దేవుడు ఎక్కడున్నాడు ? ఉంటే కనపడడే? ఇది ప్లహలాదుడి కాలం నాటి ప్రశ్న!. ఈ రాళ్ళలో ఉన్నాడా? ఈ పువ్వులో ఉన్నాడా ? ఇలాంటి ప్రశ్నలు వేస్తె, కొంచెం పెద్దరికం వహించి, పెద్దలు అనబడే వాళ్లు , ఒక్క చిరునవ్వు నవ్వి , పిచ్చి వాడ!, మూర్ఖుడా, దేవుడు ఎక్కడో లేడుర నీ మనసులో ఉన్నాడు, ఈ సమస్త ప్రాణికోటిలో ఉన్నాడు, అని వేదాంతం లాంటిది చెబుతారు కానీ విషయాన్నీ సూటిగా చెప్పరు. ఆ చెప్పేవాళ్ళకు దేవుడు ఎక్కడ ఉన్నాడో ఏమితెలుసనీ ? నిజానికి వాళ్ళకే కాదు, మనకేవ్వరకు తెలీదు. తెలిస్తే మీరు కంప్యూటర్, ఈ బ్లాగ్ వదిలి , దేవుడున్న చోటికి పరిగెత్తరూ? కంప్యూటర్ మీది కాకపోతే పరిగెత్తుతార? సరే మీ ఇష్టం.
అదిసరే , మన టాపిక్ దేవుడు ఎక్కడున్నాడని కాదు!, అసలు దేవుడెలా ఉంటాడు , వొకవేళ హటాతుగా కనిపిస్తే మనం గుర్తు పట్టగలమా అని? ఒక్క సారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చెయ్యండి. మీరు ఉన్న ఖండం, దేశం గుర్తు పట్టండి. ఇంకా జూమ్ చెయ్యండి, మీరు ఉన్న పట్టణం, మీ ఊరు, మీ వీధి, మీ ఇల్లు , ఇక మీరు. కనిపిస్తున్నార? లేదే ..? మన భూమి మీద మనం ఒక చిన్న బిందువు లాంటి వాళ్ళం , అది కూడా గుర్తు పట్ట లేనంత. అది సరే కానీ దీనికి , దేవుడు కనిపించడానికి సంభందం ఏమిటి?
మరి దేవుడంటే ఎవరు? మనలను సృష్టించాడు, మన పొరుగు వాళ్ళను సృష్టించాడు, మన ఊరు, పట్టణం, దేశం, ఈ సముద్రాలూ , పక్షులు సృష్టించాడు. అంతెందుకు ఈ మొత్తం భూమిని సృష్టించాడు. ఒక్క భూమేనా!, స్వర్గం, నరకం, వైకుంటం , ఇంద్రలోకం లాంటి వన్ని సృష్టించాడు. ఇవే కాకుండా, మన భూమి లాంటి కొన్ని లక్షల గ్రహాలు సృష్టించాడు. సూర్యుడు లాంటి కొన్ని కోట్ల నక్షత్రాలు సృష్టించాడు. కేవలం సృష్టించడమే కాకుండా , వాటిని నిరంతరం సంరక్షిస్తున్నాడు. బాబు..., ఇక చాలు... దేవుడు , దేవుడే అని ఒప్పుకోన్నారా..? సరే మరి.
వీటన్నిటిని సృష్టించాలి అంటే, దేముడు ఇంకా ఎంత పెద్దగ ఉండాలి? భూమిని సృష్టించాలి అంటే, భూమి కన్నా పెద్దగ ఉండాలా లేదా? సూర్యున్ని సృష్టించాలి అంటే, సూర్యుని కన్నా పెద్దగ ఉండాలా లేదా? ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాలి అంటే, విశ్వం కన్నా పెద్దగ ఉండాలా లేదా ? అక్కర లేదా? ఒక చిన్న ఉదాహరణ , మీకు కొన్ని ఇటుకలు ఇచ్చి ఒక దాని మీద ఒకటి పరచమంటే ఎంత వరకు పరచగలరు? మీ అంత ఎత్తు వచ్చే వరకు, తర్వాత ఇక మీ వల్లకాదు. మరి విశ్వాన్ని మొత్తం సృష్టించాలి అంటే, దేవుడు మనలా చిన్నగా ఉంటే సరిపోదు కదా. మరి అంత పెద్ద దేవుడిని, గూగుల్ మ్యాప్ లో కనపడని నువ్వు ఎలా చూడగలవు? అంటే నీకోసం దేవుడు మనిషి రూపం ధరించాలి అన్న మాట . అప్పడు నీ ఎదురుగ నిలబడితే ఒక మనిషి తో మాట్లాడినట్టు మాట్లాడతావన్న మాట. దానికోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? మరి నీ పక్క వాళ్ళలో దేవుడిని చూడు అంటే మనం వినం, మనం ఎప్పుడు చూడని వాళ్ళు వచ్చి నేను దేవుడిని అంటే నమ్మం, మరి దేవుడు నీకెలా కనిపించాలి. ఈ సమస్త ప్రాణికోటి లో మరే జంతువు గని, పక్షి లా గని కనిపిస్తే గుర్తు పట్టలేవు, మరి ఎలాగా ? అన్ని నీకు అనుకూలంగా మర్చుకున్నావు కదా ఓ మనిషి. దేవుడిని నమ్మావు, ఆయనకు మనిషి రూపం ఇచ్చావు, ఇంత విశాల సృష్టికి అధిపతి, నీకు ఎదురుగ రావాలి అన్నావు, ఆ వచ్చేదేదో మనిషి రూపంలో రావాలి అన్నావు, ఒక్క గాలి వాన వస్తేనే చెల్లా చెదురై పారిపోయే నువ్వు, ఆ అనంత సృష్టికి అధిపతి యొక్క శక్తి తట్టుకోగలవా? అప్పుడు కూడా దేవుడు నీకు సహాయం చేసి , తన శక్తి తగ్గించుకొని నీకు మరో మానవుడుగా, (నీ పక్కింటి వాడుగా మాత్రం కాదు) కనిపించాలి, నీతో మాట్లాడాలి, నువ్వు ఆయనను కుశల ప్రశ్నలు వేసి , నిన్ను అయన ప్రశ్నలు అడిగి (అక్కడికి ఆయనకు నీ గురించి తెలియనట్లు!), కొంత సేపు మాట్లాడుకోవాలి. తర్వాత మోక్షం గురించి అడగాలి ... అబ్బో ఇంకా చాల కోరికలే నీకు .. , దేవుడి పని దేవుడిని చేసుకోనియకుండా, నాకు ఒకసారి కనిపించు అంటే ఆయన నీకోసం ఎంత కష్టపడాలో కదా! అందుకే మన పెద్దలు , ఈ సమస్త ప్రాణి కోటిలోను దేవుడున్నాడు అన్నారేమో ? ఆలోచించు నేస్తం.
No comments:
Post a Comment