే మాట "ఆ సినిమా రేటింగ్ ఎంత" అని ఉంటే మీరు అర్ధ చేసుకోవచ్చు, జనం రివ్యూలకు ఎంతగా అలవాటు పడిపోయారో!.
ఈ రివ్యూలు రాసే జీవులు పది సినిమాలకు ఉన్నదున్నట్టు చెప్పి, తర్వాత రెండు సినిమాలకు తప్పుడు రేటింగ్ ఇస్తే, పరిస్థితి ఒక్క సారి ఊహించండి. ఈ మధ్య వచ్చిన " ఏం మాయ చేసావే" సినిమాకు జీవులు ఇచ్చిన రేటింగ్ చూడండి, గొప్ప ఆంధ్ర అనే ఇంకో వెబ్సైటు కూడా అదే సమయంలో ఇచ్చిన రేటింగ్ చూడండి. రెండు కూడా విపరీతంగా ఈ సినిమాను పోగిడాయి. ఇప్పడు అందరకు తెలిసిన విషయమే, ఈ సినిమాకు ఓవర్ రేటింగ్ ఇచ్చారు అని. కానీ అప్పటికే, ఎన్నో వందల మంది ఈ ఓవర్ రేటింగ్ వల్ల ఈ సినిమా ఎక్కువ డబ్బు పెట్టుకొని చూసారు. ఇలా ఒక్కో సినిమాను విశదీకరించడం కష్టం. ఒక్క సారి రోబో సినిమా గురించి చూద్దాం. అమెరికా చరిత్రలో ప్రేక్షకులనుండి ఎక్కువ టికెట్ డబ్బులు, ముక్కు పిండి వసూలు చేసింది రోబో సినిమానే! ఈ రోబో సినిమాకు చాల హై రేటింగ్ ఇచ్చారు. రేటింగ్ రావడం తోనే సినిమా టికెట్ డబల్ చేసారు, సినిమా యాడ్లలో, రేటింగ్ , రివ్యూ మొత్తం వాడుకొన్నారు. జీవి ఈ సినిమాకు ఎక్కువ రేటింగ్ ఇచ్చాడు, గొప్పగా రివ్యూ రాసాడు, ఇదంతా సినిమా పబ్లిసిటీ కి వాడు కొన్నారు. కొంచెం తక్కువ రేటింగ్ ఇస్తే, మొత్తం రివ్యూ కాకుండా, రివ్యూ లో బాగున్న మాటలు కాపీ పేస్టు చేసి పబ్లిసిటీ కి వాడుకొంటారు. ఇంత చేసి చూస్తె, సినిమా చూసినవాళ్లు, ఈ సినిమాకు కూడా ఓవర్ రేటింగ్ ఇచ్చారని, 25 $ పెట్టి చూడాల్సిన సినిమా కాదని జనాలంతా మొత్తుకొన్నారు. ఈ రివ్యూలు రాసే వాళ్ళకు తెలుసు ఓవర్ రేటింగ్ ఇచ్చామని, కానీ చాల అమాయకత్వం నటిస్తారు. రివ్యూ మాత్రమే కాకుండా, రివ్యూను సప్పోర్టు చేసి కధనాలు ప్రచురిస్తారు. వేరే వెబ్సైటు వాళ్ళు ఈ సినిమా అద్భుతం అన్నారు, కొన్ని ప్రాంతాల్లో టికెట్స్ పది రోజులవరకు అయిపోయాయి అంటారు. ఈ విధంగా వాళ్ళు రాసిన రివ్యూకు సపోర్ట్ వాళ్ళే ఇచ్చుకొంటారు.
అమెరికా లో తెలుగు సినిమా బిజినెస్ కి చాల మార్కెట్ ఉంది. ఇక్కడ రిలీజ్ ఇన ప్రతి భారతీయ సినిమాలకు పది డాలర్లు నుండి 20 డాలర్ల వరకు టికెట్ ఉంటుంది. అమెరికాలో మల్టీ ప్లెక్ష్ మోడల్ హాలులు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క సినిమాకు ఒక హాలు కాకుండా, ఒకే బిల్డింగ్ లో చాల సినిమా స్క్రీన్లు ఉంటాయి. ఒక్కో స్క్రీన్ కి (హాలు) 200 , అంతకన్నా ఎక్కవగా సీట్స్ ఉంటాయి. హాలు మొత్తం ఫుల్ ఐతే , పది డాలర్ల టికెట్ అయితే ఒక షోకి 2000 $ వస్తుంది. నిన్న వచ్చిన రోబో సినిమాకు టికెట్ 20 $, కాబట్టి ఒక షో కి మొత్తం 4000 $. ఒక్క మిన్నెసోట లో రోబో ప్రస్తుతానికి తెలుగు లో 6 షోలు . ఇవి కాకుండా హిందీ, తమిళ్ , ఇలా అన్ని కలుపుకొని దాదాపు పదహారు షోలు. అన్ని షో లు ఫుల్ అయితే మూడు రోజులకు 64000 $, హాలు సగం నిండిన కనీసం ౩౦౦౦౦$. అంటే దాదాపు పదమూడు లక్షల రూపాయలు!. అది కూడా ఒక్క ఏరియ లో , ఇక US మొత్తం లెక్క పెడితే ఎంతుంటుందో? ఈ లెక్కలు ఎందుకు చెప్పాము అంటే , అసలు మొదటి మూడు రోజుల్లో ఎంత మొత్తం ఎలా రాబట్టుతారు? మొదటి మూడు రోజుల్లో సినిమా చూసిన వాళ్ళంతా రివ్యూ చదివి వచ్చిన వాళ్ళే. సినిమాకు 162 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ డబ్బు త్వరగా రాబట్టుకోవాలంటే ఉన్న ఒక్కే ఒక్క మార్గం రివ్యూ రాసేవాళ్ళను కొనడమే. నిజమే కదా? మూడు రోజుల్లో కొన్ని ఏరియాలలో ఒక కోటి పైగా డబ్బులు రాబట్టేవి రివ్యూలే కదా? ఆ రివ్యూ రాసేవాడికి కొన్ని ఏరియాలలో వచ్చే డబ్బు మొత్తం ఇచ్చిన, మిగతా ఏరియాలలో చాల డబ్బులు రాబట్టు కోవచ్చు. ఒక్క పాయింట్ రేటింగ్ పెంచితే ఎన్ని మిల్లియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందో..? ఈ రివ్యూ రాసే వాళ్ళకు , వెబ్సైటు లో యాడ్ ల వల్ల డబ్బులు, రివ్యూ రాయడానికి డబ్బులు, మన కంపూటర్లు పాడుచేసిన యాడ్ వేర్ వల్ల డబ్బులు... ఇంకా ఎన్నో..? నాకు మాత్రం ఈ రివ్యూలు మన సినిమా బలహీనత మీద ఆడుతున్న పెద్ద జూదం అనిపిస్తున్నాయి. నిజమేనా ..? ఒక్క సారి చూద్దాం
రివ్యూలు రాసే వాళ్ళను గమనించండి, వాళ్ళు అన్ని సినిమాలకు రివ్యూలు వెంటనే రాయరు. జీవులు మధ్యలో కొన్ని సినిమాలు స్కిప్ చేస్తారు , అంటే ఏమిటి అర్ధం? ఎంతో మంది అమెరికా , మరియు విదేశి సిని అభిమానులు రివ్యూలు కోసం చూస్తారని వాళ్ళకు తెలుసు , కానీ అన్ని సినిమాలకు రాయరు, ఆ సినిమాకు సంభందించి పెద్ద యాడు , మెయిన్ పేజిలో ఉంటుంది కానీ రివ్యూ ఉండదు. కొన్నిటికి వెంటనే రాస్తారు, ఒక పది సినిమాలకు ౩ అంతకన్నా తక్కువ రేటింగ్ ఇస్తారు, తర్వాత సినిమా బాగోలేక పోఇన 4 లేదా 4.5 రేటింగ్ ఇస్తారు. అది చాలక తప్పకుండ చూడండి అని గొప్పగా పొగుడుతారు . దీనిని బట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు. ఈ తప్పుడు రేటింగ్స్ వల్ల మొసపోయిన సాటి సిని అభిమానులకు నా సానుభూతి.
ippudu facebook, twitter and independent blogs time lo raayalsina post kaadu sir idi, nobody worries about reviews from sites. they must have got info from atlest 3 to 4 sources
ReplyDeleteGV రివ్యూల్ని ఆదరిస్తున్న NRI జనతాని అనాలి. వాళ్ళవల్లే ఈయన బ్రతుకుతున్నాడు. ప్రస్తుతం ముక్కుపిండి మరీ డబ్బులు దండుతున్నాడు. పైగా ఈ మధ్య ఈ బ్రెయిన్ లేని సైటుకి ఉత్తమ సినిమా సైటుగా మీడియా అవార్డులు. నిజం ప్రేక్షకుల్ని కాపాడాలంటే ఇలాంటి సైట్లను లేపెయ్యాలి. NRI లూ మేలుకోండి!
ReplyDeleteHow did 30000$ become 1cr30lakhs :-).
ReplyDeleteI agree with the sentiment of this article, although I feel NRIs don't trust Jeevi ratings anymore. He is a corrupt guy
Kumar,
ReplyDeleteThanks for pointing out the Math Typo. I corrected it.
nicely put together. Yes, GV changed a lot from few years back. I head robo's ticket was $30 in calif area.
ReplyDelete