Thursday, October 21, 2010

యోగి వేమన నీకు మా జన్మదిన శుభాకాంక్షలు

వేమన- ఈ పేరు వినని  ఆంధ్రులు ఉండరంటే అతిశయోక్తి కాదు.  ఆటవెలది ఛందస్స్సులో సామాన్యులందరికీ అర్ధం అయ్యే రీతిలో ఎంతో గొప్ప భావాలను పొందికగా వేమనాచార్యులు అమర్చిన తీరు అనితర సాధ్యం ఐనది. ఇలాంటి వేలకొద్ది  పద్యాలూ రాసిన శ్రీ వేమన చార్యులు జన్మదినం ఈ రోజు . ఆయన నందన నామ సంవత్సరము,  ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు.   
ఆయన తన జన్మస్తలాన్ని తనే ఒక  పద్యంలో వివరించారు. 
నందన సంవత్సరమున 
బొందుగ నాశ్వ(యు) జ శుద్ధ వున్నమినాడున్ 
బృందార కాద్రి సేతువు 
నందున నొక వీర వరుని జన్మము వేమా!
బృందారక  =ఘనమైన 
అద్రి=కొండల 
సేతువు = సముద్రాన్ని కానీ , నదిని కానీ రెండుగా చీల్చేది (భూమి). (రామ సేతు మనకు శ్రీలంకకు మధ్య నున్న సముద్రాన్ని చీలుస్తూ నిర్మించినది . )
పై పద్యంలో వేమన ఆచార్యులు రెండు గొప్ప కొండల నడుమనున్న సేతువు తన జన్మ స్థలం అని చెప్పారు.  రెండు కొండలను  నడుమ నుండి పారే నదులు మనకు చాల ఉన్నాయి , ఉదాహరణకు కృష్ణ నది, కానీ అవి సేతువు ఏర్పరచలేదు .  మన ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ప్రదేశం ఉండేది కడప జిల్లాలో  వేంపల్లి కి దగ్గరలో నున్న " గండి"  లో  'వీరన్న గట్టు పల్లి"   అనే గ్రామం వేమన గారి జన్మస్థలం.  పాపాగ్ని నది ఇక్కడి శేషాచల కొండల శ్రేణిని రెండుగా చీల్చి సేతువుని ఏర్పరుస్తుంది.  ఆ చిన్న సేతువులో ఎన్నో వందల ఏళ్ళ నుండి  ప్రజలు నివాసం ఉంటున్నారు. చాల పరిశోధనల అనంతరం ఈ విషయాన్నీ కొనుక్కోబడ్డాయి. 
వేమన గొప్ప తత్వవేత్త మాత్రమే కాదు, పరసువేది విద్య తెలిసిన గొప్ప రసాయన శాస్త్రజ్ఞుడు,  ఆయన పద్యాలలో మనకు తెలిసినవి కేవలం నీతి పద్యాలే  కానీ ఆయన రచనలలో పసిడిని తయారు చేసే విధానం ఉంది అని ఇప్పటికి ఎంతో మంది నమ్మకం.  అది నిజం కాకపోవచ్చు కూడా!  బంగారం ఒక మూలకం. దీని అటమిక్ నెంబర్ 79 , రాగి ఆటోమిక్ నెంబర్ 29 , పాదరసం ఆటోమిక్ నెంబర్ 80 . ఇలా ఒక మూలకం నుంచి  మరొక మూలకం తయారు చెయ్యొచ్చు అని శాస్త్రీయం గ నిరూపించబడింది. పాదరసం యొక్క  ఒక ఆటోమిక్ నెంబర్ తగ్గించి బంగారం తయారు చెయ్యొచ్చు అని  రూథేర్ ఫోర్డ్  ప్రయోగాలలో తెలిసింది అంటారు. కానీ ఇది చాల ఖర్చుతో కూడుకొన్న  పధ్ధతి.   
మూలకాలు శాస్త్రీయంగా నిర్వచించిన బాయిల్ కూడా బంగారం వివిధ మూలకాల సమ్మేళనం అని భావించాడు. తర్వాత బంగారానికి ఒక మూలకం గ భావిస్తూ వచ్చారు. మన భారతీయులకు ఇలా మూలకాలను మార్చే విద్య చాల కాలంనుండి తెలుసు అని నమ్మకం. అందులో వేమన ఒకరు. నిజానికి పాశ్యాత్తులకు అంటూ పట్టని ఎన్నో విద్యలు మన భారతీయులకు తెలుసు.  మన నుంచి యోగా నేర్చుకొని, మన చేత డబ్బులు కట్టించుకొని , మన విద్య మనకే నేర్పే వాళ్ళు చెప్పిందే వేదం అని నమ్మినంత కాలం మన వల్ల గొప్ప తనం మనం గుర్తించలేము.   వేమన రాసిన పద్యాలలో విషయాలు ఆయన ఒక సాధారణ కవి కన్నా , ఎంతో అసాధారణ మేధావి , గొప్ప సిద్ద యోగి అని పిస్తాయి , మచ్చుకు కొన్ని పద్యాలు. 
పాలు పోసి వండ బరిగెడి తగరంబు 
వేళ యెరింగి దింప వెండియగును 
కల్ల కాదు నిజము కరకంట నీ యాన 
విశ్వదాభి రామ వినుర వేమ
ఉప్పు చింతపండు నూరిలో ఉండగ 
కరువదెల వచ్చే కాపులారా
తాళకం బెరుగరో తగరంబు నెరుగరో
విశ్వదాభి రామ వినుర వేమ
ఇంటి వెనుక తీగ ఇంగ్లీకముండగా 
పాదరసం గలుగ పసిడి యేల?
సత్తు పొత్తు చేసి సాధింప వచ్చురా 
  విశ్వదాభి రామ వినుర వేమ
పైకి ఎంతో సహజంగా ఉన్న వేమన పద్యాలలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి అన్న మాట మాత్రం నిజం. మన భారత దేశంలో ఆర్యభట్ట, నాగార్జునుడు, చాణక్యుడు అంతటి గొప్ప తెలివి తేటలున్న వాడు యోగి వేమన.  ఎంత మేధావి కాకపోతే  దాదాపు 700 సంవత్సరములు గడిచినా  ఆయన రాసిన పద్యాలూ, చేసిన హితబోధలు ఇప్పటికి చెక్కు చెదరకుండ ఉన్నాయి.  ఓ వేమన నీకు మా తెలుగు జాతి నమస్కారములు.  నీ పుట్టిన రోజును ఎప్పటికి ఘనం గ జరుపుకొంటాం!

1 comment:

  1. madhu mohan garu, thanks for your comments.

    I've uploaded this information to

    http://te.wikipedia.org/wiki/%E0%B0%B5%E0%B1%87%E0%B0%AE%E0%B0%A8

    ReplyDelete