మీ అందరకు క్రిందటి దత్త పది నచ్చి నందుకు చాల సంతోషం. మీ కోసం ఇంకో తమాషా అయిన దత్త పది, శ్రీ మాడుగుల నాగఫణి శర్మ గారు ఎంతో చమత్కారంతో పూరించిన విధానం చూడండి
------------------------------------------------
దత్త పదాలు: కల్లు, రమ్ము, విష్కీ, సారా
భాగవతంలో శ్రీ కృష్ణుని బాల్య ఘట్ట వర్ణన.
అవధాని: ద్విసహస్రావధాని భ్రహ్మశ్రీ మాడుగుల నాగఫణి శర్మ.
చందస్సు: మత్తేభము
అగుగా కల్లుడు వాడు ఆరయగ నయ్యా యే మహా కాలుడో
నగవుల్ చిందగ రమ్ము రమ్మనుచు చంకన్ యెత్తుకో జాల తాన్
తగ నెవ్వాడు శిరస్సు దూర్చును పతజ్వాలా హవిష్కీలలన్
రగడల్ బాలురతోడ నేల? మనసారా యిట్లు చింతించెదన్
వ్యాఖ్యానము: బలరామ కృష్ణులను గురించి కంసుడు ఇట్లా అనుకుంటున్నాడు
కృష్ణుడు, అయితే నాకు అల్లుడౌగాక. అశరీర వాణి వాక్కు ప్రకారము వీడు నా పాలిటి యముడు. ప్రతి మేనమామా మేనల్లుడిని ముద్దుగా రమ్మని పిల్చి చంకనయెత్తుకొనే విధంగా వీణ్ణి నేను యెత్తుకోలేను. వీడితో పెట్టుకోవడమంటే హవిస్సు అగ్నిగుండములో వేసినతరువాత పైపైకెగసే జ్వాలా కీలల్లో తగుదునమ్మా అని తల తీసుకెళ్ళి పెట్టతమే అవితుంది. యెందుకొచ్చిన రగడలు నాకీ బాలురతో. మనసారా ఈ విధంగా అనుకొంటున్నాను.
No comments:
Post a Comment