క్రిందటి వారం నేను మిల్వాకీ స్టేట్ కి వెళ్ళాను. అక్కడ హిందూ మందిర్ ఒకటి ఉంది. అక్కడొక హోమం జరిగింది. హోమం అంత అయిన తర్వాత, అక్కడ పూజారులతో కొంత సేపు మాట్లాడదామని వెయిట్ చేశాను. ఒక పూజారి కలిస్తే అతనితో మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పటికి పూజ అంత అయి చాల సేపైంది, ఎవరిమటుకు వాళ్ళు ఇళ్ళకు వెళ్లి పోతున్నారు. పూజారి తో కుశల ప్రశ్నలు మొదలయ్యాయి. మీరు ఎక్కడుంటారు అంటే మీరేక్కడుంటారు అని కబుర్లు సాగాయి. మేము ఇలా మాట్లాడుతుండగానే, వేరొక భక్తుడు మాతో కలిసాడు. అతను కూడా మీరేక్కడుంటారు అని కబుర్లలో పడ్డాడు. అంత వరకు బాగానే ఉంది కానీ , ఉన్న పళంగా ధడేలు మని ఎవరో పడిపోయి న చప్పుడు. నా పక్కన మాట్లాడుతున్న మరో భక్తుడు కనిపించలేదు. పూజారి కళ్ళు మూసుకొని ఏదో శ్లోకం చదవడం మొదలు పెట్టాడు. కొన్ని క్షణాల తర్వాత అది ఆస్వీర్వాదం అని అర్ధం అయింది. అది పూర్తి అవగానే, కింద నుంచి పైకి లేచిన భారీ మనిషి, ఎక్క్కడ చూసానో ఆలోచించే అవసరం లేకుండానే అర్ధం అయింది ఇంతకుముందు నాతో కలిసి పూజారితో మాట్లాడిన మనిషి అతనే అని. ఆస్వీర్వాద శ్లోకం అంతగా అర్ధం కాకపోయిన, అంత కంటే పెద్ద అనుమానం, నా పక్కనున్న మనిషి , ఉన్న పళంగా అలా పూజారి కాళ్ళమీద ఎందుకు పడ్డాడో తెలీలేదు.
అదేంటి ఇందులో అర్ధం కాకపోవడం ఏంటి, పూజారి అంటే ఎవరు? సాక్షాత్తు దేవుడి ప్రతిరూపం, అలా కాళ్ళ మీద పడడంలో తప్పేంటి అనే వాళ్ళు చాల మంది వున్నారని నాకు తెలుసు. కానీ అసలు కధంతా ఇక్కడే ఉంది. కాళ్ళ మీద పడే భక్తుడు , పూజారి నుండి ఆశించేది ఏమిటి? ఆ సదరు భక్తుడిని పూజారి దీవించాలి, అదికూడా ఒక సంస్కృత శ్లోకం తో దీవిస్తే మరీ మంచిది!. నీల మీద బొక్క బోర్ల పూజారి కాళ్ళమీద పడిన భక్తుడికి ఆ సమయంలో అంత కన్నా పెద్ద కోరికలు ఏమి ఉండవు, పూజారి తనను దీవించాలి, తన కుటుంబాన్ని దీవించాలి అంతే. అది సరే కానీ ఓ భక్తుడా నువ్వేమి ఘనకార్యం చేసావని నిన్ను దీవించాలి? పూజారిని చూసావు, ధడేల్ మని కాళ్ళ మీద పడ్డావు, అంతే! నిన్ను దీవించాలి. నువ్వు పచ్చగా ఉండాలని దీవించాలి, నువ్వు చేసిన సర్వపాపాలు నశించాలి అని దీవించాలి, సకల సంపదలు ప్రాప్తించాలి అని దీవించాలి.
దేవుడికి పూజ ఎందుకు చేస్తావు? పూజ చెయ్యడం అంటే, దేవుడిని సంతోష పెట్టడం. దేవుని గుణ గణాలు వర్ణించడం. దేవుని గొప్పదనాన్ని కీర్తించడం, అష్తోతరం తో గాని , శతనామార్చన తో గాని, సహస్రనామార్చన తో గాని దీవున్ని కీర్తించడం. నానా విధ ఫలం లతో పూజించడం, అంగ వస్త్రం సమర్పించి , తామ్బులాది సత్కార్యాలు తో సేవించడం. ఇన్ని పనులు చేసి, తర్వాత నీ కోరిక చెప్పుకొంటే, నువ్వు చేసిన సేవల ద్వార ఆ భగవంతుని ద్రుష్టి నీ మీద ప్రసరించి, ఆయన ఆనందించి , నిన్ను అనుగ్రహించి తద్వారా నీకు మేలు జరుగుతుంది అని, దేవుణ్ణి నమ్మే మనలాంటి వాళ్ళందరి నమ్మకం. నీ కష్టానికి తగ్గ ఫలితం ఆశించడం ఎంత మాత్రం తప్పు కాదు. నువ్వు దేవుని కోసం కష్ట పడు , నీకోసం దేవుడు కష్ట పడ తాడు , చాల సులువైన విషయం.
your thinking is good
ReplyDelete