Saturday, September 11, 2010

వినాయక కధలో వాస్తవాలు ఎలా తెలుసుకోవడం ?

వినాయక చవితి కధ మనం తర తరాలనుండి చదువుతున్నాము . అసలా కధ ఎప్పడు , ఎక్కడ మొదలైందో ఎవరికైనా సరిగా తెలుసా? నాకు మాత్రం ప్రతి సంవస్స్తరం ఒకే ప్రశ్న.  చంద్రుడు ఎలా నవ్వుతాడు?


సరే చంద్రుడు ఇదివరకు నవ్వే వాడె అనుకొంటే , ఇప్పుడు నవ్వడం మానేసాడ?  ఆలోచిస్తే ఇది వితండ వాదం లానే ఉంటుంది. ఏయ్ ఎంత ధైర్యం నీకు పెద్దలు చెప్పిన దాన్ని మళ్ళి ప్రస్నిస్తున్నావా?  నేరుమూసుకొని వాళ్ళు ఏది రాసారో అదే చదువు, ప్రశ్నలు అడక్కు అంతే ఏ టాపిక్ ఇక్కడే ఆగి పోతుంది.  నేను చదివే కధలో అనుమానం వస్తే దానిని నివృతి చేసుకోకూడద? అందుకే అసలు ఏ కధ ఎవరు రాసుంటారు? రాసిన వాళ్ళు చంద్రుడు నవ్వాడని ఎందుకు రాసారు?  కధనంత చంద్రుడి  చుట్టూ ఎందుకు తిప్పారు?


మన భారతీయులకు నవ గ్రహాలు ఉంటాయని, వాటి పేర్లు, అవి సూర్యుని చుట్టూ తిరిగే వేళలు, భూమికి ఇతర గ్రహాలకి ఉండే సంభంధం అన్ని  ఖచ్చితంగా  తెలుసు.  దాని ఆధారంతో నే కేలండర్ తయారు చేసారు. తిధులు, నక్షత్రాలు ఖచితంగా అంచనా వేసారు. చంద్రునికి, ఏ రొజూ  ఏ నక్షత్రం దగ్గరున్తాడో ఒక్క తప్పు లేకుండా రాసారు.  ఇన్ని తెలివి తేటలున్న వాళ్ళు, పురాణ కధలను మాత్రం, నమ్మ శక్యం కానీ రీతిలో రాసారు.  వ్రాసిన వారి ఉద్దేశ్యం బహుశా సామాన్య జనాలకు ఏ కధలను చేరువగా చెయ్యడం , తద్వారా భక్తీని పెంపొందించడం. నిజమే కానీ దానికోసం ఇలాంటి కధలు ఎందుకు రాసారో ఆ పరమేశ్వరుడికే   తెలియాలి.


ఈ కధలో శమంతక మణి ఉంటుంది , దానిని సత్రాజిత్తు తమ్ముడు ధరించి వేటకు వెళతాడు. సింహం అతనిని వధించి మణి అపహరిస్తుంది. ఇంతవరకు ఫర్వాలేదు. వెంటనే జాంబవంతుడు సింహంతో పోరాటం చేస్తాడు. జాంబవంతుడు ఒక భల్లూకం . సింహం మృగరాజు.  భల్లూకం సింహంతో తలపడినట్లు ఏ ప్రపంచ సాహిత్యం లో ను లేదు. అది సరే జాంబవంతుడు సింహాన్ని చంపేస్తాడు, ఎందుకంటే మణి కావాలని!.  ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , మనుషుల్ల లాగే ఈ జంతువులూ కూడా మణి కోసం దెబ్బలాడుకోవడం.  జాంబవంతుడు మణిని  తన కూతురికి ఆడుకోవడానికి ఇవ్వడం. ఇది సరేకానీ ఈ సృష్టి స్తితి కారకుడు ఇన ఆ మహా విష్ణువు, జాంబవంతుదితో  పోరాడి ఆ మణి గెలిచి, జాంబవతిని పెళ్లి చేసుకోవడం.  జాంబవతి ఒక భల్లూకం కూతురు, ఇన సరే మనవ రూప ధరి ఇన కృష్ణుడిని పెళ్ళాడడం ఏమిటో?


ఇలాగే చంద్రుడు నవ్వడం మనకు తెలుసు. భూమి చుట్టుకోలతలో నాలుగో వంతు ఉండే చంద్రుడు, ఒక మానవుని లాగా పక్కున నవ్వడం ఏమిటో ? ఈ మొత్తం కధలో లాజిక్ ఎంత ఆలో చించిన అర్ధం కాదు. ఎవరినైనా అడుగుదామంటే అది మన పురాణ కధలు , వాటికీ అర్ధాలు వేత్తక్కుడదు అంటారు.  ఈ అనుమానం నాకు చిన్నతనం లో వచ్చింది,  ఈ రొజూ పూజలో ఇదే ప్రశ్న పిల్లల దగ్గరనుండి ఎదురైంది, నాకు తెలుసు ఈ కధని వినాయక చవితి రొజూ చదవండి, అంతే కానీ ఈ ప్రశ్నలు అడగద్దు అని చెప్పడం తప్ప ఇక ఏమి చేయలేను. 

No comments:

Post a Comment