- వేమన- ఈ పేరు వినని ఆంధ్రులు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆటవెలది ఛందస్స్సులో సామాన్యులందరికీ అర్ధం అయ్యే రీతిలో ఎంతో గొప్ప భావాలను పొందికగా వేమనాచార్యులు అమర్చిన తీరు అనితర సాధ్యం ఐనది. ఇలాంటి వేలకొద్ది పద్యాలూ రాసిన శ్రీ వేమన చార్యులు జన్మదినం ఈ రోజు . ఆయన నందన నామ సంవత్సరము, ఆశ్వయుజ శుద్ధ పౌర్ణమి రోజున జన్మించారు.
- ఆయన తన జన్మస్తలాన్ని తనే ఒక పద్యంలో వివరించారు.
- నందన సంవత్సరమున
- బొందుగ నాశ్వ(యు) జ శుద్ధ వున్నమినాడున్
- బృందార కాద్రి సేతువు
- నందున నొక వీర వరుని జన్మము వేమా!
- బృందారక =ఘనమైన
- అద్రి=కొండల
- సేతువు = సముద్రాన్ని కానీ , నదిని కానీ రెండుగా చీల్చేది (భూమి). (రామ సేతు మనకు శ్రీలంకకు మధ్య నున్న సముద్రాన్ని చీలుస్తూ నిర్మించినది . )
- పై పద్యంలో వేమన ఆచార్యులు రెండు గొప్ప కొండల నడుమనున్న సేతువు తన జన్మ స్థలం అని చెప్పారు. రెండు కొండలను నడుమ నుండి పారే నదులు మనకు చాల ఉన్నాయి , ఉదాహరణకు కృష్ణ నది, కానీ అవి సేతువు ఏర్పరచలేదు . మన ఆంధ్రప్రదేశ్ లో అలాంటి ప్రదేశం ఉండేది కడప జిల్లాలో వేంపల్లి కి దగ్గరలో నున్న " గండి" లో 'వీరన్న గట్టు పల్లి" అనే గ్రామం వేమన గారి జన్మస్థలం. పాపాగ్ని నది ఇక్కడి శేషాచల కొండల శ్రేణిని రెండుగా చీల్చి సేతువుని ఏర్పరుస్తుంది. ఆ చిన్న సేతువులో ఎన్నో వందల ఏళ్ళ నుండి ప్రజలు నివాసం ఉంటున్నారు. చాల పరిశోధనల అనంతరం ఈ విషయాన్నీ కొనుక్కోబడ్డాయి.
- వేమన గొప్ప తత్వవేత్త మాత్రమే కాదు, పరసువేది విద్య తెలిసిన గొప్ప రసాయన శాస్త్రజ్ఞుడు, ఆయన పద్యాలలో మనకు తెలిసినవి కేవలం నీతి పద్యాలే కానీ ఆయన రచనలలో పసిడిని తయారు చేసే విధానం ఉంది అని ఇప్పటికి ఎంతో మంది నమ్మకం. అది నిజం కాకపోవచ్చు కూడా! బంగారం ఒక మూలకం. దీని అటమిక్ నెంబర్ 79 , రాగి ఆటోమిక్ నెంబర్ 29 , పాదరసం ఆటోమిక్ నెంబర్ 80 . ఇలా ఒక మూలకం నుంచి మరొక మూలకం తయారు చెయ్యొచ్చు అని శాస్త్రీయం గ నిరూపించబడింది. పాదరసం యొక్క ఒక ఆటోమిక్ నెంబర్ తగ్గించి బంగారం తయారు చెయ్యొచ్చు అని రూథేర్ ఫోర్డ్ ప్రయోగాలలో తెలిసింది అంటారు. కానీ ఇది చాల ఖర్చుతో కూడుకొన్న పధ్ధతి.
- మూలకాలు శాస్త్రీయంగా నిర్వచించిన బాయిల్ కూడా బంగారం వివిధ మూలకాల సమ్మేళనం అని భావించాడు. తర్వాత బంగారానికి ఒక మూలకం గ భావిస్తూ వచ్చారు. మన భారతీయులకు ఇలా మూలకాలను మార్చే విద్య చాల కాలంనుండి తెలుసు అని నమ్మకం. అందులో వేమన ఒకరు. నిజానికి పాశ్యాత్తులకు అంటూ పట్టని ఎన్నో విద్యలు మన భారతీయులకు తెలుసు. మన నుంచి యోగా నేర్చుకొని, మన చేత డబ్బులు కట్టించుకొని , మన విద్య మనకే నేర్పే వాళ్ళు చెప్పిందే వేదం అని నమ్మినంత కాలం మన వల్ల గొప్ప తనం మనం గుర్తించలేము. వేమన రాసిన పద్యాలలో విషయాలు ఆయన ఒక సాధారణ కవి కన్నా , ఎంతో అసాధారణ మేధావి , గొప్ప సిద్ద యోగి అని పిస్తాయి , మచ్చుకు కొన్ని పద్యాలు.
- పాలు పోసి వండ బరిగెడి తగరంబు
- వేళ యెరింగి దింప వెండియగును
- కల్ల కాదు నిజము కరకంట నీ యాన
- విశ్వదాభి రామ వినుర వేమ
- ఉప్పు చింతపండు నూరిలో ఉండగ
- కరువదెల వచ్చే కాపులారా
- తాళకం బెరుగరో తగరంబు నెరుగరో
- విశ్వదాభి రామ వినుర వేమ
- ఇంటి వెనుక తీగ ఇంగ్లీకముండగా
- పాదరసం గలుగ పసిడి యేల?
- సత్తు పొత్తు చేసి సాధింప వచ్చురా
- విశ్వదాభి రామ వినుర వేమ
- పైకి ఎంతో సహజంగా ఉన్న వేమన పద్యాలలో ఎన్నో రహస్యాలు దాగున్నాయి అన్న మాట మాత్రం నిజం. మన భారత దేశంలో ఆర్యభట్ట, నాగార్జునుడు, చాణక్యుడు అంతటి గొప్ప తెలివి తేటలున్న వాడు యోగి వేమన. ఎంత మేధావి కాకపోతే దాదాపు 700 సంవత్సరములు గడిచినా ఆయన రాసిన పద్యాలూ, చేసిన హితబోధలు ఇప్పటికి చెక్కు చెదరకుండ ఉన్నాయి. ఓ వేమన నీకు మా తెలుగు జాతి నమస్కారములు. నీ పుట్టిన రోజును ఎప్పటికి ఘనం గ జరుపుకొంటాం!
Thursday, October 21, 2010
యోగి వేమన నీకు మా జన్మదిన శుభాకాంక్షలు
Sunday, October 3, 2010
సినిమా రివ్యూలు డబ్బుకు అమ్ముడు పోతున్నాయా?
సినిమా రివ్యూలు రాయడం మంచి బిజినెస్. రివ్యు టైం లో ఇంటర్నెట్ జనం ఖచ్చితంగా వెబ్ సైట్లు చూస్తారు. ఆ వెబ్సైటు లలో అసలు మేటర్ పావు పేజి ఉంటే, యాడ్స్ ఫుల్ పేజిలు ఉంటాయి. మనం ఒక్క సారి క్లిక్ చేస్తే మెయిన్ పేజి తో పాటూ పది, పదిహేను యాడ్ విండోస్ ఓపెన్ అవుతాయి. వాటిల్లో కొన్ని యాడ్స్ ఆటోమాటిక్ గ మాట్లాడడం మొదలు పెడతాయి. ఒక్కో యాడు విండో క్లోజ్ చేసుకొని, స్పీకర్లు ఆఫు చేసి , ఇక రివ్యూ చదవడం మొదలు పెడతాం. రివ్యూ రాసే వాళ్ళ ఉదేశ్యం సినిమా బాగుందా లేదా అని ఒక్క మాటలో తెల్చేయ్యడం. దానికి కొంత రేటింగ్ ఇవ్వడం. ఆశ్చర్యం ఏమిటి అంటే, వీల్లేమి సెన్సార్ వాళ్ళు కాదు కదూ రేటింగ్ ఇవ్వడానికి!? ఏదో వాళ్ళకు నచ్చినట్లు వాళ్ళు రేటింగ్ ఇస్తారు. అయిన వాళ్ళు మాత్రం ఏమి చేస్తారు? సినిమా బాగుంటే రేటింగ్ బాగుంటుంది , లేదంటే లేదు అని మనలాంటి వాళ్ళు సరి పెట్టుకొంటారు. నిజంగ జరిగేది అదేనా?
నాకు తెలిసి మనందరం జీవితంలో సినిమా ఒక భాగం. మంచి సినిమా చూడాలి, చూసి నలుగురికి గొప్పగా చెప్పాలి, దాని గురించి పొగడాలి, సినిమా బాగోలేక పొతే తీసిన డైరెక్టర్ ను, ప్రొడ్యూసర్ ను, హీరో హీరోయిన్ లను విశ్లేషించి, ఇంకా ఎలా బాగా తియ్యొచ్చు అని మాట్లాడాలి, ఇవన్ని మన సినిమా జీవితంలో నిత్య చిత్రాలు. సరే తెలుగు సినిమా రిలీజ్ అయ్యింది, మార్నింగ్ షో పూర్తీ అయ్యింది, కొన్ని సంవస్సరాల క్రితం , హాలులో నుండి బైటకు వచ్చే మార్నింగ్ షో వాళ్ళు , సినిమా బాగుందో లేదో చెప్పేవాళ్ళు. అది కాకపోతే, మొదటి రొజూ పూర్తి అయ్యాక సినిమా టాకు ఎలాగు తెలుస్తుంది. ఆ టాకు తెలిస్తే, పది మంది బాగోలేదు అంటే, ఇక ఆ సినిమా ఇప్పట్లో చూడనవసరం లేదు. సినిమా హిట్ అవడానికి కాక పోవడానికి ఇదే కదా కారణం.
ఇప్పుడు మన సినిమాలు దేశ విదేశాలలో ప్రదర్శిత మవుతున్నాయి. విదేశాల్లో , ఉదాహరణకు అమెరికా లో సినిమా టాకు తెలుసు కోవాలంటే, వెబ్సైటు రివ్యూలు ఒక్కటే మార్గం. మన దగ్గర ఐతే , ఒక కాఫీ షాప్ లోనో, హెయిర్ సెలూన్ లోనో, ఎక్కడో ఒక చోట సినిమా టాకు గురించి తెలుస్తుంది, మరి అమెరికా లాంటి దేశాల్లో టాకు తెలియాలంటే రివ్యూలు చదవక తప్పదు. మరి రివ్యూ రాసే వాళ్ళు మనకు అంతా నిజమే రాస్తున్నార? వాళ్ళు నిజమైన రివ్యూ రాయాలని మనం ఎందుకు ఆశించాలి? అసలు రివ్యూ చదవకుండా సినిమాకు వెళితే ఏమవుతుంది? రివ్యూ చదవకుండా, పెళ్ళాం పిల్లలతో లేదా నలుగురు ఫ్రెండ్స్ తో ఒక ౩౦ మైళ్ళ దూరంలో, (కొంతమంది ఇంకా దూరం నుండి వస్తారు, నాకు 400 మైళ్ళు ట్రావెల్ చేసిన సినిమా ప్రేమికులు తెలుసు) ఉన్న సినిమా హాలుకు వెళ్లి, తీర సినిమా బాగోలేక పోతే..? తను ఒక్కడే కాకుండా, తనతో వచ్చే ఫ్రెండ్స్ నుంచి మాట పడాలి, సినిమా బాగోలేదు అనే ఒక బాధ, వీకెండ్ వేస్ట్ అయ్యిందనే ఒక బాధ, ఫ్రెండ్స్ కి చెత్త సినిమా చూపిస్తే వాళ్ళు వేసే సెటైర్లు తో మరో బాధ. అసలు ఈ బాధలు ఏవి లేకుండా ఏదైనా రివ్యూ చదివి, ఆ రివ్యూ రాసే వాడు , కేక , కత్తి లాంటి భాషతో రివ్యూ రాస్తే ఇక ఒకటే సంతోషంతో సినిమాకు వెళ్ళొచ్చు. సినిమా బాగోలేక పోతే, డైరెక్టర్ తో పాటూ రివ్యూ రాసిన వాడిని తిట్టొచ్చు, ఫ్రెండ్స్ టార్చర్ నుండి తప్పించు కోవచ్చు. చూసారా ఎన్ని లాభాలున్నాయో?
సరిగ్గా ఈ బలహీనత మీదే కొన్ని మిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతోంది. రివ్యూ రాసే వాళ్ళు మొదట నిజాయీతి గా రాయడం మొదలు పెడతారు. సినిమా బాగుంటే బాగుంది అంటారు , లేక పోతే లేదు అంటారు. ఇది చదివి సినిమాకు వెళ్ళేవాళ్ళు , రివ్యూ రాసిన వాడు చెప్పినట్టుగ సినిమా ఉండడంతో, రాసే వాడి మీద నమ్మకం ఉంచుకుంటాడు. ఇలా ఒకటికి రెండు సార్లు జరగగానే , ఈ సదరు అమెరికా ప్రేక్షకుడికి అంతులేని నిధి దొరికిన ఆనందం. సినిమాకు వెళ్ళాలంటే మొట్ట మొదట చేయవలసిన పని రివ్యూ రాసే వెబ్సైటు చూడడం , రేటింగ్ చూడడం, చిన్న రివ్యూ మొత్తం చదివితే సినిమా మీద ఒక అవగాహన ఏర్పడి , చూస్తున్న్నప్పుడు మజా పోతుంది అని , కత్తి , కెవ్వు , కేక అనే పదాలు కోసం వెతకడం. రేటింగ్ స్టారు, కెవ్వు ఉంటే చాలు , ఇక మంచి ఊపు మీద సినిమాకు బయలు దేరడం, తనతో పాటు ఒక పది మందిని వెంటేసుకుని పోవడం. ఇద్దరు విదేశీ సిని ప్రేమికులు మాట్లాడుకోన్నప్పుడు మొదట వచ్చే మాట "ఆ సినిమా రేటింగ్ ఎంత" అని ఉంటే మీరు అర్ధ చేసుకోవచ్చు, జనం రివ్యూలకు ఎంతగా అలవాటు పడిపోయారో!.
ఈ రివ్యూలు రాసే జీవులు పది సినిమాలకు ఉన్నదున్నట్టు చెప్పి, తర్వాత రెండు సినిమాలకు తప్పుడు రేటింగ్ ఇస్తే, పరిస్థితి ఒక్క సారి ఊహించండి. ఈ మధ్య వచ్చిన " ఏం మాయ చేసావే" సినిమాకు జీవులు ఇచ్చిన రేటింగ్ చూడండి, గొప్ప ఆంధ్ర అనే ఇంకో వెబ్సైటు కూడా అదే సమయంలో ఇచ్చిన రేటింగ్ చూడండి. రెండు కూడా విపరీతంగా ఈ సినిమాను పోగిడాయి. ఇప్పడు అందరకు తెలిసిన విషయమే, ఈ సినిమాకు ఓవర్ రేటింగ్ ఇచ్చారు అని. కానీ అప్పటికే, ఎన్నో వందల మంది ఈ ఓవర్ రేటింగ్ వల్ల ఈ సినిమా ఎక్కువ డబ్బు పెట్టుకొని చూసారు. ఇలా ఒక్కో సినిమాను విశదీకరించడం కష్టం. ఒక్క సారి రోబో సినిమా గురించి చూద్దాం. అమెరికా చరిత్రలో ప్రేక్షకులనుండి ఎక్కువ టికెట్ డబ్బులు, ముక్కు పిండి వసూలు చేసింది రోబో సినిమానే! ఈ రోబో సినిమాకు చాల హై రేటింగ్ ఇచ్చారు. రేటింగ్ రావడం తోనే సినిమా టికెట్ డబల్ చేసారు, సినిమా యాడ్లలో, రేటింగ్ , రివ్యూ మొత్తం వాడుకొన్నారు. జీవి ఈ సినిమాకు ఎక్కువ రేటింగ్ ఇచ్చాడు, గొప్పగా రివ్యూ రాసాడు, ఇదంతా సినిమా పబ్లిసిటీ కి వాడు కొన్నారు. కొంచెం తక్కువ రేటింగ్ ఇస్తే, మొత్తం రివ్యూ కాకుండా, రివ్యూ లో బాగున్న మాటలు కాపీ పేస్టు చేసి పబ్లిసిటీ కి వాడుకొంటారు. ఇంత చేసి చూస్తె, సినిమా చూసినవాళ్లు, ఈ సినిమాకు కూడా ఓవర్ రేటింగ్ ఇచ్చారని, 25 $ పెట్టి చూడాల్సిన సినిమా కాదని జనాలంతా మొత్తుకొన్నారు. ఈ రివ్యూలు రాసే వాళ్ళకు తెలుసు ఓవర్ రేటింగ్ ఇచ్చామని, కానీ చాల అమాయకత్వం నటిస్తారు. రివ్యూ మాత్రమే కాకుండా, రివ్యూను సప్పోర్టు చేసి కధనాలు ప్రచురిస్తారు. వేరే వెబ్సైటు వాళ్ళు ఈ సినిమా అద్భుతం అన్నారు, కొన్ని ప్రాంతాల్లో టికెట్స్ పది రోజులవరకు అయిపోయాయి అంటారు. ఈ విధంగా వాళ్ళు రాసిన రివ్యూకు సపోర్ట్ వాళ్ళే ఇచ్చుకొంటారు.
అమెరికా లో తెలుగు సినిమా బిజినెస్ కి చాల మార్కెట్ ఉంది. ఇక్కడ రిలీజ్ ఇన ప్రతి భారతీయ సినిమాలకు పది డాలర్లు నుండి 20 డాలర్ల వరకు టికెట్ ఉంటుంది. అమెరికాలో మల్టీ ప్లెక్ష్ మోడల్ హాలులు ఉంటాయి. ఇక్కడ ప్రతి ఒక్క సినిమాకు ఒక హాలు కాకుండా, ఒకే బిల్డింగ్ లో చాల సినిమా స్క్రీన్లు ఉంటాయి. ఒక్కో స్క్రీన్ కి (హాలు) 200 , అంతకన్నా ఎక్కవగా సీట్స్ ఉంటాయి. హాలు మొత్తం ఫుల్ ఐతే , పది డాలర్ల టికెట్ అయితే ఒక షోకి 2000 $ వస్తుంది. నిన్న వచ్చిన రోబో సినిమాకు టికెట్ 20 $, కాబట్టి ఒక షో కి మొత్తం 4000 $. ఒక్క మిన్నెసోట లో రోబో ప్రస్తుతానికి తెలుగు లో 6 షోలు . ఇవి కాకుండా హిందీ, తమిళ్ , ఇలా అన్ని కలుపుకొని దాదాపు పదహారు షోలు. అన్ని షో లు ఫుల్ అయితే మూడు రోజులకు 64000 $, హాలు సగం నిండిన కనీసం ౩౦౦౦౦$. అంటే దాదాపు పదమూడు లక్షల రూపాయలు!. అది కూడా ఒక్క ఏరియ లో , ఇక US మొత్తం లెక్క పెడితే ఎంతుంటుందో? ఈ లెక్కలు ఎందుకు చెప్పాము అంటే , అసలు మొదటి మూడు రోజుల్లో ఎంత మొత్తం ఎలా రాబట్టుతారు? మొదటి మూడు రోజుల్లో సినిమా చూసిన వాళ్ళంతా రివ్యూ చదివి వచ్చిన వాళ్ళే. సినిమాకు 162 కోట్లు ఖర్చు పెట్టారు. మరి ఆ డబ్బు త్వరగా రాబట్టుకోవాలంటే ఉన్న ఒక్కే ఒక్క మార్గం రివ్యూ రాసేవాళ్ళను కొనడమే. నిజమే కదా? మూడు రోజుల్లో కొన్ని ఏరియాలలో ఒక కోటి పైగా డబ్బులు రాబట్టేవి రివ్యూలే కదా? ఆ రివ్యూ రాసేవాడికి కొన్ని ఏరియాలలో వచ్చే డబ్బు మొత్తం ఇచ్చిన, మిగతా ఏరియాలలో చాల డబ్బులు రాబట్టు కోవచ్చు. ఒక్క పాయింట్ రేటింగ్ పెంచితే ఎన్ని మిల్లియన్ డాలర్ల వ్యాపారం జరుగుతుందో..? ఈ రివ్యూ రాసే వాళ్ళకు , వెబ్సైటు లో యాడ్ ల వల్ల డబ్బులు, రివ్యూ రాయడానికి డబ్బులు, మన కంపూటర్లు పాడుచేసిన యాడ్ వేర్ వల్ల డబ్బులు... ఇంకా ఎన్నో..? నాకు మాత్రం ఈ రివ్యూలు మన సినిమా బలహీనత మీద ఆడుతున్న పెద్ద జూదం అనిపిస్తున్నాయి. నిజమేనా ..? ఒక్క సారి చూద్దాం
రివ్యూలు రాసే వాళ్ళను గమనించండి, వాళ్ళు అన్ని సినిమాలకు రివ్యూలు వెంటనే రాయరు. జీవులు మధ్యలో కొన్ని సినిమాలు స్కిప్ చేస్తారు , అంటే ఏమిటి అర్ధం? ఎంతో మంది అమెరికా , మరియు విదేశి సిని అభిమానులు రివ్యూలు కోసం చూస్తారని వాళ్ళకు తెలుసు , కానీ అన్ని సినిమాలకు రాయరు, ఆ సినిమాకు సంభందించి పెద్ద యాడు , మెయిన్ పేజిలో ఉంటుంది కానీ రివ్యూ ఉండదు. కొన్నిటికి వెంటనే రాస్తారు, ఒక పది సినిమాలకు ౩ అంతకన్నా తక్కువ రేటింగ్ ఇస్తారు, తర్వాత సినిమా బాగోలేక పోఇన 4 లేదా 4.5 రేటింగ్ ఇస్తారు. అది చాలక తప్పకుండ చూడండి అని గొప్పగా పొగుడుతారు . దీనిని బట్టి మీరు అర్ధం చేసుకోవచ్చు. ఈ తప్పుడు రేటింగ్స్ వల్ల మొసపోయిన సాటి సిని అభిమానులకు నా సానుభూతి.

Monday, September 20, 2010
దేవుడు నీకు ఎలా కనిపించాలి?
దేవుడు ఎక్కడున్నాడు ? ఉంటే కనపడడే? ఇది ప్లహలాదుడి కాలం నాటి ప్రశ్న!. ఈ రాళ్ళలో ఉన్నాడా? ఈ పువ్వులో ఉన్నాడా ? ఇలాంటి ప్రశ్నలు వేస్తె, కొంచెం పెద్దరికం వహించి, పెద్దలు అనబడే వాళ్లు , ఒక్క చిరునవ్వు నవ్వి , పిచ్చి వాడ!, మూర్ఖుడా, దేవుడు ఎక్కడో లేడుర నీ మనసులో ఉన్నాడు, ఈ సమస్త ప్రాణికోటిలో ఉన్నాడు, అని వేదాంతం లాంటిది చెబుతారు కానీ విషయాన్నీ సూటిగా చెప్పరు. ఆ చెప్పేవాళ్ళకు దేవుడు ఎక్కడ ఉన్నాడో ఏమితెలుసనీ ? నిజానికి వాళ్ళకే కాదు, మనకేవ్వరకు తెలీదు. తెలిస్తే మీరు కంప్యూటర్, ఈ బ్లాగ్ వదిలి , దేవుడున్న చోటికి పరిగెత్తరూ? కంప్యూటర్ మీది కాకపోతే పరిగెత్తుతార? సరే మీ ఇష్టం.
అదిసరే , మన టాపిక్ దేవుడు ఎక్కడున్నాడని కాదు!, అసలు దేవుడెలా ఉంటాడు , వొకవేళ హటాతుగా కనిపిస్తే మనం గుర్తు పట్టగలమా అని? ఒక్క సారి గూగుల్ మ్యాప్ ఓపెన్ చెయ్యండి. మీరు ఉన్న ఖండం, దేశం గుర్తు పట్టండి. ఇంకా జూమ్ చెయ్యండి, మీరు ఉన్న పట్టణం, మీ ఊరు, మీ వీధి, మీ ఇల్లు , ఇక మీరు. కనిపిస్తున్నార? లేదే ..? మన భూమి మీద మనం ఒక చిన్న బిందువు లాంటి వాళ్ళం , అది కూడా గుర్తు పట్ట లేనంత. అది సరే కానీ దీనికి , దేవుడు కనిపించడానికి సంభందం ఏమిటి?
మరి దేవుడంటే ఎవరు? మనలను సృష్టించాడు, మన పొరుగు వాళ్ళను సృష్టించాడు, మన ఊరు, పట్టణం, దేశం, ఈ సముద్రాలూ , పక్షులు సృష్టించాడు. అంతెందుకు ఈ మొత్తం భూమిని సృష్టించాడు. ఒక్క భూమేనా!, స్వర్గం, నరకం, వైకుంటం , ఇంద్రలోకం లాంటి వన్ని సృష్టించాడు. ఇవే కాకుండా, మన భూమి లాంటి కొన్ని లక్షల గ్రహాలు సృష్టించాడు. సూర్యుడు లాంటి కొన్ని కోట్ల నక్షత్రాలు సృష్టించాడు. కేవలం సృష్టించడమే కాకుండా , వాటిని నిరంతరం సంరక్షిస్తున్నాడు. బాబు..., ఇక చాలు... దేవుడు , దేవుడే అని ఒప్పుకోన్నారా..? సరే మరి.
వీటన్నిటిని సృష్టించాలి అంటే, దేముడు ఇంకా ఎంత పెద్దగ ఉండాలి? భూమిని సృష్టించాలి అంటే, భూమి కన్నా పెద్దగ ఉండాలా లేదా? సూర్యున్ని సృష్టించాలి అంటే, సూర్యుని కన్నా పెద్దగ ఉండాలా లేదా? ఈ సమస్త విశ్వాన్ని సృష్టించాలి అంటే, విశ్వం కన్నా పెద్దగ ఉండాలా లేదా ? అక్కర లేదా? ఒక చిన్న ఉదాహరణ , మీకు కొన్ని ఇటుకలు ఇచ్చి ఒక దాని మీద ఒకటి పరచమంటే ఎంత వరకు పరచగలరు? మీ అంత ఎత్తు వచ్చే వరకు, తర్వాత ఇక మీ వల్లకాదు. మరి విశ్వాన్ని మొత్తం సృష్టించాలి అంటే, దేవుడు మనలా చిన్నగా ఉంటే సరిపోదు కదా. మరి అంత పెద్ద దేవుడిని, గూగుల్ మ్యాప్ లో కనపడని నువ్వు ఎలా చూడగలవు? అంటే నీకోసం దేవుడు మనిషి రూపం ధరించాలి అన్న మాట . అప్పడు నీ ఎదురుగ నిలబడితే ఒక మనిషి తో మాట్లాడినట్టు మాట్లాడతావన్న మాట. దానికోసం నువ్వు ఎదురు చూస్తున్నావా? మరి నీ పక్క వాళ్ళలో దేవుడిని చూడు అంటే మనం వినం, మనం ఎప్పుడు చూడని వాళ్ళు వచ్చి నేను దేవుడిని అంటే నమ్మం, మరి దేవుడు నీకెలా కనిపించాలి. ఈ సమస్త ప్రాణికోటి లో మరే జంతువు గని, పక్షి లా గని కనిపిస్తే గుర్తు పట్టలేవు, మరి ఎలాగా ? అన్ని నీకు అనుకూలంగా మర్చుకున్నావు కదా ఓ మనిషి. దేవుడిని నమ్మావు, ఆయనకు మనిషి రూపం ఇచ్చావు, ఇంత విశాల సృష్టికి అధిపతి, నీకు ఎదురుగ రావాలి అన్నావు, ఆ వచ్చేదేదో మనిషి రూపంలో రావాలి అన్నావు, ఒక్క గాలి వాన వస్తేనే చెల్లా చెదురై పారిపోయే నువ్వు, ఆ అనంత సృష్టికి అధిపతి యొక్క శక్తి తట్టుకోగలవా? అప్పుడు కూడా దేవుడు నీకు సహాయం చేసి , తన శక్తి తగ్గించుకొని నీకు మరో మానవుడుగా, (నీ పక్కింటి వాడుగా మాత్రం కాదు) కనిపించాలి, నీతో మాట్లాడాలి, నువ్వు ఆయనను కుశల ప్రశ్నలు వేసి , నిన్ను అయన ప్రశ్నలు అడిగి (అక్కడికి ఆయనకు నీ గురించి తెలియనట్లు!), కొంత సేపు మాట్లాడుకోవాలి. తర్వాత మోక్షం గురించి అడగాలి ... అబ్బో ఇంకా చాల కోరికలే నీకు .. , దేవుడి పని దేవుడిని చేసుకోనియకుండా, నాకు ఒకసారి కనిపించు అంటే ఆయన నీకోసం ఎంత కష్టపడాలో కదా! అందుకే మన పెద్దలు , ఈ సమస్త ప్రాణి కోటిలోను దేవుడున్నాడు అన్నారేమో ? ఆలోచించు నేస్తం.

Sunday, September 19, 2010
నేను స్వామిజి ఎందుకు కాకూడదు?
నిన్న మినియాపోలిస్ లో ఒక టెంపుల్ కి వెళ్ళాను, అక్కడ ఒక ప్రఖ్యాత స్వామిజి వస్తున్నారని అరగంట ముందునుంచి హడావిడి మొదలు. టెంపుల్ కమిటీ మెంబర్స్ మొఖంలో ఒక సరదా, ఉత్సాహం , బిజీగ ఉన్నట్టు బాడీ లాంగ్వేజ్. సీనియర్ కమిటీ మెంబర్ ని జూనియర్ అడుగుతున్నాడు , "వచ్చారా ..? ఇప్పు డు ఎక్కడున్నారు"?, "హ వస్తున్నారు .. ఇంకో పది నిముశలలలో వస్తున్నారంట", వీళ్ళ హడావిడి చూసే గుడిలో మిగిలిన భక్తులకు కొంచెం టెన్షన్ పెరిగింది, నాకు కూడా!
గుడికి కొన్ని కార్లు రావడం, వచ్చిన కార్ల వంక చూసి కమిటి పెద్దలు, అబ్బే.. స్వామిజి ఈ కార్లలో లో రారు అని తేల్చేసారు. తర్వాత వాళ్ళే , " ఆయన టొయోట లో రారు, BMW లో వస్తారంట" అనుకొంటున్నారు. నాలాంటి మిగత భక్తుల మొఖంలో కొంచెం గర్వం తొంగి చూసింది. నిజమే ఇంత దూరం , ఇంత ఖర్చుపెట్టు కొని , స్వామిజి చూద్దాం అని వచ్చిన తర్వాత , తీర ఆయన డొక్కు కార్లో దిగితే మన భక్త హృదయం తట్టుకోగలద? అలాంటి గొప్పవాళ్ళు మనల హోండా లోనో టొయోట లోనో రారు , వాళ్ళకు తగ్గ కార్లు వాళ్ళకు ఉండాలిసిందే.
ఇంతలో గుడిలో ఒక్కసారిగా హడావిడి, స్వామి వచ్చారంటే వచ్చారు అని. ఇంతలో చిరు నవ్వులు చిందిస్తూ , శిష్య పరమాణువు నడిపిన BMW కారులోనుండి, భక్త కోటిని, కారులోనుంచే ఆశ్వేరదిస్తూ స్వామిజి . ఒక డ్రెస్ కోడ్ లాగా , కాషాయ వస్త్రం, మొఖాన వీభూధీ , మెడలో రుద్రాక్ష మాలలు , చేతికి కడియం, వేళ్ళకు పచ్చ, పుష్యరాగం లాంటి ఉంగరాలు , మొఖాన రూపాయి కాసంత కుంకం బొట్టు. ఎంత మంది ఇలా చూడలేదు స్వామి అనే నా మనసు నోరు నొక్కి , నేను జనంలో కలిసిపోయాను.
పూజ అర్చన ఐన తర్వాత స్వామి ఉపదేశం ఇవ్వాలి. భక్తులు అందరు రెండు చేతులతో నమస్కారం చేస్తూ, స్వామి ఏమి చెబుతారా అని ఎదురు చూస్తున్నారు. నేను కూడా జనం లో ఒక మూల కూర్చొన్నాను. నమస్కారం మాత్రం చెయ్యొద్దని నా మనసుకు చెప్పాను. స్వామి ఒక్క సైగ చేసారు. కొంచెం వంగితే అందే మైకు ని , మరో భక్తుడు ఆయన నోటిదగ్గర పెట్టాడు. ఇంకో సైగతో , గాలి కంట్రోల్ చెయ్యబడింది. స్వామిని నిశితంగా పరిశీలించిన మనసు ఇంకో ప్రశ్న అడిగింది, ఎందుకు స్వామికి పొట్ట వచ్చింది అని? దీని అసాధ్యం కూల , కొంచెం మనసు మూసుకూర్చోరాదు? నీకెందుకే స్వామికి పొట్ట ఉంటే, లేక పొతే? నా సమాధానం తో అది తృప్తి పొందలేదు. అదికాదు అన్న , స్వామి అంటే భగవంతునికి ఎంతో చేరువతో ఉండి, ఖటిన ఉపవాసాలతో, శరీరంపైన నియంత్రణ కలిగి ఉంటారు , కాదా ? మరి పొట్ట వస్తే అర్ధం ఏమిటి? బాగా కొవ్వు పదార్ధాలు తింటున్నట్టు కదా? నాకు సమాధానం తెలీదు, మనసుని మళ్ళి నోరు మూసుకోమన్నాను. ఇంతలో స్వామి ఇంకో పది మందికి గాల్లో నే ఆస్వేరదించారు. నిజమే ఆశ్వీర్వాదం గాల్లో నే కదా చేస్తారు? కాదురా, తల మీద చెయ్యి పెట్టి కూడా చెయ్యొచ్చు, అది కూడా తెలీద , నా మనసు మందలింపు.
స్వామి ప్రసంగం మొదలైంది, వెంకటేశ్వర స్వామి గూర్చి చెప్పారు. వెన్ అంటే పాపం అని , కట అంటే తొలిగించే వాడని చెప్పారు. ఈ విషయం నాకు తెలుసు. చాల మందికి కూడా. ఇక తిరుమల గురించి, మన శరీరంలో ఉండే ఏడు కొండలగురించి, మన శరీరమే తిరుమల అని , ఇలా చెప్పుకొంటూ పోయారు. మనసే దేవాలయం అనే పాట పాడి భక్తులను రంజింప చేసారు. ఆ యన చేబుతున్నంత సేపు నా పక్కనున్న మహా భక్తుడు , ఒక్కటే దండాలు. ఆహ, ఓహో అంటూ తన్మయత్వం. ఎవరి ఆనందం వారిది.
పాట పడడం అయిపోయింది. ఇక అప్పుడు ప్రారంభమైంది , ఆశ్వీర్వాద కార్యక్రమం. పొలో మని, ఆశ్వీర్వాదం తీసుకోడానికి లైను లో నుంచున్నారు భక్త వందలు (వంద మంది ఉంటారేమో) ఒకరి తర్వాత ఒకరు, కాళ్ళ మీద పడి పోతున్నారు. ఆ స్వామిజి వెనుక శ్రీ వెంకటేశ్వర స్వామి నిలువెత్తు విగ్రహం ఉంది, "ఆ దేవదేవునికి మొక్క కుండ, ఈ స్వామికి మొక్కడం ఏమిటి" అని, నా మనసు ప్రశ్న. నాకు తెలీదు. "అలా చేస్తే ఆ దేవునికి అవమానం కాదా", నోరు మూసుకో, ఇంకో ప్రశ్న అడగకు. స్వామి గుప్పిళ్ళతో బాదం పప్పులు తీసారు. తీసి ఒక్కొకరికి ఇస్తూ పోతున్నారు. భక్తులు తీసుకొని, కళ్ళకు అద్దుకొని, కాళ్ళ మీద పడుతున్నారు. ఆశ్చర్యం ఏమిటి అంటే , స్వామి అలా కాళ్ళ మీద పడడం స్వాగతించి, వాళ్ళను దీవిస్తూ పోవడం. నేను కొంత మంది పూజారులను చూసాను. పూజ చేయించిన తర్వాత ఎవరినా భక్తులు , పూజారులను దేవుని ప్రతిరూపంగా భావించి పాదాభివందనం చేస్తే, ఆ పూజారి , ఆ నమస్కారాన్ని ఆ దేవునికి అంకితం చెయ్యడం చూసాను. అది వారి అవున్నత్యాన్ని సూచిస్తుంది. మరి స్వామిజి లా విషయం అలా కాదు. వాళ్ళే దేవుళ్ళుగా , భక్తులను ఆశ్వీర్వదిస్తున్నారు.
ఇంతలా స్వామి టచ్ స్క్రీన్ ఫోన్ మోగింది, ఆ .. ఆ.. వస్తున్నా .. కలుస్తా.. అంటూ మాటలు , ఫోన్ అయిన తర్వాత , మళ్ళే ఆశ్వీర్వాదo .
ఇక చివరి ఘట్టం. స్వామి చిన్న పిల్లలను దగ్గరకు పిలిపించుకొని ముద్దాడడం. వాళ్ళ తల్లి తండ్రుల మొఖంలో రెండు వెలిగిన బల్బులు. పిల్లలకు అక్కడున్న బాదాం పప్పులు ఇస్తే తీసుకోలేదు. అరటిపళ్ళు ఇస్తే తీసుకొన్నారు. ఇంతలో, స్వామి వారిని పిలిచిన, ఆలయ కమిటి వాళ్ళు, ఒక వెండి పళ్ళెంలో, తాంబూలం, వక్క, అరటిపళ్ళు, రెండు సీల్డు కవర్లు పెట్టి, స్వామికి ఇచ్చారు. స్వామి, దూరంగా నిలబడ్డ ఇద్దరు భక్తులను పిలిచి, అరటిపళ్ళతో ఆశ్వీర దించారు. తాంబూలం, వక్క ఒక సోదరికి ఇచ్చారు, ఆవిడ పిల్లడు అందులో అరటి పండు తినేస్తే, ఆవిడ తాంబూలం చప్పరించింది. స్వామి మాత్రం రెండు సీల్డు కవర్లు, మడిచి బాగ్ లో పెట్టుకొన్నారు. ఎవరు చెప్పక్కరలేదు అవి దక్షిణ అని.
నాకు ఆది శంకరాచార్య ఒక్క సారి గుర్తుకు వచ్చారు. ఆయన ఎలాంటి పల్లకిల్ల్లో తిరగలేదు, ఎలాంటి సేవలు చేయించుకోలేదు , ఒకసారి ఆయన భిక్షకు వెళితే , ఒక స్త్రీ దగ్గర ఏమి భిక్ష లేక పొతే, మీ ఇంట్లో ఏది వుంటే అది ఇవ్వు అమ్మ తీసుకొంటాను అన్నారు. ఆవిడ ఇల్లంతా వెతికి ఒక్క ఎండి పోయిన ఉసిరికాయ ఉంటే , అదే భిక్షగా వేసింది. ఆ మహాత్ముడు, ఆది గురువు చలించి పోయి, కనక ధర స్త్రోత్రం చేస్తే, ఇల్లంతా బంగారు ఉసిరికాయలు రాలాయి. ఇప్పటికి కనక ధర స్త్రోత్రం చేస్తే, ఇంచు మించు అలాంటి ఫలితమే కలుగుతుంది అని నమ్మకం. అలాంటి గురువులు తిరిగిన నేల మనది. ఇప్పటి స్వాములకు AC కార్లు, నడుం నొప్పెట్ట కుండ చక్కటి ఆసనాలు, కాళ్ళకింద మెత్తటి తలగడాలు, ఆశ్వీర్వాది౦చ డానికి బాదాం పప్పులు .
తను కొన్ని వందల కోరాడ దెబ్బలు తిని, శ్రీ రాముడికి గుడి కట్టించిన రామ దాసు ఎక్కడ, ఇచ్చిన దక్షిణ పంచలో కుక్కుకొని పలాయనం చిత్తగించే స్వామిజి లు ఎక్కడ? స్వామి ఇంకా అమెరికా అంత పర్యతిస్తారంట!. ఇవ్వన్ని చూసి అనిపించింది, నేను కూడా స్వామిజి ఎందుకు కాకూడదు? అసలు ఈ సృష్టిలో స్వామిజి కన్నా మించిన ఉద్యోగం , క్షమించాలి, సమాజ సేవ, కాదుకాదు, ప్రజా సేవ, అయ్యో నామతి మండ, నాకు సరైన పదమే గుర్తుకు రావడం లేదు, సరే ఏదోటి కానీ, స్వామిజి అయితే బాగుంటుంది కదా.

Monday, September 13, 2010
మనకు ఎంత మంది దేవుళ్ళు?
ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే ఆకాసంలో ఉన్న నక్షత్రాల కన్నా ఎక్కువ దేవుళ్ళున్నారు మనకు. మన వాళ్లకు దేవుళ్ళు చాలక ఇంకా సృష్టిలో మనకు చేరువులో ఉండే జీవ రాసులన్నిటిని కూడా దేవుళ్ళుగా చేసే సారు. ఇది ఎవరు ఎందుకు చేసారో తెలుసుకోవడం మాములు విషయం కాదు. తెలుసుకొనే అవకాసం కూడా లేదు. మనలో ఒక్కరైన "మనకు ఉన్న దేవుల్లెంతమంది" అంటే ఒక్క రోజులో లెక్క వేసి చెప్పగలరా? చెప్పి ఒప్పించగలరా?
మనకు రొజూ పాలిచ్చె ఆవుని కామధేనువు చేసారు, కుక్కని కాలభైరవుడిని చేసారు, పాముల సంగతి ఇక చెప్పక్కరలేదు. గూటిలో ఉన్న సాలె పురుగు, ఏనుగు, వరాహం, తాబేలు, పులి , సింహం , మర్రి చెట్టు, వేపచెట్టు ఇలా ఒకటేమిటి సమస్త ప్రాణకోటిని దేవుళ్ళు చేసారు. ఇలా ఇన్ని రకాల దేవుళ్ళని సృష్టించి మనం సాధించుకొంది ఏమిటి? "శ్రీ రామ రామ రామేతి రమే రమే మనో రమే , సహస్ర నామ తతుల్యం రామ నామ వరాననే", అన్న ఒక్క రామ వాక్యం చాలదా వెయ్యి సార్లు రామ నామ జపం ఫలితం ఇవ్వడానికి? ఓం నమశివాయ అన్న పంచాక్షరి మంత్రం చాలదా? అసలు ఎందుకు ఇన్ని పురాణ కధలు రాసారు?
మన కావ్య రచన ఎంతో గొప్పగా మొదలైంది. ఆది కావ్యంగా రామాయణం ఇప్పటికి ప్రపంచానికి ఆదర్శ ప్రాయమైనది. రామాయణం మీద పరిశోధించి ఎందరో దేశ విదేశీయులు డాక్టరేట్ డిగ్రీలు పొందితే, మరెందరో మోక్షాన్ని పొందారు. వాల్మీకి రచన ఎంతో సౌందర్యవంతమైంది అనన్య సామాన్య మైనది. ఆయన రచనలో ఎక్కడ అతిశయం లేదు. వానర లక్షణాలు వర్ణించినప్పుడు ఇంక దూకుడుగా వ్యవహరించారో , రాముని సీత వియోగాన్ని వర్ణించినప్పుడు, ఒక మానవుడిగా రాముడు పడే భాదను మనవ సహజంగ వర్ణించారు. తర్వాత రాసిన మహా భారతం కూడా అత్యంత సహజంగా రాయబడింది. ఏ సృష్టిలో ఏ జీవికి ఉండవలసిన లక్షణాలు ఆ జీవికి ఆపాదించారు ఈ మహాకావ్యాలలో. ఉదాహరణకు మాయ లేడి విషయానికి వస్తే, అది సీతాదేవి వద్దకు వచ్చి , అక్కడే తిరుగాడుతుంది, లేడి సహజ సిద్దమైన బెరుకు, తడబాటు , వయ్యారం అన్ని ఆ లేడికి ఉంటాయి. అంతే కానీ ఆ లేడి గబుక్కున "నన్ను పట్టుకో " అంటూ మాట్లాడదు. సర్వాంతర్యామి ఐన శ్రీ కృష్ణుడు మాయ జూదం గురించి తెలుసు కోలేకన, మౌనంగా ఉన్నాడు ? తనకి అన్ని తెలిసిన ఎక్కడ తన మాయలు మంత్రాలూ ఉపయోగించలేదు. అత్యంత సహజంగా కావ్య రచన సాగింది.
మరి అంత గొప్ప రచనలు కలిగిన మనం, రాముడు, కృష్ణుడు, శివుడు చాలదన్నట్టు, వేలకు వేలు దేవుళ్ళని ఎవరు సృష్టించారు? బలి చక్రవర్తి కధ మనం ఎన్నో సార్లు విన్నాము. విష్ణు మూర్తి ఒక కాలు భూమి మీద, రెండో కాలు ఆకాసంలో పెడతాడు, అంటే మరి అప్పటికి బలి చక్రవర్తి ఎక్కడున్నట్టు? విష్ణువు ఎక్కడున్నట్టు ? మనకు వేదాలు ప్రామాణికం అంటారు, మరి వేదాలలో ఈ కధలు ఎమన్నా చెప్పారా? మిగతా ఏ మతంలో నైన గుడికి వెళుతున్నాను అంటే ఒక దేవుడి గుడికి అనే అర్ధ వస్తుంది, కానీ మనకు వెంటనే ఏ గుడికి అన్న ప్రశ్న అడగక పోతే అవదు. మన వాళ్ళ ఉహ శక్తికి అంతం లేదు. ఒకటికి ఒకటి అలా సృష్టించుకొంటు వెళ్లి పోయారు. ఇప్పటికి ఆగటం లేదు. అసలు మన దేవుల్లందరి గురించి చదివి, తెలుసుకొని దానిని ఇంకొకరికి చెప్పాలంటే ఒక జన్మకు సాధ్య పడుతుందా?

గొప్పవాళ్ళంటే ఎవరు? మనం కాలేమా?
మనం చాల మందిని గొప్పవాళ్ళు అనుకోని ఫిక్స్ అయిపోతము. అబ్బో ఆయన చాల గోప్పవాడండి అంటాము లేదా ఆవిడ సామాన్యురాలు కాదండి అంటాము. గొప్పతనం అనేది నిరంతర ప్రక్రియ. తెలివితేటలూ అనేవి వర్తమానానికి చెందినవి అవుతే, గొప్పతనం ఎదిగే మొక్క లాంటిది. అసలు ఏది గొప్ప? గొప్పతనం అంతే ఏమిటి? గొప్ప పని చేసే వాళ్ళను గొప్పవాళ్ళు అంటాము. చాల చిన్న విషయం కదూ? అది సరే ఏది గొప్ప పని? మీరు మీ ఇంటి నుండి నడుచుకొంటూ వీధి చివరన ఉన్న కిరాణా కొట్టుకు వెళ్లారు. మిమ్ములను ఎవరైనా గొ..ప్ప పని చేసావో సుందరం అని పొగుడుతార? లేక పోతే మీ పిల్ల ఆ డుకొంటుంటే గట్టిగ కేక వేసి పిలిచారు, అది ఒక గొప్ప పన? ఎందుకు కాదు? నిజమే పైన రెండు ఉదాహరణలు గొప్ప పనులు ఎందుకు కావు?
ఎందుకంటే అవి సామాన్యంగా ప్రతి మనిషి చెయ్యగలిగే పనులే. కాబట్టి అందరు చేసే పని చేస్తే అది సాధారణ పని అవుతుంది కానీ గొప్ప పని కాదు. మీరొక స్టూడెంట్ అనుకొందాం, క్లాసు లో ఉండేది ఒక నలభయ్ మంది అనుకొంటే, మీకు అందరికన్నా ఎక్కువ మార్కులు వస్తే మీరు గొప్ప. మీరో ఎ౦ప్లయి అయితే , మీ ఆఫీసు లో అందరికన్నా మీరు బాగా పని చేస్తే గొప్ప. గృహిణి ఐతే ఎంత చక్కగా ఇంటిని అలంకరిస్తే అంత గొప్ప. అసలు మనం ఎక్కడున్నా, ఎందరి మధ్యలో ఉన్న మనం చేసే పని అత్యుతమది ఐతే మనమే గొప్ప.
మరి ఇంత సులువుగా గొప్ప వాళ్ళు అయిపోవచ్చా? కాలేము, అందుకంటే ఏ చిన్న విషయం అందరకు తెలిసిందే , అందరు వాళ్ళ శక్తి సామర్ధ్యాల మేరకు పని చేసేవాళ్ళే. మరైతే మనం చేసేదేముంది? ఇక్కడే మనం కష్టం అనే పదాన్ని ఉపయోగించుకోవాలి. సాధారణంగ మీ వీధి చివరనున్న కిరణా కొట్టుకు అందరు పది నిముషాలలో వెళ్లి వస్తే , మీరు కొంచెం ఎక్కవ కష్ట పడి ౩ నిముషాలలో వెళ్లి వస్తే , కొంతమంది దృష్టిలో మీరు ఆ సమయానికి గొప్పే. మీరు రాత్రి చాల పొద్దు పోయేవరకు కష్ట పడి మీ ఇంటిని అలంకరిస్తే మరుసటి రొజూ ఉదయానికి వచ్చే మీ బంధువులకు మీరు గొప్పే. ఎప్పుడు క్లాసు లో మధ్య ర్యాంకు లో పాస్ ఇయ్యే మీరు ఫస్టు ర్యాంకు లో పాస్ ఐతే నిజంగా గొప్పే.
కష్ట పడడం అన్నాము కదా, అదేంటి? కష్టం అంటే మీ స్కిల్ల్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. మీరు రొటీన్ కి భిన్నంగా ఆలోచించడం, క్వాలిటీ కోసం నిరంతరం అన్వేషించడం. గృహిణి ఉదాహరణ చెప్పుకొందాం, ప్రతి రొజూ ఆవిడ ఇల్లు సర్దుతుంది, వస్తువులు ఎక్కడుండాలి అన్ని అక్కడ పెడుతుంది, ఇలా రొజూ చేస్తూ ఉన్నప్పుడు , ఆవిడకు కొన్ని వస్తువుల ప్లేసులు మారుస్తే ఇంకా అందంగా ఉంటుంది అని అనిపించచ్చు, ఇల్లు ఇంకాస్త తుడుస్తే బాగుంటుంది అనిపించచ్చు, అంటే ఆవిడ మెరుగైన క్వాలిటీ కోసం చుస్తుందన్న మాటే కదా. వేరే వాళ్ళ ఇంటికి వెళ్లి నప్పుడు అక్కడున్న అలంకరణ వస్తువులు చూసి తను కూడా అవి ఇంట్లో స్వంతగా తయారు చేసుకోవచ్చు, అలా తన స్కిల్ల్స్ మెరుగు పరుచుకోవచ్చు. ఇంటికి సంభందించిన పుస్తకాల ద్వార ఇంటిని ఇంకా మెరుగ్గా అలంకరించుకోవచ్చు. సాధ్యమైనంత ఎక్కవగా ఏ పని గురించైనా ఆలోచిస్తే, తప్పకుండ ఆ పనిని మెరుగ్గా సాదించకోవచ్చు.
గొప్పగా ఉండడం నిజంగ ఎంతో హాయినిస్తుంది. మన గురించి అందరు చెప్పుకొంటారు, ప్రత్యెక మైన గౌరవం ఉంటుంది. దీనికి కావలసిందల్ల , చేసే పనిని ఇంకాస్త మెరుగ్గా చేసే చాలు. అలా నిరంతరం మెరుగ్గా చెయ్యాలని ఆలోచించిన వాళ్ళు ఇప్పటికే చాల గొప్ప వాళ్ళగా పిలవబడుతున్నారు. గొప్పతనం అంటే పేపర్లో నో , టీవీ లోనో కనపడడం మాత్రమే కాదు, మన వీధిలో , మన కుటుంబంలో, మన పక్క వీధిలో, మన పరిచయస్తుల్లో, అసలు పరిచయమే లేని వాళ్ళ మధ్యన కూడా గొప్ప వాల్లనిపించుకోవచ్చు. అది చాల సార్లు తాత్కాలికమే కావచ్చు కొని ఎనలేని ఆనందాన్ని మాత్రం ఇస్తాయే. త్వరలో మనమందరం కూడా గొప్పవాళ్ళం కావాలనే నా ఆశ.

Saturday, September 11, 2010
వినాయక కధలో వాస్తవాలు ఎలా తెలుసుకోవడం ?
వినాయక చవితి కధ మనం తర తరాలనుండి చదువుతున్నాము . అసలా కధ ఎప్పడు , ఎక్కడ మొదలైందో ఎవరికైనా సరిగా తెలుసా? నాకు మాత్రం ప్రతి సంవస్స్తరం ఒకే ప్రశ్న. చంద్రుడు ఎలా నవ్వుతాడు?
సరే చంద్రుడు ఇదివరకు నవ్వే వాడె అనుకొంటే , ఇప్పుడు నవ్వడం మానేసాడ? ఆలోచిస్తే ఇది వితండ వాదం లానే ఉంటుంది. ఏయ్ ఎంత ధైర్యం నీకు పెద్దలు చెప్పిన దాన్ని మళ్ళి ప్రస్నిస్తున్నావా? నేరుమూసుకొని వాళ్ళు ఏది రాసారో అదే చదువు, ప్రశ్నలు అడక్కు అంతే ఏ టాపిక్ ఇక్కడే ఆగి పోతుంది. నేను చదివే కధలో అనుమానం వస్తే దానిని నివృతి చేసుకోకూడద? అందుకే అసలు ఏ కధ ఎవరు రాసుంటారు? రాసిన వాళ్ళు చంద్రుడు నవ్వాడని ఎందుకు రాసారు? కధనంత చంద్రుడి చుట్టూ ఎందుకు తిప్పారు?
మన భారతీయులకు నవ గ్రహాలు ఉంటాయని, వాటి పేర్లు, అవి సూర్యుని చుట్టూ తిరిగే వేళలు, భూమికి ఇతర గ్రహాలకి ఉండే సంభంధం అన్ని ఖచ్చితంగా తెలుసు. దాని ఆధారంతో నే కేలండర్ తయారు చేసారు. తిధులు, నక్షత్రాలు ఖచితంగా అంచనా వేసారు. చంద్రునికి, ఏ రొజూ ఏ నక్షత్రం దగ్గరున్తాడో ఒక్క తప్పు లేకుండా రాసారు. ఇన్ని తెలివి తేటలున్న వాళ్ళు, పురాణ కధలను మాత్రం, నమ్మ శక్యం కానీ రీతిలో రాసారు. వ్రాసిన వారి ఉద్దేశ్యం బహుశా సామాన్య జనాలకు ఏ కధలను చేరువగా చెయ్యడం , తద్వారా భక్తీని పెంపొందించడం. నిజమే కానీ దానికోసం ఇలాంటి కధలు ఎందుకు రాసారో ఆ పరమేశ్వరుడికే తెలియాలి.
ఈ కధలో శమంతక మణి ఉంటుంది , దానిని సత్రాజిత్తు తమ్ముడు ధరించి వేటకు వెళతాడు. సింహం అతనిని వధించి మణి అపహరిస్తుంది. ఇంతవరకు ఫర్వాలేదు. వెంటనే జాంబవంతుడు సింహంతో పోరాటం చేస్తాడు. జాంబవంతుడు ఒక భల్లూకం . సింహం మృగరాజు. భల్లూకం సింహంతో తలపడినట్లు ఏ ప్రపంచ సాహిత్యం లో ను లేదు. అది సరే జాంబవంతుడు సింహాన్ని చంపేస్తాడు, ఎందుకంటే మణి కావాలని!. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , మనుషుల్ల లాగే ఈ జంతువులూ కూడా మణి కోసం దెబ్బలాడుకోవడం. జాంబవంతుడు మణిని తన కూతురికి ఆడుకోవడానికి ఇవ్వడం. ఇది సరేకానీ ఈ సృష్టి స్తితి కారకుడు ఇన ఆ మహా విష్ణువు, జాంబవంతుదితో పోరాడి ఆ మణి గెలిచి, జాంబవతిని పెళ్లి చేసుకోవడం. జాంబవతి ఒక భల్లూకం కూతురు, ఇన సరే మనవ రూప ధరి ఇన కృష్ణుడిని పెళ్ళాడడం ఏమిటో?
ఇలాగే చంద్రుడు నవ్వడం మనకు తెలుసు. భూమి చుట్టుకోలతలో నాలుగో వంతు ఉండే చంద్రుడు, ఒక మానవుని లాగా పక్కున నవ్వడం ఏమిటో ? ఈ మొత్తం కధలో లాజిక్ ఎంత ఆలో చించిన అర్ధం కాదు. ఎవరినైనా అడుగుదామంటే అది మన పురాణ కధలు , వాటికీ అర్ధాలు వేత్తక్కుడదు అంటారు. ఈ అనుమానం నాకు చిన్నతనం లో వచ్చింది, ఈ రొజూ పూజలో ఇదే ప్రశ్న పిల్లల దగ్గరనుండి ఎదురైంది, నాకు తెలుసు ఈ కధని వినాయక చవితి రొజూ చదవండి, అంతే కానీ ఈ ప్రశ్నలు అడగద్దు అని చెప్పడం తప్ప ఇక ఏమి చేయలేను.

పూజారి కాళ్ళ మీద ఎందుకు పడతావు?
క్రిందటి వారం నేను మిల్వాకీ స్టేట్ కి వెళ్ళాను. అక్కడ హిందూ మందిర్ ఒకటి ఉంది. అక్కడొక హోమం జరిగింది. హోమం అంత అయిన తర్వాత, అక్కడ పూజారులతో కొంత సేపు మాట్లాడదామని వెయిట్ చేశాను. ఒక పూజారి కలిస్తే అతనితో మాట్లాడడం మొదలుపెట్టాను. అప్పటికి పూజ అంత అయి చాల సేపైంది, ఎవరిమటుకు వాళ్ళు ఇళ్ళకు వెళ్లి పోతున్నారు. పూజారి తో కుశల ప్రశ్నలు మొదలయ్యాయి. మీరు ఎక్కడుంటారు అంటే మీరేక్కడుంటారు అని కబుర్లు సాగాయి. మేము ఇలా మాట్లాడుతుండగానే, వేరొక భక్తుడు మాతో కలిసాడు. అతను కూడా మీరేక్కడుంటారు అని కబుర్లలో పడ్డాడు. అంత వరకు బాగానే ఉంది కానీ , ఉన్న పళంగా ధడేలు మని ఎవరో పడిపోయి న చప్పుడు. నా పక్కన మాట్లాడుతున్న మరో భక్తుడు కనిపించలేదు. పూజారి కళ్ళు మూసుకొని ఏదో శ్లోకం చదవడం మొదలు పెట్టాడు. కొన్ని క్షణాల తర్వాత అది ఆస్వీర్వాదం అని అర్ధం అయింది. అది పూర్తి అవగానే, కింద నుంచి పైకి లేచిన భారీ మనిషి, ఎక్క్కడ చూసానో ఆలోచించే అవసరం లేకుండానే అర్ధం అయింది ఇంతకుముందు నాతో కలిసి పూజారితో మాట్లాడిన మనిషి అతనే అని. ఆస్వీర్వాద శ్లోకం అంతగా అర్ధం కాకపోయిన, అంత కంటే పెద్ద అనుమానం, నా పక్కనున్న మనిషి , ఉన్న పళంగా అలా పూజారి కాళ్ళమీద ఎందుకు పడ్డాడో తెలీలేదు.
అదేంటి ఇందులో అర్ధం కాకపోవడం ఏంటి, పూజారి అంటే ఎవరు? సాక్షాత్తు దేవుడి ప్రతిరూపం, అలా కాళ్ళ మీద పడడంలో తప్పేంటి అనే వాళ్ళు చాల మంది వున్నారని నాకు తెలుసు. కానీ అసలు కధంతా ఇక్కడే ఉంది. కాళ్ళ మీద పడే భక్తుడు , పూజారి నుండి ఆశించేది ఏమిటి? ఆ సదరు భక్తుడిని పూజారి దీవించాలి, అదికూడా ఒక సంస్కృత శ్లోకం తో దీవిస్తే మరీ మంచిది!. నీల మీద బొక్క బోర్ల పూజారి కాళ్ళమీద పడిన భక్తుడికి ఆ సమయంలో అంత కన్నా పెద్ద కోరికలు ఏమి ఉండవు, పూజారి తనను దీవించాలి, తన కుటుంబాన్ని దీవించాలి అంతే. అది సరే కానీ ఓ భక్తుడా నువ్వేమి ఘనకార్యం చేసావని నిన్ను దీవించాలి? పూజారిని చూసావు, ధడేల్ మని కాళ్ళ మీద పడ్డావు, అంతే! నిన్ను దీవించాలి. నువ్వు పచ్చగా ఉండాలని దీవించాలి, నువ్వు చేసిన సర్వపాపాలు నశించాలి అని దీవించాలి, సకల సంపదలు ప్రాప్తించాలి అని దీవించాలి.
దేవుడికి పూజ ఎందుకు చేస్తావు? పూజ చెయ్యడం అంటే, దేవుడిని సంతోష పెట్టడం. దేవుని గుణ గణాలు వర్ణించడం. దేవుని గొప్పదనాన్ని కీర్తించడం, అష్తోతరం తో గాని , శతనామార్చన తో గాని, సహస్రనామార్చన తో గాని దీవున్ని కీర్తించడం. నానా విధ ఫలం లతో పూజించడం, అంగ వస్త్రం సమర్పించి , తామ్బులాది సత్కార్యాలు తో సేవించడం. ఇన్ని పనులు చేసి, తర్వాత నీ కోరిక చెప్పుకొంటే, నువ్వు చేసిన సేవల ద్వార ఆ భగవంతుని ద్రుష్టి నీ మీద ప్రసరించి, ఆయన ఆనందించి , నిన్ను అనుగ్రహించి తద్వారా నీకు మేలు జరుగుతుంది అని, దేవుణ్ణి నమ్మే మనలాంటి వాళ్ళందరి నమ్మకం. నీ కష్టానికి తగ్గ ఫలితం ఆశించడం ఎంత మాత్రం తప్పు కాదు. నువ్వు దేవుని కోసం కష్ట పడు , నీకోసం దేవుడు కష్ట పడ తాడు , చాల సులువైన విషయం.
Monday, May 17, 2010
ముష్టి వాడి ఉపదేశం
అన్నా, మనం అంటే అందరకు చిన్న చూపే, ముష్టి వాడిగా పుట్టడం అంత పాపం మరోటి లేదు, పొరపాటున ఈ వృతి లోకి పచ్చాను, ఇక నేనెంతమాత్రం ఈపని చేయలేను అని భాదపడుతున్న ఓ జూనియర్ ముష్టి వాడిని ఓదారుస్తూ సీనియర్ ఇలా అంటున్నాడు.
నిజమే ముష్టివాళ్ళు అంటే అందరకు చిన్నచూపు, నాకు తెలుసు మనగురించి ఈ గోప్పోల్లంతా ఇలా అనుకొంటారు. "ముష్టివాళ్ళు బాబు, అయ్యా అని అదేపనిగా దీనమైన స్వరం తో, నరకానికి ఒక్క అడుగు దూరంలో ఉన్నట్టు ప్రాధేయ పడతారు. మనం వెళ్ళవయ్య , చిల్లరలేదు పో అంటే వెళ్ళ కుండ , మళ్ళిమళ్ళి ప్రాధేయ పడతారు. ఎక్కడో జేబులో ఏదో మూలనుండి ఒక రూపాయ్ నాణెం తీయక పోతార అనే ఆసతో, గొంతులో దీనత్వ౦ తగ్గగుండా, సిగ్గు మోఖమాటం లేకుండా అదే పనిగా వెంట పడతారు. డబ్బులేస్తే దణ్ణం పేడతారు, లేక పొతే ఇంకో దాత కోసం ఎదురు చూపులు. వీళ్ళకు ఒక సారి చెపితే అర్ధం కాదా? అసలు ఇలాంటివాళ్ళు ఎందుకు పుడతారు?"
"కానీ మనలను ఇంత తిడుతున్నా వీళ్ళందరూ కూడా ఏదో ఒక సమయంలో మనలాగా అడుకోన్నేవాళ్ళే" అనగానే జూనియర్ నమ్మలేదు. "లేదు అన్నా మనం అడుక్కున్నమంటే కడుపుకాలే పిల్లలకు ఇంత ముద్ద పెట్టాలని, మరి గోప్ప్పోల్లు ఎందుకడుక్కుoటారు? నేన్నమ్మను" అన్నాడు. "సరే నువ్వే చూద్దూగాని" అని సీనియర్, జూనియర్ ని రైల్వే స్టేషన్ వైపు తీసుకెళ్ళాడు.
అది రైల్వే స్టేషన్ , విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళే రైల్ కొద్ది సేపటిలో బయలుదేరబోతోంది, హడావిడిగా వచ్చిన రిజర్వేషను కన్ఫర్మ్ కాని ఒక సూటు బూటు హీరో గారు టీసి దగ్గరకెళ్ళి "బాబ్బాబు ఏదో ఒక బెర్త్ రిజర్వు చెయ్యండి" అంటున్నాడు. టీసి మర్యాదగా "బెర్తులు లేవండి, వెయిటింగ్ లిస్టు చాల ఉంది ఇప్పుడు కుదరదు" అనే చెప్పాడు, కానీ మన హీరో గారు పట్టు వదలని అక్రమర్కుడులాగా మళ్ళి మళ్ళి టీసి ని విసిగించడం మొదలు పెట్టాడు, టీసి కి సహనం నశించి "ఎన్ని సార్లు చెప్పాలండి బెర్తులు లేవని , నన్ను ఇక ఇబ్బంది పెట్టకండి" అని కసురుకొన్నాడు. కానీ మన హీరో గారు అదేమీ పట్టించుకోక, టీసి వెంటే తిరిగి తిరిగి , ఎన్నో సార్లు తిట్లు తిని , మర్యదంతా పోగొట్టుకొని .. చివరకు ..ఇక బెర్త్ దొరికే ఎంత లేక పొతే ఎంత ? ఆ వేడికోలు, ప్రార్ధనలు చూసి నేనైతే కేవలం నిద్ర కోసం ఇంత దిగాజారను అని జూనియర్ కళ్ళల్లో విస్మయం తో కూడిన ఆశ్చర్యo
ఒక్క రైల్వే స్టేషన్ కాదు, బస్సు స్టేషన్, RTO ఆఫీసు, కలెక్టర్ ఆఫీసు, రేషన్ డిపో, మునిసిపల్ ఆఫీసు , ఇలా ఎన్నో తిప్పి చూపించాడు సీనియరు . ఏక్కడ చూసిన అవే దీన మైన వేడికోలు. వాళ్ళందరూ వాళ్ళ స్థాయికు తగ్గి దీనంగ తమ పనులు జరగడం కోసం ప్రాధేయ పడ్డ దృశ్యాలెన్నో! పైకి గంభీరంగా కనిపించే వాళ్ళందరూ, ఒక చిన్న లాభం కోసం, సౌకర్యం కోసం తమ స్థాయిని మర్చిపోవడం చూస్తె వింతగా అనిపించింది జూనియర్ కు . అతనన్నాడు , " అన్నా నాకు ఒక విషయం అర్ధం ఐంది, ఈ గొప్ప వాళ్ళందరూ తమ పని పూర్తి అవడం కోసం ఎవ్వరి కాళ్ళు పట్టుకొన్న తప్పులేదు, ఎలాంటి వాడిని "సర్" అని పిలిచినా తప్పులేదు, సిగ్గు, అభిమానం, వ్యక్తిత్వం ఇవేవి పని జరగడం కన్నా గోప్పవేమి కాదు, ఇవ్వన్ని పని పూర్తి అయ్యాక , వాటంతట అవే తిరిగి చేరతాయి అందుకే పనులు జరగాలంటే వీటినన్నిటిని కాస్త పక్కన పెట్టాలి" అన్నాడు. అది విని సీనియర్, "బాగా గ్రహించావురా, ఇంకో విషయం వింటే నవ్వుతావు, వాళ్ళు అలా బ్రతిమిలాడక పొతే వాళ్ళ పనులు కొంచెం ఆలస్యం అవుతాయ్ లేదా తాత్కాలికంగా కొంచెం కష్ట పడతారు, కానీ పని జరగకుండా పోదు, ఆ కాస్త ఆలస్యం భరించలేకే ఎంతకైనా దిగాజారుతున్నారు. ఈ గొప్ప మనుషులు తమకు అన్నే అనుకూలంగ ఉన్నప్పుడు, నీతికి, వ్యక్తిత్వానికి, మాటకి కట్టుబడినట్లు, ఎంత బిల్డప్ ఇస్తారు, వీళ్ళ వల్ల ఒక్క చిన్న మాట తేడాతో పెళ్ళిళ్ళు ఆగిపోవడం చూసాం, సొంత బంధువులు సంవస్సరాల తరబడి మాట్లాడడం మానేయడం చూసాం, ప్రాణ స్నేహితులు విడిపోవడం చూసాం, కొంచెం సౌకర్యం కోసం, కాస్త సుఖం కోసం అదే జనం మన ముష్టి వాళ్ళకన్నా, దారుణంగ ప్రాధేయ పడడం చూస్తున్నాం. కానీ ఈలోకo చాల విచిత్రమైంది రా! మనకు ఎప్పటికి అర్ధం అవదు, అందుకే అడుక్కునావని ఎప్పుడు బాధపడకు, మనకన్నా గొప్ప వాళ్ళు చాల మందే ఉన్నారు" అని జూనియర్ కి ఉపదేశం చేసాడు.
తమ ఊరి యంయేల్య కాళ్ళు పట్టుకొని, పాదాభివందనాలు చేసి తమ కొడుకులకి గవర్నమెంటు కాలేజి లో సీట్లు ఇప్పించుకోవాలని వెళుతున్న ఇద్దరు సగటు తండ్రులు ఈ సంభాషణ విని , అడుగు ముందుకు పడక, అక్కడే ఆగి , మమ్మలను క్షమించండి అని మనసులో వేడుకొని , ముస్టివాళ్ళను (ఇంకా ముష్టి వాళ్ళు అందామ?) ప్రేమతో పలకరించి, చేతనైన ధర్మం చేసి , భారంగ యంయేల్య ఇంటికేసి సాగిపోయారు.

Sunday, May 16, 2010
నన్ను పోషించే పేదవాడు
నాకు ఎందుకో ఇవ్వాళ్ళ తెగ కవిత్వం రాయాలనిపిస్తోంది నేస్తం !
ఆగకుండా, ఆపకుండా ఈ ప్రపంచం నడుం విరిగేలా
నిద్రపోతున్న సమాజాన్ని ఉలిక్కిపడి లేపెల, ఉతికి ఆరేసేలా ఏదో రాయాలనిపిస్తోంది
అలవాటుపడ్డ ప్రాణం కదా, రాయకపోతే చెయ్యి ఊరుకోదే
సరే ఆవేశం ఐతే ఉంది గాని, కవితా వస్తువేది?
ఎందుకు నేస్తం పైనున్న ఆ ఫోటోని చూసి అలా అర్ధం కానట్లు నవ్వుతావు?
అవును నేను రోజు పూజించే ఫొటోనే, ఆ ఫొటోనే మాకు కులదైవం!
ఆ ఫోటో అవసరంలో నాకు కవితా వస్తువు, నా ప్రాణ వాయువు
అవును నేను మరోసారి
ఆ అర్ధనగ్న బడుగు జీవికి కవిత్వభిషేకం చేస్తాను
నాకు తెలుసు నేస్తం, నే నేనాడు పిడికెడు అన్నం పెట్టక పోయినా
ఏ ఒక్కరి గుడిసేలో వెలిగే దీపానికి వత్తు కొనివ్వక పోయినా
నన్ను బ్రతికించేది మాత్రం ఆ పేదవాడే
నన్ను మాత్రమె కాదు, ఎంతమందిని మహాకవులను చేసాడని ?
ఎంతమందికి అవార్డులు ఇప్పించాడని, ఎన్ని కుటుంబాలను నిలబెట్టాడని?
ఆ లెక్క చేప్పనలవిది కాదు; చిరుగు చొక్కలతో, విస్తరాకుల్లాంటి బ్రతుకులతో,
తను తాగే గంజి నీటితో ఎంతమంది కవులకు కవితా దాహాన్ని తీర్చాడని!
పట్టెడు మెతుకులకు నోచుకోనివాడిని నేను ఎలుగెత్తి ఈ ప్రపంచం మొత్తానికి
వినిపించేలా అరవమంటే, మారు మాట్లాడకుండా ఎంత గట్టిగ అరిచాడని!
ఒక సమిధివై నువ్వు వెలగాలి అంటే ఇంటిలో వెలుగుతున్న దీపాన్ని ఆర్పి
తను దీపమై వెలిగాడని, తను బ్రతికున్న, పిల్లలనుకన్న, వాళ్ళు ఆకలితో ఏడుస్తున్న,
చివరకు తను చనిపోయిన ఏమాత్రం సంభంధంలేని నాలాంటి వాళ్ళ హృదయాలు కరిగించి,
మమ్మలను ఏడిపించి, తన బాధ మేము పడేలా చేసి , మా పెన్నుల్లో సిరాగ, మా బ్రతుకు చొక్కలమీద బొమ్మగా,
మా ఇంటిలో సన్మాన పత్రాలుగా మారిన కనిపించే దేవుడే పేదవాడు.
పేదవాడు తనని నమ్మే కవులకు ఏమాత్రం అన్యాయం చేయని మహనీయుడు
ఏ భందుత్వాలు చూడడు, నీ సన్మానం లో వాటా అడగడు, నీ జీవిత గమ్యానికి చొక్కలేని మెట్టావుతాడు
వాడి కన్నా గొప్ప కవితా వస్తువు ఏముంది నేస్తం? నన్ను ఈసారికి ఎప్పటిలాగే మన్నించు
మరో సారి పేదవాడి అవసరం నాకుంది
ఓ పేదవాడ నీకోసం నా కవితా విన్నపం, దయచేసి మీరు అంతా ఎన్ని తరాలైన ఇలాగే ఉండి
నాలాంటి సమాజసేయస్సు కోసం పాటుపడే కవులకు రాజపోషకులు కండి మీరు చస్తూ మమ్ములను బ్రతకనివ్వండి

Saturday, May 15, 2010
మన రాజకీయ అవగాహన రాహిత్యం
మనకు స్వాతంత్రం రాక ముందు ప్రతి భారతీయుడి లక్షం ఒక్కటే, బ్రిటిషు వాడిని దేశంనుండి వెళ్ళగొట్టడం. జై హింద్ అనే ఒక్క మాట అంటే చాలు ప్రతి ఒక్క భారతీయ హృదయం ఉప్పొంగి పోయేది. దేశ స్వాతంత్రం కన్నా మించి రాజకీయాల గురించి తెలుసుకోవలసిన అవసరం ఎవరకూ ఉండేది కాదు. సరే ఇప్పడు స్వతంత్రం వచ్చి యాభై సంవస్తరాలు పైగా అయ్యాయి ! ఇప్ప్పడున్న పరిస్థితి ఏమిటి ? అసలు మనకు రాజకీయాల గురించి నిజంగా ఏమిటి తెలుసు?
మనలో ప్రతిఒక్కరికి ప్రస్తుతం ఉన్న స్థితి కంటే ఇంకా బాగుండాలి, మన కాలనీ లో రోడ్లు చాల విశాలంగా ఉండాలి, ఒక చక్కటి స్కూల్ ఉండాలి, బస్సు సౌకర్యం ఉండాలి , ఆసుపత్రి ఉండాలి , మన ఊరు చాల అందంగా ఉండాలి , ట్రాఫ్ఫిక్ ఉండకూడదు, చక్కటి పరిశ్రమలు ఉండాలి , ఎన్నో ఉద్యోగాలు అందుబాటులో ఉండాలి, రేషన్ దొరకాలి , .... ఇలా అంతులేని కోరికల చిట్టా. ఇంత వరకు బాగానే ఉంది గాని ఇవన్నే సాధిచడం ఇలా , సరిగ్గా ఈ ప్రశ్న దగ్గరే ఒక రాజకీయ నాయకుడి జననం.
మనకు ఏమిటి తక్కువ , ఆ పక్క ఊరులో పైన చెప్పిన వన్ని ఉన్నాయి , మన తలరాత ఇలా ఉందేమిటి, పదండి ముందుకు, మనకు అన్నే వచ్చే వరకు పోరాటం చేద్దాం ఇది ఆ రాజకీయనకుడి మొదటి అడుగు. ఇక ప్రజల వైపు నుండి ఆలోచిస్తే , మనకు కొన్ని దొరకలేదు, మనం వాటిని సాధించు కోవాలి , అందుకు ఒక నాయకుడు కావాలి, ఆ నాయకుడు మనకోసం ఎన్నో కష్టాలు పడి, తను కొవ్వోతి ల కరిగి మనకు కరెంటు తెస్తాడు, తన చెమట ధారపోసి బోరింగు పంపు వేయిస్తాడు , ఎముకలతో ఇల్లు కట్టిస్తాడు , ఇలా జనం డిసైడు అయి పోతారు. సరే కానీ మన ప్రజలకు తెలిసింది ఇదేనా ? పోరాటం చెయ్యటం , లేని దాన్ని సాధించు కోవడం ఇంతేనా రాజకీయం?
చిన్న ఉదాహరణకు మన ఊరికి ఒక కొత్త బస్సు కావాలి, ఊరికి బస్సు రావాలంటే ఆ పని ఎవరు చెయ్యాలి? MLA న , MP న, మినిస్టర ? కలేక్టరా? కౌన్సులర? బస్సు ఒక్కటే కాదు ఒక స్కూల్ , ఆసుపత్రి , ఫ్యాక్టరీ ఇవి ఎవరి పనులు ? ఏ ఏ పనులకు ఎవరు భాద్యులు? అదే స్థానంలో ఇంతకు ముందున్న వాళ్ళు చేసిన పనులు ఏమిటి , ఇప్పుడున్న వాళ్ళు చేస్తోన్న పనులు ఏమిటి? మన పనులు జరగడం లేదంటే అది నాయకుడికి చేతకావడం లేదా? లేక నిధులు లేక ? ఇలాంటి ఆలోచనలు మనం నిజం గ చేస్తాం? మనకు తెలిసిందల్ల గట్టిగ జై కొట్టడమే, మిగత పని రాజకీయ నాయకులూ చూసుకొంటారు. లేదా రాజకీయ నాయకుడిని గాని వాళ్ళ పార్టీని గాని మనకు పనులు చేసి పెట్టనందుకు తిట్టడమే . జే కొట్టు లేక తిట్టు , రెండు ఎంతో చక్కని శ్రమలేని పనులు కదా!.
మన మీద మన పురాణాల ప్రభావం చాల ఉంటుంది. మనం కష్టాల్లో ఉంటాము, ఎంత ప్రయత్నించిన అందులోంచి బయటకు రాలేము అప్పుడు మనకోసం ఒకడు వస్తాడు , ఆరోజునుండి మనకే భయం లేదు , అన్ని పనులు అనుకోన్నట్టు గ జరుగు తాయి. నిజంగ మనకు ఆ భావన ఇప్పటికి కూడా ఉంది. ఇందుకు చక్కటి ఉదాహరణ ఈ రాజకీయాలు. రాజకీయ నాయకుడు రాతికి రాత్రే మన జాతకం మార్చేస్తాడు, ఎన్నో ఉచిత వరాలు అందిస్తాడు అని ఎన్నో కోట్లమంది ఈరోజుకు కూడా నమ్ముతున్నారు. రాజకేయం ఒక శాస్త్రం, ఒక మెడిసిన్ లాగా, 'లా' లాగా , ఇంజనీరింగ్ లాగా ప్రతి రాజకీయ నాయకుడు దానిని అభ్యసించాలి అని మన ఆలోచించం. రాజకీయ నాయకుల దగ్గర ఒక మంత్ర దండం ఉంటుంది, దానితో వాళ్ళు ఎన్ని పనులైన చేస్తామని మాటివ్వగలరు అనే అభిప్రాయంతో మనలో చాలామంది ఉన్నారు. రాజకీయ నాయకుడిని మనం ఒక పరిపాలన అధికారిగా, మనకు సేవ చెయ్యడం అతని కర్తవ్యమ్ అని కాకుండా వరాలిచ్చే దేవుడిల చూస్తాము. నీను మీకు ఉచితంగా ఇల్లు కట్టిస్తాను అంటే నువ్వు మా దేముడు అంటాం, దండలు వేస్తాం పూజలు చేస్తాం, వాళ్ళ వారసులకు కూడా అదే సంప్రదాయం కొనసాగిస్తాం. వంద కోట్ల జనాభా ఉన్న పేద భారత దేశంలో కొన్ని వేల ఇల్లు ఉచితంగా కట్టిస్తాము అంటే మరో ఆలోచన లేకుండా నమ్మేస్తము, అది రాజకీయ శాస్త్రం ప్రకారం ఎలా సాధ్య పడుతుందో మనకు అక్కరలేదు. మనకు తెలిసిందల్ల జై కొట్టడమే , ఎవరినా ఏదైనా ఇస్తే తీసుకోవడమే , ఇస్తానన్న మాట అన్నంత మాత్రాన ఆశపడి పోవడమే. దాని సాధ్య సాధ్యాలు కానీ , పరిధి కానీ మనకు అవసరం లేదు.
ఇంతకూ ముందు జై హింద్ అనే ఒక్క నినాదం ఉండేది, మనకు అక్కరలేని పరాయి పాలనని తరిమి కొట్టడానికి , తెల్ల వాళ్ళ గుండెల్లో ప్రతిధ్వని౦చెధీ. ఇప్పడు మనం కొట్టే జే జే లు మాత్రం మనకు ఏదైనా ఇస్తానన్నఒట్టి మాటలకే సరిపోతున్నయి . భారత రాజ్యాంగాన్ని చిన్న తనం నుండి ఒక సబ్జెక్టు లాగా బోధించి, ప్రతి రాజకీయ నాయకుడికి రాజ్యాంగ పరీక్షా పెట్టి పాసైన తర్వాతే పదవిలోకి అనుమతించాలి. ఇక పైన ఎవరినా ప్రజాధనం తో మీకు ఉచితంగా ఏదైనా పని చేస్తామని చెపితే వాళ్ళను తక్షణం పదవినుండి తొలిగించాలి, ప్రజలు రాజకేయ శాస్త్రం మీద అవగాహన పెంచుకోవాలి, దానికోసం మన మీడియా చాల కృషి చేయాలి, వారసత్వపు రాజకీయాలను దూరం చేయాలి. అప్పుడైనా దండలు, దండాలు నిజమైన దేవుల్లకే చెందుతాయి.

Subscribe to:
Posts (Atom)