ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఆకాసంలో ఉన్న నక్షత్రాల కన్నా ఎక్కువ దేవుళ్ళున్నారు మనకు. మన వాళ్లకు దేవుళ్ళు చాలక ఇంకా సృష్టిలో మనకు చేరువులో ఉండే జీవ రాసులన్నిటిని కూడా దేవుళ్ళుగా చేసే సారు. ఇది ఎవరు ఎందుకు చేసారో తెలుసుకోవడం మాములు విషయం కాదు. తెలుసుకొనే అవకాసం కూడా లేదు. మనలో ఒక్కరైన "మనకు ఉన్న దేవుల్లెంతమంది" అంటే ఒక్క రోజులో లెక్క వేసి చెప్పగలరా? చెప్పి ఒప్పించగలరా?
మనకు రొజూ పాలిచ్చె ఆవుని కామధేనువు చేసారు, కుక్కని కాలభైరవుడిని చేసారు, పాముల సంగతి ఇక చెప్పక్కరలేదు. గూటిలో ఉన్న సాలె పురుగు, ఏనుగు, వరాహం, తాబేలు, పులి , సింహం , మర్రి చెట్టు, వేపచెట్టు ఇలా ఒకటేమిటి సమస్త ప్రాణకోటిని దేవుళ్ళు చేసారు. ఇలా ఇన్ని రకాల దేవుళ్ళని సృష్టించి మనం సాధించుకొంది ఏమిటి? "శ్రీ రామ రామ రామేతి రమే రమే మనో రమే , సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే", అన్న ఒక్క రామ వాక్యం చాలదా వెయ్యి సార్లు రామ నామ జపం ఫలితం ఇవ్వడానికి? ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రం చాలదా? అసలు ఎందుకు ఇన్ని పురాణ కధలు రాసారు?
మన కావ్య రచన ఎంతో గొప్పగా మొదలైంది. ఆది కావ్యంగా రామాయణం ఇప్పటికి ప్రపంచానికి ఆదర్శ ప్రాయమైనది. రామాయణం మీద పరిశోధించి ఎందరో దేశ విదేశీయులు డాక్టరేట్ డిగ్రీలు పొందితే, మరెందరో మోక్షాన్ని పొందారు. వాల్మీకి రచన ఎంతో సౌందర్యవంతమైంది అనన్య సామాన్య మైనది. ఆయన రచనలో ఎక్కడ అతిశయం లేదు. వానర లక్షణాలు వర్ణించినప్పుడు ఇంక దూకుడుగా వ్యవహరించారో , రాముని సీత వియోగాన్ని వర్ణించినప్పుడు, ఒక మానవుడిగా రాముడు పడే భాదను మనవ సహజంగ వర్ణించారు. తర్వాత రాసిన మహా భారతం కూడా అత్యంత సహజంగా రాయబడింది. ఏ సృష్టిలో ఏ జీవికి ఉండవలసిన లక్షణాలు ఆ జీవికి ఆపాదించారు ఈ మహాకావ్యాలలో. ఉదాహరణకు మాయ లేడి విషయానికి వస్తే, అది సీతాదేవి వద్దకు వచ్చి , అక్కడే తిరుగాడుతుంది, లేడి సహజ సిద్దమైన బెరుకు, తడబాటు , వయ్యారం అన్ని ఆ లేడికి ఉంటాయి. అంతే కానీ ఆ లేడి గబుక్కున "నన్ను పట్టుకో " అంటూ మాట్లాడదు. సర్వాంతర్యామి ఐన శ్రీ కృష్ణుడు మాయ జూదం గురించి తెలుసు కోలేకన, మౌనంగా ఉన్నాడు ? తనకి అన్ని తెలిసిన ఎక్కడ తన మాయలు మంత్రాలూ ఉపయోగించలేదు. అత్యంత సహజంగా కావ్య రచన సాగింది.
మరి అంత గొప్ప రచనలు కలిగిన మనం, రాముడు, కృష్ణుడు, శివుడు చాలదన్నట్టు, వేలకు వేలు దేవుళ్ళని ఎవరు సృష్టించారు? బలి చక్రవర్తి కధ మనం ఎన్నో సార్లు విన్నాము. విష్ణు మూర్తి ఒక కాలు భూమి మీద, రెండో కాలు ఆకాసంలో పెడతాడు, అంటే మరి అప్పటికి బలి చక్రవర్తి ఎక్కడున్నట్టు? విష్ణువు ఎక్కడున్నట్టు ? మనకు వేదాలు ప్రామాణికం అంటారు, మరి వేదాలలో ఈ కధలు ఎమన్నా చెప్పారా? మిగతా ఏ మతంలో నైన గుడికి వెళుతున్నాను అంటే ఒక దేవుడి గుడికి అనే అర్ధ వస్తుంది, కానీ మనకు వెంటనే ఏ గుడికి అన్న ప్రశ్న అడగక పోతే అవదు. మన వాళ్ళ ఉహ శక్తికి అంతం లేదు. ఒకటికి ఒకటి అలా సృష్టించుకొంటు వెళ్లి పోయారు. ఇప్పటికి ఆగటం లేదు. అసలు మన దేవుల్లందరి గురించి చదివి, తెలుసుకొని దానిని ఇంకొకరికి చెప్పాలంటే ఒక జన్మకు సాధ్య పడుతుందా?
No comments:
Post a Comment