అవధాని: ద్విశతావధాని, రాళ్ళ బండి కవితా ప్రసాద్.
చందస్సు: ఉత్పలమాల
సమస్య: కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్
పూరణ:
ఉ. భీత మృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మ బాధచే
నాతికి పెండ్లి కాదని వినాశన మౌనని నేస్తులెంచుచున్
జాతకముల్ గుడించగ భిషక్కుని సాయము నంది మందొమా
కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్
వ్యాఖ్యానము: అందమైన లేడి కన్నుల వంటి కన్నులున్న ఒక సుందరి యౌవనము ప్రవేశించి వివాహానికి దగ్గరౌతున్న సమయంలో చర్మవ్యాధికి లోనై అందవికారముగా కనిపించటము వలన వివేచన అంటె యేమి చెయ్యలో తొచని స్థితికి పోయింది. ఆమె స్నేహితురాండ్రు యీమెకు పెండ్లి కాదని విచారిస్తూ ఆలోచించి ఒక జోతిష్కుడిని సంప్రదించి ఈమెకి వివాహమయ్యే సూచనలేమన్నా కనపడుతున్నాయా జాతకము ప్రకారము అని ప్రశ్నించగా అతడు ఆమెకు తప్పక వివాహము అవుతుందని చెప్పాడు. దాంతో వాళ్ళు విచారము మాని ఆమెని ఒక భిషక్కునికి అంటే వైద్యుడికి చూపించి అతనిచ్చిన మందో మాకో యిప్పించగా ఆమె అది తిని చర్మ వ్యాధిని పోగొట్టుకొని చక్కగా వివాహము చేసుకొంది అనేది అవధాని వరేణ్యుల కల్పన సమస్యను విడగొట్టడానికి. యిందులో మందొమాకో అనే పదం ఉపయొగించి సమస్యని తేల్చేశారు. పరిశీలించండి.
తాతకు నవ్వకున్ దినము దప్పక సేవలు చేయుచున్నదే
ReplyDeleteనీతిని దప్పయన్యమును నేరదు సద్గుణవంతురాలిదే
భూతలమందు శాశ్వతమె పొంకములంచు, గుణమ్ముమెచ్చి యీ
కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగన్